Jio యూజర్లకు శుభవార్త!! ఈ ప్లాన్‌లతో అదనంగా బోనస్ డేటాను పొందవచ్చు
భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లలో అధిక మంది వినియోగదారులను కలిగి ఉన్న రిలయన్స్ జియో ఎప్పుడు ఎంచుకున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లపై వినియోగదారులకు డేటా ప్రయోజనాలను పెంచింది. ఈ టెల్కో ఇప్పటికే అత్యంత సరసమైన ధరల వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. కానీ దాని ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అదనపు డేటాను ఇప్పుడు చేర్చడంతో దాని సమర్పణలు మరింత మెరుగ్గా మారాయి. రిలయన్స్ జియో ఇప్పుడు తన మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో గతంలో కంటే ఎక్కువ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు భారీ మొత్తంలో డేటాను అందించడమే కాకుండా యూజర్‌లకు ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాన్ని కూడా అందిస్తున్నాయి. బోనస్ డేటా ప్రయోజనాన్ని అందుకున్న ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో బోనస్ డేటాను అందించే ప్లాన్‌లు
రిలయన్స్ జియో ఇప్పుడు కొత్తగా రూ.499, రూ.888 మరియు రూ.2599 ధరల వద్ద లాంచ్ చేసిన మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో బోనస్ డేటాను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లకు అదనంగా ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇవన్నీ డిస్నీ+ హాట్‌స్టార్ ఓన్లీ-మొబైల్ యొక్క ప్రధాన OTT ప్రయోజనంతో కూడా వస్తాయి. అవి ఇటీవల వినియోగదారులకు అందుబాటులోకి రావడం విశేషం.

పైన పేర్కొన్న అన్ని ప్లాన్‌లు ఇటీవల ప్రారంభించబడ్డాయి మరియు అవన్నీ విభిన్న ప్రయోజనాలను తమ వియోగదారులకు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్లాన్‌లన్నీ మునుపు అందించే ఇతర ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేకుండా వినియోగదారులకు అదనంగా బోనస్ డేటాను మాత్రమే అందిస్తున్నాయి. రూ 499 ప్లాన్ వినియోగదారులకు 6GB బోనస్ డేటాను అందిస్తుంది. అలాగే రూ.888 ప్లాన్ 5GB బోనస్ డేటాను అందిస్తుండగా చివరిగా రూ.2599 ప్లాన్ మాత్రం 10GB బోనస్ డేటాను అందిస్తుంది. రిలయన్స్ జియో రూ.666 ధర వద్ద అందించే ఖరీదైన మరో ప్లాన్ కూడా డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ తో వస్తుందని గమనించాలి. అయితే ఈ ప్లాన్ కంపెనీ నుండి ఎలాంటి బోనస్ డేటా ఆఫర్‌ను అందుకోలేదు.

రూ.499 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను అందిస్తుంది. అలాగే రూ.888 మరియు రూ .2599 ప్లాన్‌లు వరుసగా 84 మరియు 365 రోజుల చెల్లుబాటు కాలానికి 2GB రోజువారీ డేటాను అందిస్తున్నాయి. అన్ని ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా Jio యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ని కూడా అందిస్తాయి. రూ.666 ప్లాన్ 2GB రోజువారీ డేటా, వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

జియో ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు
రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారులకు అందించే ఉత్తమ విలువ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.399, రూ.555, రూ.599 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, మరియు జియో యొక్క అన్ని యాప్‌లకు కాంప్లిమెంటరీ చందాతో వస్తాయి. రూ.399 మరియు రూ.555 ప్లాన్ వినియోగదారులకు రోజువారీ 1.5GB FUP డేటాను అందిస్తుండగా రూ.599 ప్లాన్ 2GB డైలీ డేటా ప్రయోజనంతో వస్తుంది. ఇంకా రూ.399 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో లభించగా రూ.555 మరియు రూ.599 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.


Click it and Unblock the Notifications