జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్!! నాలుగు జియోఫోన్ ప్లాన్‌లను తొలగించిన జియో...
ఇండియాలోని టెలికాం రంగంలో అద్భుతమైన మార్పులకు మొదట శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో ఇప్పుడు అనవసరమైన జియోఫోన్ ప్లాన్‌లను తొలగించింది. రూ.99, రూ.297 మరియు రూ.594 ధర వద్ద లభించే జియోఫోన్ ప్లాన్‌లు జియోఫోన్ యొక్క ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల మాదిరిగా జియోయేతర నిమిషాలను అందించడంలేదు కావున టెల్కో వాటిని ఇప్పుడు తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం జియోఫోన్ ప్లాన్‌ల ప్లాట్ఫార్మ్ లో ఇప్పుడు రూ.75, రూ.125, రూ.155, రూ.185 ధరల వద్ద నాలుగు జియోఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లను మాత్రమే కలిగి ఉంది. జియోఫోన్ ప్లాన్‌లలో చేసిన మార్పుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

తొలగించబడిన జియోఫోన్ ప్లాన్‌లు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెల్కో నాలుగు జియోఫోన్ ప్లాన్‌లను తొలగించింది. రూ.99, రూ.297, రూ.594 జియోఫోన్ ప్లాన్లు రోజుకు 0.5GB డేటాను వరుసగా 28, 84, 168 రోజులకు అందిస్తున్నాయి. ఈ మూడు ప్లాన్‌లు జియో టు జియో అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తున్నాయి కానీ జియోయేతర కాలింగ్ నిమిషాలు లేవు. కాబట్టి ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసిన జియోఫోన్ వినియోగదారులు రూ .10 నుండి ప్రారంభమయ్యే ఎఫ్‌యుపి ప్లాన్‌లను రీఛార్జ్ చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియోఫోన్ ప్లాన్‌లు
ప్రస్తుతం ఆఫర్‌లో రూ .75, రూ .125, రూ .155, రూ.185 దరల వద్ద జియోఫోన్ ప్లాన్‌లు ఉన్నాయి. రూ.75 ప్లాన్ రోజుకు 0.1GB 4G డేటా, రూ.125 ప్యాక్ రోజుకు 0.5GB డేటా, రూ.155 ప్లాన్ రోజుకు 1GB డేటాతో మరియు చివరగా రూ.185 ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్లు ఏ నెట్‌వర్క్‌కు అయినా ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తాయి. ఈ నాలుగు ప్లాన్‌ల వాలిడిటీ 28 రోజులు.

జియోఫోన్ ప్లాన్‌ల డేటా ఆఫర్స్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.155 జియోఫోన్ ప్లాన్ రోజుకు 1 జిబి డేటాను అందిస్తోంది. అయితే తొలగించబడిన రూ.153 ప్లాన్ జియోయేతర నిమిషాలు లేకుండా 1.5GB రోజువారీ డేటాను అందించడానికి ఉపయోగించబడింది. కాబట్టి ఈ ప్లాన్ లను తొలగించడం రిలయన్స్ జియోకు పూర్తిగా కలిసి వచ్చినట్లు అనుకోవచ్చు. జియోఫోన్ యొక్క బేస్ ప్లాన్ ఇప్పుడు నెలకు రూ.75 ధరతో ప్రారంభం అవుతుంది. ఏడాది క్రితం జియోఫోన్ వినియోగదారులకు 49 రూపాయల ఆప్షన్ కూడా ఉండేది. అయితే బేస్ ప్లాన్ ఈ ధరను 2019 డిసెంబర్‌లో రూ.75 కు పెంచారు.


Click it and Unblock the Notifications








