రూ. 1000 నుంచి రూ 6 లక్షల కోట్లకు, 16 కోట్ల మందిని తాకిన జియో

By Hazarath
|

పారిశ్రామిక దిగ్గజం జియో అధినేత ముఖేష్ అంబాని రిలయన్స్ గ్రూపు 40వ వార్షికోత్సవ వేడుకలను ముంబైలో అట్టహాసంగా నిర్వహించారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్‌ అంబానీకి రిలయన్స్ ఫ్యామిలీ ఘనంగా నివాళులు అర్పించింది. ఈ సంధర్భంగా జియో అధినేత ముఖేష్ అంబాని తన జీవిత ప్రస్థానంలోని మైళురాళ్లను అలాగే భవిష్యత్ వ్యూహలను అందరితో షేర్ చేసుకున్నారు.

 

రోజుకు 1జిబి డేటా, రూ. 70 రోజులు, బెస్ట్ ఏదో సెలక్ట్ చేసుకోండి..?రోజుకు 1జిబి డేటా, రూ. 70 రోజులు, బెస్ట్ ఏదో సెలక్ట్ చేసుకోండి..?

 1,000 ఇన్వెస్ట్‌ చేసిన వారి పెట్టుబడి విలువ..

1,000 ఇన్వెస్ట్‌ చేసిన వారి పెట్టుబడి విలువ..

రూ. 1,000తో ప్రారంభమైన కంపెనీ నేడు రూ. 6 లక్షల కోట్ల స్థాయికి ఎదిగిందని, 1977లో ఆర్‌ఐఎల్‌లో రూ. 1,000 ఇన్వెస్ట్‌ చేసిన వారి పెట్టుబడి విలువ ప్రస్తుతం 2009 రెట్లు పెరిగి రూ. 20.9 లక్షల స్థాయికి చేరిందని ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.

టాప్‌ 20 కంపెనీల్లో ..

టాప్‌ 20 కంపెనీల్లో ..

ధీరుభాయ్‌ దార్శనికత, లక్ష్యాలు, సూత్రాలకు రిలయన్స్‌ గ్రూప్‌ కట్టుబడి ఉంటుందని. ప్రపంచంలోని టాప్‌ 20 కంపెనీల్లో రిలయన్స్‌ను నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జియో అధినేత ప్రకటించారు.

 సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో రికార్డుల మోత
 

సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో రికార్డుల మోత

కాగా జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో రికార్డుల మోత మోగిస్తోంది. సంవత్సరం గడిసి మూడు నెలలైన కాలంలోనే రిలయన్స్‌ జియో కస్టమర్ల సంఖ్య 16 కోట్లను తాకింది. ఈ విషయాన్ని ముఖేష్‌ అంబానీ కొడుకు ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు.

 ఆరు నెలల పాటు ప్రమోషనల్‌ ఆఫర్‌తో ..

ఆరు నెలల పాటు ప్రమోషనల్‌ ఆఫర్‌తో ..

రిలయన్స్‌జియో ఆరు నెలల పాటు ప్రమోషనల్‌ ఆఫర్‌తో గతేడాది సెప్టెంబర్‌లో టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి టెలికాం మార్కెట్‌లో ధరల యుద్ధం ప్రారంభమైంది.

 5జీ వాతావరణంలో..

5జీ వాతావరణంలో..

మరోవైపు దేశీయ టెలికాం ఆపరేటర్లు భద్రతాపరమైన విషయాల్లో ముఖ్యంగా 5జీ వాతావరణంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్‌ జియో చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ బ్రిజేష్‌ దత్తా తెలిపారు.

కస్టమర్లకు సెక్యురిటీ పరమైన సర్వీసులు..

కస్టమర్లకు సెక్యురిటీ పరమైన సర్వీసులు..

ఆధునిక టెక్నాలజీలు సాఫ్ట్‌వేర్‌ డిఫైన్‌డ్‌ నెట్‌వర్కింగ్‌, నెట్‌వర్క్స్‌ ఫంక్షన్స్‌ వర్చ్యూలైజేషన్‌ వంటి వాటిని స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీస్‌ రిటైల్‌, సంస్థ కస్టమర్లకు సెక్యురిటీ పరమైన సర్వీసులు అందజేస్తాయన్నారు.

రిలయన్స్‌ ఫ్యామిలీ డే వేడుకలకు..

రిలయన్స్‌ ఫ్యామిలీ డే వేడుకలకు..

నేవీ ముంబయిలోని రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌లో నిర్వహించిన రిలయన్స్‌ ఫ్యామిలీ డే వేడుకలకు ముకేశ్‌ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సుమారు 50,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబీకులు హాజరయ్యారు.

Best Mobiles in India

English summary
Reliance Jio subscriber base touches 160 million More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X