జియో ప్రైమ్ యూజర్లు రూ.499 ప్లాన్ తీసుకుంటే..?

రిలయన్స్ జియో తన ప్రైమ్ మెంబర్ షిప్ చవరి తేదీని ఏప్రిల్ 15 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌లను కూడా జియో మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.303 అంతకంటే ఎక్కువ ప్లాన్‌లను ఎంపిక చేసుకున్నట్లయితే అదనంగా మూడు నెలల పాటు సంబంధిత ఆఫర్‌కు సంబంధించిన ఉచిత బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

Read More : జమ్ము- శ్రీనగర్‌ సొరంగ మార్గం, 124 అత్యాధునిక కెమెరాలతో నిరంతర నిఘా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జూలై వరకు హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్‌

ఉదాహరణకు మీరు సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌లో భాగంగా రూ.303 ప్లాన్ తీసుకున్నారనుకుందాం. మీరు ఈ 303 ప్యాక్‌తో జూలై వరకు హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్‌లో ఉన్న అన్ని బెనిఫిట్స్ పొందే వీలుంటుంది.

రూ.499 ప్లాన్ తీసుకున్నట్లయితే..

ఒకవేళ మీరు రూ.499 ప్లాన్ తీసుకున్నట్లయితే జూలై వరకు రోజుకు 2జీబి జియో 4జీ డేటాతో పాటు జియో ఆఫర్ చేసే అన్ని బెనిఫిట్స్ పొందే వీలుంటుంది. సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌లో భాగంగా జియో అందుబాటులోని అన్ని ఆఫర్లను జియో అఫీషియల్ సైట్‌‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

రూ.149 ప్లాన్‌లో ఉన్న వారి పరిస్థితి ఏంటి..?

వాస్తవానికి రూ.149 ప్లాన్‌ క్రింద ఎటువంటి సమ్మర్ సర్‌ప్రైజ్ ప్లాన్‌ను జియో ప్రకటించలేదు. ఇప్పటికే రూ.149 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న జియో ప్రైమ్ యూజర్లు ఏప్రిల్ 15లోగా రూ.499 లేదా రూ.303 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే వారికి మొదటి మూడు నెలల పాటు సంబంధిత ఆఫర్‌ తాలుకా ఉచిత బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. రూ.149 ప్లాన్‌ తాలుకూ బెనిఫిట్స్ జూలై 1 నుంచి జూలై 28 వరకు అందుబాటులో ఉంటాయి.

ఏప్రిల్ 16 నుంచి వాడుకలోకి..

జియో సమ్మర్ ఆఫర్ ప్లాన్స్ ఏప్రిల్ 16 నుంచి వాడుకలోకి వస్తాయి. అప్పటి వరకు జియో హ్యాపీ న్యూఇయర్ తాలుకా సేవలు కొనసాగుతూనే ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Summer Surprise Offer: Details to Know Jio Prime Membership Before April 16. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot