Home
News

కొత్తగా విడుదలైన రిలయన్స్ జియో ఆఫర్లు ఇవే!

By Sivanjaneyulu Bommu

కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా నెలకున్న సస్పెన్స్‌కు తెరదించుతూ రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్‌లను, ఆ కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ముంబైలో జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గురువారం విడుదల చేసారు.

కొత్తగా విడుదలైన రిలయన్స్ జియో ఆఫర్లు ఇవే!

Read More : మీ పాత నెంబర్‌తోనే Reliance Jioలోకి మారటం ఎలా..?

జియో నెట్‌వర్క్‌లో భాగంగా వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవని, 4జీ డాటా పై ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న మొత్తంలో కేవలం 10వ వంతు మాత్రమే రిలయన్స్ జియో తన 4జీ డేటా పై వసూలు చేస్తుందని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తెలిపారు. ఎంబీకి 5 పైసుల చప్పున 1జీబికి రూ.50 మాత్రమే ఛార్జ్ ఉంటుందని ఆయన తెలిపారు. రిలియన్స్ జియో సర్వీసులు సెప్టంబర్ 5 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయని ముకేశ్ అంబానీ తెలిపారు.

#1

#1

'Jio welcome offer'లో భాగంగా ప్రతిఒక్కరూ జియో సర్వీసులను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చని అన్నారు. మిగిలిన నెట్‌వర్క్‌లలా కాకుండా తమ నెట్‌వర్క్‌లో డాటాకు మాత్రం డబ్బు చెల్లిస్తే వాయిస్ ఇంకా మెసేజింగ్ సేవలను ఉచితంగా పొందవచ్చని ఆయన తెలిపారు.

#2

#2

రిలయన్స్ జియో నెట్‌వర్క్ నుంచి దేశంవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు కాల్ చేసినా ఎటువంటి రోమిగ్ ఛార్జీలు ఉండవని అంబానీ స్పష్టం చేసారు. రిలయన్స్ జియో యాప్‌లను డిసెంబర్ 2017 వరకు యూజర్లు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

జియో టారిఫ్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

జియో టారిఫ్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

రూ.148 స్టార్టర్ ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 300ఎంబీ 4జీ డాటా లభిస్తుంది. ఈ 28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.

#4

#4

రూ.499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 4జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది. ఈ 28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 8జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#5

#5

రూ.999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 10జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 20జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#6

#6

రూ.1499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 20జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 40జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#7

#7

రూ.2499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 35జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 70జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#8

#8

రూ.3999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 60జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 120జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

#9

#9

రూ.4999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 75జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 150జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Tariffs: Rs. 50 for 1GB 4G Data, All Voice Calls and Roaming Free. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X