Home
News

జియో నుంచి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్: 2.5GB రోజువారి డేటాతో పాటు 20% క్యాష్‌బ్యాక్‌

ఇండియాలోని టెలికాం సంస్థలలో మొదటి స్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్తగా 2.5GB రోజువారీ డేటా ప్రయోజనంతో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. జియో తన వినియోగదారులకు ఇప్పుడు 2.5GB రోజువారీ డేటాతో అందిస్తున్న మొదటి మరియు ఏకైక ప్రీపెయిడ్ ప్లాన్ ఇదే కావడం విశేషం. ఈ ప్లాన్ రూ.2999 ధర వద్ద 365 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజుతో పాటు మొత్తం చెల్లుబాటు కాలానికి 912.5GB డేటాను పొందుతారు. కానీ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ఉత్తేజకరమైన విషయాలు మరిన్ని ఉన్నాయి. వాటి గురించి మరిన్ని వివరాలను చదవండి.

జియో రోజుకు 2.5GB డేటా ప్లాన్‌పై 20% క్యాష్‌బ్యాక్‌

జియో రోజుకు 2.5GB డేటా ప్లాన్‌పై 20% క్యాష్‌బ్యాక్‌

రిలయన్స్ జియో టెల్కో రూ.2999 ధర వద్ద అందిస్తున్న కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ "20% JioMart మహా క్యాష్‌బ్యాక్" ఆఫర్ కింద జాబితా చేయబడింది. దీని అర్థం వినియోగదారులు తమ JioMart వాలెట్‌పై 20% క్యాష్‌బ్యాక్‌ను స్వీకరించడానికి కూడా అర్హులు. ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని యూజర్లు భవిష్యత్తులోని రీఛార్జ్‌ల కోసం మరియు JioMart లేదా Reliance స్టోర్ నుండి షాపింగ్ కోసం ఉపయోగించవచ్చు. దీనితో పాటు వినియోగదారులు JioTV, JioCinema, JioSecurity మరియు JioCloudతో సహా నాలుగు జియో అప్లికేషన్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.

జియో రూ.3119 ప్లాన్‌

కేవలం రూ.120 అదనంగా చెల్లించడం ద్వారా మీరు జియో నుండి 365-రోజుల చెల్లుబాటుతో లభించే మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ని పొందవచ్చు. అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌కి ఒక సంవత్సరం పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా కూడా. జియో రూ.3119 ధర వద్ద మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇది రూ.2999 ప్లాన్‌కి సమానమైన చెల్లుబాటుతో పాటు ప్రధాన ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనంను కూడా అందజేస్తుందని గమనించండి. రూ.3119 ప్లాన్‌తో వినియోగదారులు మొత్తం చెల్లుబాటు కాలానికి 740GB డేటాను పొందుతారు. అయితే రూ.2999 ప్లాన్‌తో వినియోగదారులు 912.5GB డేటాను పొందుతారు. అప్పుడు రూ.2999 ప్లాన్‌తో అందించబడే 20% క్యాష్‌బ్యాక్‌ను విస్మరించలేరు.

జియో

రిలయన్స్ జియో నుండి వినియోగదారులకు 20% క్యాష్‌బ్యాక్ ను అందించే మరో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లు రూ.299, రూ. 666 మరియు రూ.719 ధరల వద్ద లభిస్తాయి. వీటిలో రూ.666 మరియు రూ.719 ధరల వద్ద టెల్కో అందించే రెండు ప్లాన్లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీపెయిడ్ ప్లాన్‌లుగా ఉన్నాయి. జియో యొక్క రూ.2999 ప్లాన్ ను చాలా మంది అభినందిస్తున్న తాజా ఆఫర్ కావడం విశేషం.

Jio ఇతర వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు

Jio ఇతర వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు

జియో టెల్కో రూ.3119 వార్షిక ప్లాన్‌తో పాటు రూ. 2545, రూ. 2879 మరియు రూ. 4199 ధరల వద్ద మరో మూడు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. రూ. 2545 ప్లాన్ మినహా మొత్తం మూడు ప్లాన్‌ల వాలిడిటీ 365 రోజులు. ఇది కేవలం 336 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. రూ.2545 జియో ప్రీపెయిడ్ ప్లాన్ 1.5GB రోజువారీ డేటాను (మొత్తం 504Gb) అందిస్తుంది. అలాగే 100 SMS/రోజు, అపరిమిత కాల్‌లు మరియు Jio స్ట్రీమింగ్ సేవలు JioTV మరియు JioCinema లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. రూ.2879 మరియు రూ.4119 ప్లాన్‌లు వరుసగా రోజుకు 2GB మరియు 3GB డేటాను అందిస్తాయి. ఇతర ప్రయోజనాలు రూ. 2545 ప్లాన్ లాగానే ఉంటాయి.

Best Mobiles in India

English summary
Reliance Jio Telco Brings 2.5GB Daily Data New Prepaid Plan: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X