Home
News

జియో ఉచిత ఆఫర్లను పొందేందుకు ఇదే చివరి ఛాన్స్..?

సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌కు నేటి అర్థరాత్రితో ముగింపు పలకబోతున్నట్లు సమాచారం.

By Sivanjaneyulu Bommu

ట్రాయ్ ఉత్తర్వులు నేపథ్యంలో జియో తన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌కు నేటి అర్థరాత్రితో ముగింపు పలకబోతున్నట్లు సమాచారం. కాబట్టి, జియో యూజర్లు ఈ అర్థరాత్రిలోపు ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పాటు రూ.303 అంతకంటే ఎక్కువ ప్యాకేజీని తీసుకున్నట్లయితే మూడు నెలల పాటు జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ కాంప్లీమెంటరీ బెనిఫిట్స్ లభించే అవకాశం ఉంది.

Read More : నోకియా 9 vs వన్‌ప్లస్ 5, ఈ ఏడాది పెద్ద పోటీ ఇదేనా..?

ట్రాయ్ ఆదేశాలను స్వాగితిస్తూ...

ట్రాయ్ ఆదేశాలను స్వాగితిస్తూ...

ట్రాయ్ ఆదేశాలను స్వాగితిస్తూ జియో తన  సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌లను రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రం ఆఫర్ అందుబాటులో ఉంటుందని జియో స్పష్టం చేసింది.

ఆఫర్‌ను నిలిపివేసే‌లోపు రీచార్జ్ చేసుకున్నట్లయితే..

ఆఫర్‌ను నిలిపివేసే‌లోపు రీచార్జ్ చేసుకున్నట్లయితే..

రిలయన్స్ చెప్పినదాని బట్టి చూస్తుంటే, సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను నిలిపివేసే‌లోపు ఆ ప్లాన్‌లను సబ్‌స్ర్కైబ్ చేసుకున్న వారికి ఆయా బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయని స్పష్టమవుతోంది.

మార్చి 31, 2017న ఏం జరిగింది..?

మార్చి 31, 2017న ఏం జరిగింది..?

రిలయన్స్ జియో తన ప్రైమ్ మెంబర్‌ షిప్ చివరి తేదీని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ మార్చి 31, 2017న ఒక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌లను కూడా జియో మార్కెట్లో అనౌన్స్ చేసింది.

సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌ వల్ల లాభాలు

సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌ వల్ల లాభాలు

సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.303 అంతకంటే ఎక్కువ ప్లాన్‌లను ఎంపిక చేసుకున్నట్లయితే అదనంగా మూడు నెలల పాటు సంబంధిత ఆఫర్‌కు సంబంధించిన ఉచిత బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

జూలై 2017  వరకు హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్‌

జూలై 2017 వరకు హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్‌

ఉదాహరణకు మీరు సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌లో భాగంగా రూ.303 ప్లాన్ తీసుకున్నారనుకుందాం. మీరు ఈ 303 ప్యాక్‌తో జూలై వరకు హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్‌లో ఉన్న అన్ని బెనిఫిట్స్ పొందే వీలుంటుంది.

రూ.499 ప్లాన్ తీసుకున్నట్లయితే..

రూ.499 ప్లాన్ తీసుకున్నట్లయితే..

 ఒకవేళ మీరు రూ.499 ప్లాన్ తీసుకున్నట్లయితే జూలై వరకు రోజుకు 2జీబి జియో 4జీ డేటాతో పాటు జియో ఆఫర్ చేసే అన్ని బెనిఫిట్స్ పొందే వీలుంటుంది. సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌లో భాగంగా జియో అందుబాటులోని అన్ని ఆఫర్లను జియో అఫీషియల్ సైట్‌‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio Summer Surprise Offer to be discontinued from Midnight. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X