దూసుకొస్తున్న జియో కేబుల్ టీవీ, ఆఫర్లే ఆఫర్లు..

తమ FTTH బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సంబంధించిన బేటా ట్రెయిల్స్‌ను అన్ని ప్రధాన నగరాలకు విస్తరించబోతున్నట్లు ప్రకటించిన జియో, డీటీహెచ్ ప్రసారాలకు అవరసమైన cable TV STBలను కూడా పరీక్షిస్తున్నట్లు సమాచారం. జియో లాంచ్ చేయబోయే కేబుల్ టీవీ సెట్ టాప్ బాక్సులు కూడా FTTH కేబులింగ్ ద్వారానే వర్క్ అవుతాయని తెలుస్తోంది.

Read More : తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు.. సచిన్ srt.phone ప్రత్యేకతలివే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొరియాలో తయారైనట్లు తెలుస్తోంది..

ఈ టెస్టింగ్ ఫేజ్‌లో వాడుతోన్న హైబ్రీడ్ సెట్ టాప్ బాక్సులు కొరియాలో తయారైనట్లు తెలుస్తోంది. జామ్ నగర్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉద్యోగుల ఇళ్లలో కొన్ని సెట్ టాప్ బాక్సులను ఇన్ స్టాల్ చేసినట్లు తెలుస్తోంది.

అనేక కనెక్టింగ్ పోర్టులతో..

లీకైన ఫోటోలను బటి చూస్తుంటే జియో సెట్ టాప్ బాక్స్ అనేక కనెక్టింగ్ పోర్టులను కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. వాటిలో స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ పోర్ట్, ఆడియో, వీడియో అవుట్ పుట్ పోర్ట్స్ తో పాటు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేందుకు అవసరమైన Ethernet పోర్ట్ కూడా ఉంది. జియో సెట్ టాప్ బాక్స్ ముందు భాగంలో కూడా యూఎస్బీ పోర్ట్ ను అందుబాటులో ఉంచటం విశేషం.

వెల్‌కమ్ ఆఫర్‌ సదుపాయం కూడా..?

జియో తన వెల్‌కమ్ ఆఫర్‌ను కొత్తగా లాంచ్ చేయబోయే డీటీహెచ్ సర్వీసులకు విస్తరించే అవకాశముందని అనధికారికంగా తెలియవచ్చింది. ఇదే గనుక నిజమైన మొదటి మూడు నెలల పాటు జియో డీటీహెచ్ ప్రసారాలను ఉచితంగా వీక్షించే అవకాశం ఉంటుంది.

తక్కువ ధరకే ఎక్కు చానళ్లు..

దేశంలో ఏ డీటీహెచ్ సర్వీస్ ఆపరేటర్ ప్రకటించనంత తక్కువగా జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి.

రూ.185కే కేబుల్ టీవీ ప్రసారాలు..

ఇతర కంపెనీలు 275 నుంచి 300 రూపాయలకు అందించే నెలవారీ డీటీహెచ్ ప్యాక్‌ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రూ. 185కే అందించేందుకు సిద్దమైనట్లు సమాచారం. సర్వీస్ ఆరంభంలో భాగంగా 300 ఛానళ్లను జియో అందుబాటులో ఉంచుతుందట.

వాళ్లకు పెద్ద దెబ్బే..?

జియో డీటీహెచ్ సర్వీసులు లాంచ్ అయితే ఎయిర్‌టెల్, టాటా స్కై, డిష్ టీవీ యాజమాన్యాలను కోలుకోలేని దెబ్బ తీస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. లీకైన ఫోటోలను బట్టి చూస్తుంటే రిలయన్స్ జియో డీటీహెచ్ సేవలు అతి త్వరలోనే మార్కెట్లో రాబోతున్నట్లు తెలుతస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio testing cable TV Set-Top Box: Report. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting