Home
News

ఇక ఫోన్ బిల్లుల బాదుడు షురూ..

ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిన ఫోన్ బిల్లులు ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రిలయన్స్ జియో టారిఫ్ ధరలను పెంచడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ధరలను మార్చే అవకాశం ఉంది.

By Hazarath

ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిన ఫోన్ బిల్లులు ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రిలయన్స్ జియో టారిఫ్ ధరలను పెంచడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ధరలను మార్చే అవకాశం ఉంది. 4జీ టారిఫ్ ప్లాన్ల ధరలను 15 నుంచి 20 శాతం వరకు పెంచుతూ అక్టోబర్ 19న జియో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని బేస్ చేసుకుని టాప్ 3 టెలీకాం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా మళ్లీ బిల్లుల వాత వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

మూడు కంపెనీలు తమ టారిఫ్ ధరలను..

మూడు కంపెనీలు తమ టారిఫ్ ధరలను..

ఇప్పటి వరకు జియో అందిస్తున్న తక్కువ ధరల పోటీని తట్టుకోవడానికి ఈ మూడు కంపెనీలు తమ టారిఫ్ ధరలను బాగా తగ్గించాయి.

 

జియో ధరలను పెంచుతూ..

జియో ధరలను పెంచుతూ..

అయితే ఇప్పుడు జియో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో నష్టాల్లో ఉన్న ఆయా కంపెనీలు ఇకపై ధరలు పెంచవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గత త్రైమాసికంలో నష్టాలను..

గత త్రైమాసికంలో నష్టాలను..

జియో గత త్రైమాసికంలో నష్టాలను చవిచూడటంతో దాన్ని పూడ్చుకోవడానికి చిన్న టారిఫ్ ప్లాన్లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా రూ.149 ప్లాన్‌లో 4జీ డాటా పరిమితిని 28 రోజులపాటు 4జీబీకి పెంచింది

రూ.399 ప్లాన్ ధరను కూడా ..

రూ.399 ప్లాన్ ధరను కూడా ..

ప్రస్తుతం బాగా పాపులర్ అయిన రూ.399 ప్లాన్ ధరను కూడా జియో పెంచింది. దీని ధరను రూ.459కి పెంచడమే కాకుండా 84 రోజులున్న కాలపరిమితిని 70కి తగ్గించింది. దీంతో వినియోగదారులు కూడా ఈ పెద్ద ప్లాన్లకు బదులు చిన్న ప్లాన్లను తీసుకునే అవకాశాలున్నాయి.

ధరల పెరుగుదల..

ధరల పెరుగుదల..

ధరల పెరుగుదల టెలికాం కంపెనీలకు సానుకూలమైన అంశమని స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ యుబిఎస్‌ అంటోంది. కాబట్టి రానున్న కాలంలో వినియోగదారులకు ఛార్జీల మోత తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio tariff revision gives Airtel, Vodafone, Idea room for price hike Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X