రిలయన్స్ సొంత ఈ-కామర్స్ వెబ్‌సైట్ వచ్చేసింది

Jio.comలో రిలయన్స్‌‌కు సంబంధించిన అన్ని ప్రొడక్ట్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.

|

4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ అందుబాటులోకి తీసుకువచ్చని LYF స్మార్ట్‌ఫోన్‌లను ఇక పై Jio.com వెబ్‌సైట్‌లోకి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

 రిలయన్స్ సొంత ఈ-కామర్స్ వెబ్‌సైట్ వచ్చేసింది

రిలయన్స్ తన సొంత ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయిన Jio.comలో రిలయన్స్‌‌కు సంబంధించిన అన్ని ప్రొడక్ట్‌లను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసకువస్తోంది. ప్రస్తుతానికి కొన్ని మోడళ్ల లైఫ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు జియోఫై హాట్‌స్పాట్‌లను అందుబాటులో ఉంచింది. త్వరలో రిలయన్స్‌కు సంబంధించిన మరిన్ని ప్రొడక్ట్‌లను ఈ వెబ్‌సైట్‌లో యాడ్ చేసే అవకాశముంది.

హోమ్ డెలివరీ సర్వీస్ ...

హోమ్ డెలివరీ సర్వీస్ ...

హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీస్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసింది. ఈ రెండు ప్రాంతాలకు చెందిన యూజర్లు జియో సిమ్‌ను ఆర్డర్ చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి జియో అధికారిక ఫేస్‌బుక్ పేజీలోకి లాగిన్ అవ్వండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sign Up ఆప్షన్ మీకు కనిపిస్తుంది

Sign Up ఆప్షన్ మీకు కనిపిస్తుంది

ఆ పేజీలో మీకు "Get Your Jio SIM Home Delivered" పేరుతో ఓ లింక్ కనిపిస్తుంది. "Get Your Jio SIM Home Delivered" లింక్ పై క్లిక్ చేసిన వెంటనే Sign Up ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

మీరు ఉంటున్న నగరాన్ని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది

మీరు ఉంటున్న నగరాన్ని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది

సైనప్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే కొన్ని వివరాలతో కూడిన ప్రత్యేకమైన బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్‌లో మీ మెయిల్ ఐడీ అలానే మీ మొదటి పేరును ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చే కాలమ్‌లో మీ అడ్రస్‌ను ఎంటర్ చేసి, మీరు ఉంటున్న నగరాన్ని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

12 నగరాల్లో..

12 నగరాల్లో..

ప్రస్తుతం జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీస్ 12 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. అహ్మదాబాద్, బెంగళూరు, చండీఘడ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నావీ ముంబై, పూణే, విశాఖపట్నం.

 Schedule SIM delivery..

Schedule SIM delivery..

యూజర్ తన వివరాలన్నింటిని కరెక్ట్‌గా ఎంటర్ చేసిన తురవాత పేజీ క్రింద కనిపించే Schedule SIM delivery అనే ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే జియో సిమ్ ఆర్డర్ విజయవంతమైనట్లే. త్వరలో సిమ్ డిస్పాచ్ కాబడుతుంది.

డెలివరీ సమయంలో ..

డెలివరీ సమయంలో ..

సిమ్ డెలివరీ సమయంలో యూజర్ ముందుగా డాక్యుమెంట్‌లో పేర్కొన్న అడ్రస్‌లోనే ఉండాలి. అంతేకాకుండా ఆధార్ కార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio starts selling LYF smartphones, JioFi 2 4G hotspot on Jio.com. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X