Home
News

జియో జోరు తగ్గిందంటున్న ట్రాయ్..

టెలికం మార్కెట్లను అతలాకుతలం చేసిన రిలయన్స్ జియో జోరు తగ్గిముఖం పట్టినట్లుగా తెలుస్తోంది.

By Hazarath

టెలికం మార్కెట్లను అతలాకుతలం చేసిన రిలయన్స్ జియో జోరు తగ్గిముఖం పట్టినట్లుగా తెలుస్తోంది. ఈ కంపెనీకి కొత్తగా యాడ్‌ అయ్యే సబ్‌స్క్రైబర్ల సంఖ్య నెమ్మదించింది. ఆగస్టులో నెలలో ఈ టెలికాం కంపెనీ కేవలం 4.09 మిలియన్‌ కస్టమర్లను మాత్రమే చేర్చుకుంది. లాంచింగ్‌ నుంచి కంపెనీ ఇలా తక్కువ నెలసరి వృద్ధి నమోదుచేయడం ఇది రెండో సారని ట్రాయ్ తెలిపింది. అయినప్పటికీ మార్కెట్‌ షేరును రాబట్టుకోవడంలో జియో ముందంజలో ఉందని తెలుస్తోంది.

గతేడాది సెప్టెంబర్‌లో..

గతేడాది సెప్టెంబర్‌లో..

జియో ఈ కంపెనీ గతేడాది సెప్టెంబర్‌లో తన సేవలను ప్రారంభించగా ప్రతి నెలా 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను తన సొంతం చేసుకుంటూ వస్తోంది.

ఏప్రిల్‌లో ఈ సంఖ్య 3.87 మిలియన్లకు

ఏప్రిల్‌లో ఈ సంఖ్య 3.87 మిలియన్లకు

కానీ ఏప్రిల్‌లో ఈ సంఖ్య 3.87 మిలియన్లకు పడిపోయింది. జనవరి వరకైతే ఏకంగా ప్రతినెలా 16 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను యాడ్‌ చేసుకుంది.

 కొత్త ఆఫర్లు మేలో ప్రకటించడంతో..

కొత్త ఆఫర్లు మేలో ప్రకటించడంతో..

ఫిబ్రవరిలో ఈ సంఖ్య 12 మిలియన్లకు, తర్వాత మార్చిలో 5.83 మిలియన్లకు, ఏప్రిల్‌లో ఆల్‌-టైమ్‌ కనిష్టం 3.87 మిలియన్లకు తగ్గుతూ వచ్చింది. కాగా కొత్త ఆఫర్లు మేలో ప్రకటించడంతో మే నెలలో ఈ సంఖ్య పెరిగింది.

ఫీచర్‌ ఫోన్‌ లాంచ్‌ చేయడంతో..

ఫీచర్‌ ఫోన్‌ లాంచ్‌ చేయడంతో..

ఫీచర్‌ ఫోన్‌ లాంచ్‌ చేయడంతో సబ్‌స్క్రైబర్‌ సంఖ్య పెరుగుతుందని జియో భావించినా, సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగకుండా తగ్గిందని సైబర్‌ మీడియా రీసెర్చ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ప్రిన్సిపల్‌ అనలిస్ట్‌ ఫైసల్‌ కవోసో తెలిపారు.

వైర్‌లెస్‌ మార్కెట్‌లో

వైర్‌లెస్‌ మార్కెట్‌లో

ఇక వైర్‌లెస్‌ మార్కెట్‌లో 23.7 శాతంతో ఎయిర్‌టెల్‌ ముందంజలో ఉండగా... వొడాఫోన్‌ 17.55 శాతంతో రెండో స్థానంలో, ఐడియా 16.11 శాతంతో మూడో స్థానంలో, జియో 11.19 శాతంతో నాలుగో స్థానంలో, బీఎస్‌ఎన్‌ఎల్‌ 8.88 శాతంతో ఐదో స్థానంలో, ఎయిర్‌సెల్‌ 7.52 శాతంతో ఆరో స్థానంలో ఉన్నాయి.

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio subscriber addition drops to 4 million in August More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X