వాళ్లకు షాక్, నిలిచిపోతున్న జియో సేవలు

ఇంత కాలంగా జియో అందిస్తోన్న ఉచిత సేవలుకు శుభం కార్డు పడబోతోంది. ఇప్పటి వరకు ఏ విధమైన జియో ఆఫర్‌లను సబ్‌స్ర్కైబ్ చేసుకోని చందాదారుల కనెక్షన్‌లను జియో నిలుపుదల చేస్తున్నట్లు సమాచారం.

Read More : మోటరోలా కొత్త ప్లాన్, రూ.6,000కే షియోమీని తలదన్నే ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నిలిపివేత పక్రియ మొదలైంది...

ట్రాయ్ సూచనల మేరకు సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను అర్థంతరంగా నిలిపివేసిన జియో, సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ స్థానంలో జియో ధన్ దనా ధన్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ గడువు కూడా ఏప్రిల్ 15తో ముగియటంతో జియో ఉచిత సేవలు నిలిపివేత పక్రియ మొదలైంది.

చివరి ఛాన్స్..?

కనెక్షన్ నిలిపివేతకు సంబంధించిన మెసేజ్‌లను ఇప్పటికే ఆయా యూజర్లకు జియో పంపించటం మొదలు పెట్టింది. ఈ మెసేజ్ ప్రకారం జియో యూజర్లు ఇప్పటికైనా సరే రూ.408 (రూ.99 + రూ.309) చెల్లించి జియో ప్రైమ్ ఆఫర్‌తో పాటు జియో ధన్ దనా ధన్ ఆఫర్ ను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొదటి ప్లాన్‌ ఖరీదు రూ.309

ధన్ దనా ధన్ పేరుతో జియో అనౌన్స్ చేసిన కొత్త్ ఆఫర్‌ ప్రత్యేకతలు

మొదటి ప్లాన్‌లో భాగంగా నెలకు 28 రోజులు చొప్పున మూడు నెలల పాటు రోజుకు 1జీబి డేటాతో అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. జియో ప్రైమ్ యూజర్లకు ఈ ప్లాన్‌ రూ.309కే అందుబాటులో ఉంటుంది. నాన్ జియో ప్రైమ్ యూజర్లు మాత్రం (రూ.99 + రూ.309) చెల్లించి ఈ ప్లాన్‌ను తీసుకోవల్సి ఉంటుంది.

రెండవ ప్లాన్ ఖరీదు రూ.509..?

ధన్ దనా ధన్ పేరుతో జియో అనౌన్స్ చేసిన కొత్త్ ఆఫర్‌ ప్రత్యేకతలు

మరొక ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.509 చెల్లించటం ద్వారా మూడు నెలల పాటు రోజుకు 2జీబి డేటాతో అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. నాన్ జియో ప్రైమ్ యూజర్లు ఈ ప్లాన్‌ను సొంతం చేసుకోవాలంటే (రూ.99 + రూ.509) చెల్లించాల్సి ఉంటుంది.

ర్యామ్ గురించి ముఖ్యమైన విషయాలు

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to Stop Offering Free 4G Services for Users Who Did Not Recharge, Dhan Dhana Dhan Offer Still Available. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot