దేశీయ టెలికాం రంగంలో రోజురొజుకు సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో మరో విప్లవానికి తెరలేపబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టెలికాం సర్వీసులు, స్మార్ట్‌ఫోన్లు, 4జీ ఫీచర్ ఫోన్ వంటి వాటితో ఇప్పటికే మార్కెట్‌లో తిరుగులేకుండా ఉన్న జియో.. ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెరతీయబోతోందని తెలుస్తోంది. తన ARPU(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్)ను పెంచుకోవడం కోసం సిమ్ కార్డుతో కూడిన ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనిపై ఇప్పటికే అమెరికా చిప్ దిగ్గజం క్వాల్‌కామ్‌తో ముకేష్ అంబానీకి చెందిన జియో కంపెనీ చర్చలు కూడా జరిపిందని సమాచారం.
ఐపీఎల్ సందర్భంగా దిగ్గజాలు ఇస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవే
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో..
బిల్ట్-ఇన్ సెల్యులార్ కనెక్షన్స్‌తో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ల్యాప్‌టాప్‌లను రిలయన్స్ జియో మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా క్వాల్‌కామ్ ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోన్ కోసం జియోతో కలిసి పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
క్వాల్‌కామ్ టెక్నాలజీస్ ..
దీనిపై క్వాల్‌కామ్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ సీనియర్ డైరెక్టర్ మిగ్యుల్ న్యున్స్ స్పందిస్తూ జియోతో మేము మాట్లాడాం. డేటా, కంటెంట్‌తో కూడిన ఒక డివైజ్‌ను వారు తేవాలనుకుంటున్నారని చెప్పారు.
స్నాప్‌డ్రాగన్ 835 అందించే ల్యాప్‌టాప్‌లను..
ఈ చీప్‌మేకర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) బ్రాండ్ స్మార్ట్రాన్‌తో కూడా కలిసి పనిచేస్తోంది. సెల్యులార్ కనెక్టివిటీతో స్నాప్‌డ్రాగన్ 835 అందించే ల్యాప్‌టాప్‌లను ఇది ప్రవేశపెట్టబోతోంది. కాగా ఈ చర్చలను స్మార్ట్రాన్ కూడా ధృవీకరించింది. గ్లోబల్‌గా హెచ్‌పీ, ఆసుస్, లెనోవో వంటి కంపెనీలతో కూడా క్వాల్‌కామ్ పనిచేస్తోంది.
ఆపరేటర్లు తమ ఆర్పూను పెంచుకోవడానికి..
ఆపరేటర్లు తమ ఆర్పూను పెంచుకోవడానికి తర్వాత డివైజ్‌లు, సెల్యులార్ కనెక్టెడ్ ల్యాప్‌టాప్‌లేనని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డివైజస్, ఎకోసిస్టమ్స్ రీసెర్చ్ డైరెక్టర్ నైల్ షా అన్నారు. కౌంటర్‌పాయింట్ డేటా ప్రకారం భారత్‌లో ఏటా 50 లక్షల ల్యాప్‌టాప్‌లు అమ్ముడుపోతున్నాయని తెలిసింది.
ఈ విషయంపై స్పందించడానికి ..
అయితే ఈ విషయంపై స్పందించడానికి రిలయన్స్ జియో నిరాకరించింది. మరి ఈ వార్తలు నిజమైతే ల్యాపీ ప్రపంచంలో మరో విప్లవానికి తెరలేచినట్లేనని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.