జియోకు షాక్, సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ నిలిపివేత

రిలయన్స్ జియోకు టెలికం శాఖ షాకిచ్చింది. ఇటీవల అనౌన్స్ చేసిన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను తక్షణమే రిలయన్స్ జియో వెనక్కితీసుకోవాలంటూ ఇండియన్ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది.

Read More : టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో రాకతో ఇతర టెల్కోలకు చుక్కలు

ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ జియో ఇతక టెల్కోలకు చుక్కలు చూపిస్తోన్న విషయం తెలిసిందే. జియో అనౌన్స్ చేస్తున్న కొత్త ఆఫర్ల దెబ్బకు ప్రత్యర్థి కంపెనీలు భారీగానే నష్టపోతున్నాయి.

ఆఫర్‌ను నిలిపివేస్తున్నట్లు జియో ప్రకటన..

ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను నిలిపివేస్తున్నట్లు జియో ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రం ఆఫర్ అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది.

వాళ్లకు కొంత ఉపశమనం

ట్రాయ్ తీసుకున్న నిర్ణయం ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు కొంత ఊరటనిచ్చేదిగా భావించవచ్చు.

ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో..

ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ నిలిచిపోయినప్పటికి
ప్రైమ్ మెంబర్‌షిప్ మాత్రం ఏప్రిల్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటి ప్రైమ్‌ మెంబర్‌షి‌ప్‌ను తీసుకోని జియో యూజర్లు రూ.99 చెల్లించి ప్రైమ్ యూజర్లుగా మారిపోవచ్చు.

మార్చి 31న ఏం జరిగింది..?

జియో తన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను మార్చి 31, 2017న అనౌన్స్ చేసింది. జియో ప్రైమ్ యూజర్లకు మాత్రమే వర్తించగలిగే ఈ ఆఫర్‌లో భాగంగా ఏప్రిల్ 15లోపు యూజర్లు రూ.303 అంతకన్నా ఎక్కువ ప్లాన్‌లను ఎంపిక చేసుకున్నట్లయితే 3 నెలల పాటు అదనంగా కాంప్లిమెంటరీ సేవలు అందుబాటులో ఉంటాయి. రిలయన్స్ చెబుతోన్న దాని ప్రకారం జియో ప్రైమ్ సర్వీసులను 7.2 కోట్ల మంది సబ్‌స్ర్కైబ్ చేసుకున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Summer Surprise Offer Withdrawn After TRAI Order. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot