OTT ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో లభించే మరొ 6 ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను జియో పెంచింది!!
ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో తన టారిఫ్ పెంపు తరువాత ఇప్పుడు కొత్తగా మళ్ళి దాని ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది. అది ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన డిస్నీ+ హాట్‌స్టార్ యొక్క ఉచిత సబ్స్క్రిప్షన్ తో వస్తుంది. భారతదేశంలోని టెల్కోలు ఇటీవల రిలయన్స్ జియోతో సహా తమ అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను దాదాపు 20% వరకు పెంచాయి. టారిఫ్ పెంపు తర్వాత విడుదల చేసిన జాబితాలో ఈ ఐదు ప్లాన్‌లు అధికారికంగా చేర్చబడలేదు. కొత్తగా సవరించిన ప్లాన్‌ల పర్యవసానంగా జియో ఇప్పుడు రూ.601 నుండి ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ ప్లాన్‌లతో డిస్నీ+ హాట్‌స్టార్‌కి తన వినియోగదారులకు ఒక సంవత్సరం ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. సవరించిన టారిఫ్‌ల ప్రకారం ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క కొత్త ధరలు మరియు వాటి యొక్క ఆఫర్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు
రిలయన్స్ జియో యొక్క టారిఫ్ పెంపు జాబితాలో కొత్తగా చేరిన మొదటి ప్లాన్ రూ.601 ధర వద్ద లభిస్తుంది. ఇది గతంలో రూ.499 ధరతో అందుబాటులో ఉంది. ఈ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 100 SMSలను కూడా పొందుతారు. ఈ ప్యాక్ యొక్క చెల్లుబాటు వ్యవధి 28 రోజులు. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్‌కి గరిష్టంగా ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు అదనంగా 6GB డేటాను కూడా పొందుతారు.

డిస్నీ+ హాట్‌స్టార్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రెండవ ప్లాన్ రూ.799 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ మునుపటి ధర రూ.666 నుండి సవరించబడింది. ఈ ప్లాన్ ఇప్పుడు రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలంతో రోజుకు 100 SMSల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ కొన్ని ఇతర Jio అప్లికేషన్‌లకు కూడా యాక్సెస్‌తో వస్తుంది. Jio నుండి ఈ ప్యాక్‌తో అదనపు డేటా అందుబాటులో లేదు.

జాబితాలో తదుపరి ప్లాన్ రోజువారి 2GB హై-స్పీడ్ డేటాను అందించే మరొక ప్లాన్ రూ.1,066 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ దాని మునుపటి ధర రూ.888 నుండి సవరించబడింది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో లభిస్తుంది. అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఒక సంవత్సరం ఉచిత సభ్యత్వం మరియు JioTV వంటి జియో అప్లికేషన్‌లకు ఉచిత యాక్సెస్ మరియు మరికొన్నింటితో ప్లాన్ బండిల్ చేయబడింది. దీనితో పాటు వినియోగదారులు ప్లాన్‌తో అదనంగా 5GB డేటాను కూడా పొందుతారు.

జియో కొత్త సవరణలో ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే తదుపరి ప్లాన్ ఏడాది పొడవునా లభించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలంలో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను అందించే ప్లాన్ రూ.3,119 ధరతో వస్తుంది.ఇది దాని మునుపటి ధర రూ. 2,599 నుండి సవరించబడింది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSలను పొందుతారు. మొత్తం 730GB రోజువారీ డేటాతో పాటు ఈ ప్లాన్ అదనంగా 10GB హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది.

జాబితాలో చివరిది అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్ మాత్రం కాదు. ఇది డేటా-ఓన్లీ ప్లాన్. Jio అధికారిక వెబ్‌సైట్‌లో "క్రికెట్ ప్యాక్"గా పేర్కొనబడింది. ఈ డేటా ప్లాన్ ప్రతిరోజూ 1.5GB డేటాను మాత్రమే అందిస్తుంది. సవరించిన తరువాత దీని యొక్క ధర రూ.659. ఈ ప్లాన్ మునుపటి ధర రూ.549 వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రూ.499 విలువగల డిస్నీ+ హాట్‌స్టార్ ఒక సంవత్సరం చందాను ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ వాయిస్ కాల్‌లు మరియు SMS ప్రయోజనాలను అందించదు. ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క పేర్కొన్న అన్ని ధరలు అన్ని పన్నులతో కలిపి ఉన్నాయని గమనించాలి. ఇంకా రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత వినియోగదారులు 64 Kbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. వినియోగదారులు సవరించిన ప్లాన్‌లను Jio యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అలాగే Paytm వంటి థర్డ్ పార్టీ రీఛార్జ్ యాప్‌లలో చూడవచ్చు.

జియో రూ.1559 దీర్ఘ-కాల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్
జియో టెల్కో యొక్క వాల్యూ ప్లాన్ జాబితాలోని చివరి ప్లాన్ దీర్ఘ-కాల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్ సహేతుకమైన డేటాతో పాటు దీర్ఘకాలిక కాలింగ్ ప్లాన్‌లను కోరుకునే మరియు అవసరమయ్యే వినియోగదారులకు సరిపోతుంది. టెల్కో యొక్క ఈ దీర్ఘ-కాల ప్లాన్ రూ.1,559 ధర వద్ద లభిస్తుంది. దీనిని వినియోగదారులు 336 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు. వినియోగదారులు ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ మాత్రమే కాకుండా చెల్లుబాటు వ్యవధిలో మొత్తం 3600 SMSలను కూడా పొందుతారు. ఇంకా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు అధిక వేగంతో మొత్తం చెల్లుబాటు కాలానికి 24GB డేటాను అందించబడుతుంది. 24GB డేటా తర్వాత వినియోగదారులు 64 Kbps ఇంటర్నెట్ వేగం పొందుతారు. ఈ ప్లాన్‌లో వివిధ జియో యాప్‌ల యాడ్-ఆన్‌లు కూడా ఉన్నాయి. Jio ఇప్పుడు రూ. 15 నుండి డేటా యాడ్-ఆన్ వోచర్‌లను కూడా అందిస్తోంది. కాబట్టి హై-స్పీడ్ డేటా మొత్తాన్ని వినియోగించడం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు టెల్కో వెబ్‌సైట్ నుండి రిలయన్స్ జియో యొక్క మొత్తం డేటా యాడ్-ఆన్ వోచర్‌లను చూడవచ్చు.


Click it and Unblock the Notifications








