జియోకాల్ యాప్ ఆవిష్కరణ!! 2G/3G ఫోన్‌లలో VoLTE, వీడియో కాల్స్ కి అనుమతి...

|

ఇండియాలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో సంస్థ 2G /3G స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న వారు VoLTE కాల్స్ చేయడానికి కొత్తగా జియోకాల్ అనే యాప్‌ను అందిస్తోంది. మీ 4G స్మార్ట్‌ఫోన్ VoLTEకి మద్దతు ఇవ్వకపోయినా కూడా మీరు HD కాల్‌లు చేయడం కోసం జియోకాల్ యాప్‌ని ఉపయోగించవచ్చు. జియోకాల్ యాప్‌ని ఆండ్రాయిడ్ లోని గూగుల్ ప్లే స్టోర్ మరియు iOSలోని యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జియోకాల్ యాప్ ప్రత్యేకంగా జియో SIM మరియు జియో నెట్‌వర్క్ వినియోగదారుల కోసం ఉద్దేశించబడిందని గమనించండి. జియోకాల్ యాప్ యొక్క ప్రత్యేక ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

జియోకాల్ యాప్ ఫీచర్లు

జియోకాల్ యాప్ ఫీచర్లు

జియోకాల్ యాప్ యొక్క అత్యంత ముఖ్యమైన ఫీచర్లల విషయానికి వస్తే వినియోగదారులు HD వాయిస్ మరియు వీడియో కాల్‌లు చేయడానికి వీలు కల్పించడం లక్ష్యంగా చేసుకున్నది. వినియోగదారులు JioFi డివైస్ ని కలిగి ఉంటే కనుక వారు తమ 2G/3G స్మార్ట్‌ఫోన్‌లో జియోకాల్ యాప్‌ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా మొబైల్ ప్రొఫైల్‌ను కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. JioFi నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడం ద్వారా వినియోగదారులు వారి 2G/3G స్మార్ట్‌ఫోన్‌ల నుండి HD వాయిస్ మరియు వీడియో కాల్స్ చేయవచ్చు.

Microsoft నుంచి కొత్త Laptop ఇండియాలో లాంచ్ అయింది! ధర & ఫీచర్లుMicrosoft నుంచి కొత్త Laptop ఇండియాలో లాంచ్ అయింది! ధర & ఫీచర్లు

JioCall

ఇందులో గల మరొక మంచి విషయం ఏమిటంటే వినియోగదారులు HD కాల్‌లు చేయడానికి ఫోన్ లోని డయలర్ యాప్‌ను నేరుగా ఉపయోగించవచ్చు. అలా చేయడానికి వారు ప్రతిసారీ JioCall యాప్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. జియోకాల్ యాప్ గరిష్టంగా ఆరుగురితో కాన్ఫరెన్స్ వాయిస్ కాల్‌లో పాల్గొనడానికి అనుమతిస్తుంది. అలాగే గరిష్టంగా నలుగురు వ్యక్తులతో వీడియో కాన్ఫరెన్స్‌ని చేయడానికి కూడా అనుమతిస్తుంది.

RCS
 

ఈ యాప్ RCS (రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్)కి మద్దతు ఇవ్వగలదు. దాని కారణంగా వినియోగదారులు అనేక రకాల పనులను చేయగలరు. ఇందులో ముఖ్యంగా కాల్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు వ్యక్తీకరించడానికి లేదా పార్టీ లొకేషన్ మరియు మరిన్నింటిని JioCall యాప్‌తో నిజ సమయంలో చేయడం సాధ్యపడుతుంది.

VoLTE కాల్‌

కొత్త తరం స్మార్ట్‌ఫోన్‌లలో జియోకాల్ యాప్ యొక్క అవసరం పెద్దగా ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా VoLTE కాల్‌లను చేయడానికి మద్దతును కలిగి ఉంటాయి. రిలయన్స్ జియో యొక్క డేటా నెట్‌వర్క్‌కు డివైస్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే జియోకాల్ పని చేస్తుంది అని మీరు గమనించాలి. అందుకే JioFi మీకు సహాయం చేస్తుంది. కానీ మీరు భారతీ ఎయిర్‌టెల్ లేదా వోడాఫోన్ ఐడియా (Vi) డేటా నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయితే అది పని చేయదు.

రిలయన్స్ జియో

భారతదేశంలోని టెలికాం రంగంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో సంస్థ తన యొక్క 4G నెట్‌వర్క్‌తో భారతదేశంలోని మారుమూల మరియు లోతైన ప్రాంతాలలో కూడా ఫుల్ సిగ్నల్ లను అందించే ప్రయత్నంలో భాగంగా నెట్‌వర్క్ ను విస్తరించింది. ఓపెన్ సిగ్నల్ ప్రకారం రిలయన్స్ జియో యొక్క 4G నెట్‌వర్క్ లభ్యత మరియు కవరేజ్ భారతదేశంలోని ఇతర టెల్కోలతో పోలిస్తే ఉత్తమంగా ఉంది. కానీ లోయప్రాంతాలలో అన్ని టెల్కోల సిగ్నల్స్ వీక్ గా ఉన్నాయి. దీనికి చెక్ పెడుతూ జియో సంస్థ లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు సమీపంలోని స్పాంగ్మిక్ గ్రామంలో జియో 4G నెట్‌వర్క్ సేవలను ప్రవేశపెట్టింది. ఈ ప్రాంతంలో 4G నెట్‌వర్క్ సేవలను అందించే మొదటి టెలికాం ఆపరేటర్ జియో కావడం గమనార్హం. లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడికి భారతీయులే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తూ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతంలో జియో మొబైల్ టవర్‌ను గౌరవనీయులైన పార్లమెంటు సభ్యుడు జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్ ప్రారంభించారు.

రిలయన్స్ జియో డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్లు

రిలయన్స్ జియో డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్లు

రిలయన్స్ జియో సంస్థ కొత్తగా రూ.151 ధర వద్ద ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ డేటా-ఓన్లీ ప్లాన్ తో వినియోగదారులు 8GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ తో వినియోగదారులు రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా మూడు నెలలు (90 రోజులు) వాలిడిటీ కాలానికి ఉచితంగా పొందుతారు. FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) 8GB డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గించబడుతుంది అని గమనించండి. రిలయన్స్ జియో యొక్క కొత్త ప్లాన్‌లలో రెండవది రూ.333 ధర వద్ద లభిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటాతో మొత్తం వాలిడిటీకి 42GB డేటాతో పాటుగా వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అదనంగా రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ మరియు జియోక్లౌడ్ తో సహా అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Telco Launches JioCall App For 2G, 3G Phone Users to Make VoLTE Calls

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X