అన్న చేతికి తమ్ముడు ఆస్తులు, జియోతో ఆర్‌కామ్ చెట్టాపట్టాల్ !

Written By:

చాలా ఏళ్ల తరువాత అంబానీ సోదరుల బంధం మళ్లీ కొత్త చిగురులు తొడగబోతోంది.అనిల్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)కు చెందిన మొబైల్‌ వ్యాపార ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు ముకేశ్‌ అంబానీ టెలికాం వెంచర్‌ రిలయన్స్‌ జియో ప్రకటించింది. నష్టాలతో సతమతమవుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్‌ని జియో కొనుగోలు చేయబోతుందనే వార్తలు ఆర్‌కామ్‌ని లాభాల వైపుకు పరుగులు పెట్టించబోతున్నాయి.

ఆకాశానికి అన్న, పాతాళానికి తమ్ముడు, తేడా ఎక్కడుంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.24,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల స్థాయిలో..

బిడ్డింగ్‌ నిబంధనలకు లోబడి ఈ డీల్‌ విలువ ఎంతనేది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. కాగా బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఒప్పందం విలువ రూ.24,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని అంచనా.దీనిని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

ఒప్పందం

యూఆర్‌కామ్‌ దాని అనుబంధ విభాగాలకు చెందిన కొన్ని ఆస్తులను కొనుగోలు చేసేందుకు మా సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ప్రకటించింది.

రూ.45,000 కోట్ల మేర రుణభారంతో..

కాగా దాదాపు రూ.45,000 కోట్ల మేర రుణభారంతో సతమతం అవుతున్న ఆర్‌కామ్‌కు ఈ ఒప్పందం భారీ ఊరట కల్పించనుంది. ఎందుకంటే, ఈ డీల్‌ ద్వారా సమకూరే నిధులను పూర్తిగా అప్పులు తిరిగి చెల్లించేందుకు ఉపయోగించనున్నట్లు సంస్థ తెలిపింది.

మార్చిలోగా పూర్తి పరిష్కారం చూపుతామంటూ..

ఆర్‌కామ్‌ ఆస్తులను అమ్మేసి అప్పుల సమస్యకు మార్చిలోగా పూర్తి పరిష్కారం చూపుతామంటూ అనిల్‌ అంబానీ మెగా ప్లాన్‌ ప్రకటించిన రెండు రోజులకే ఈ డీల్ వెలవడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

4 కేటగిరీల్లో..

రియలన్స్‌ జియో లేదా దాని నామినీలు ఆర్‌కామ్‌, దాని అనుబంధ విభాగాల నుంచి టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌, స్పెక్ట్రం, మీడియా కన్వర్జెన్స్‌ నోడ్స్‌ కేటగిరీలను కొనుగులో చేయనున్నాయి.

వైర్‌లెస్‌ సేవలకు

తమ సంస్థ వైర్‌లెస్‌, ఫైబర్‌ టు హోమ్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సర్వీసెస్‌ సేవలందించేందుకు ఆర్‌కామ్‌ నుంచి కొనుగోలు చేయబోయే ఆస్తులు ఎంతగానో దోహదపడనున్నాయని రిలయన్స్‌ జియో పేర్కొంది.

జియో కొనుగోలు చేయబోయే ఆర్‌కామ్‌ ఆస్తులు ఇవే

800, 900, 1800, 2100 మెగాహెట్జ్‌ బ్యాం డ్‌ విడ్త్‌లకు చెందిన 122.4 మెగాహెట్జ్‌ల 4జి స్పెక్ట్రం
43,000కు పైగా మొబైల్‌ టవర్లు. ప్రస్తుతం ఆర్‌కామ్‌ దేశంలోని మూడో అతిపెద్ద టవర్‌ హోల్డింగ్‌ కంపెనీ.
దేశవ్యాప్తంగా ఉన్న 1,78, 0000 ఆర్‌కెఎంల ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌
50 లక్షల చదరపు అడుగుల టెలికం మౌలికవసతులను కవర్‌ చేసే 248 మీడియా కన్వర్జెన్స్‌ నోడ్స్‌.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to take over mobile business assets of troubled Reliance Communications More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot