జియో ఫోన్ సొంతం చేసుకోవాలనే ఆసక్తి ఉందా..?
జియో ఫోన్‌ను కొనుగోలుచేయాలని ఆసక్తి కలిగిన వినియోగదారుల కోసం రిలయన్స్ జియోనే ఓ స్పెషల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సంచలనాల జియో మరో సంచలనానికి రెడీ అయింది. జీరోకే జియో ఫోన్ అంటూ వినియోగదారులను బుట్టలో పడేసుకున్నారు ముఖేష్ అంబాని.ఇప్పుడు జియో ఫోన్‌ను కొనుగోలుచేయాలని ఆసక్తి కలిగిన వినియోగదారుల కోసం రిలయన్స్ జియోనే ఓ స్పెషల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జియో వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, తమ పేరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తే, ఈ డివైజ్ గురించి ప్రతి అప్‌డేట్‌ను కంపెనీనే డైరెక్ట్‌గా వినియోగదారులకు అందిస్తోంది.

ఆగస్టు 15 నుంచి
ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్ బీటా-టెస్ట్‌కు వస్తోంది. ఆగస్టు 24 నుంచి రిలయన్స్ రిటైల్, జియో స్టోర్లు, ఆన్‌లైన్‌లో ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి.

జియో ఫోన్ మార్కెటింగ్
ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ కంపెనీనే జియో ఫోన్ మార్కెటింగ్ చేపడుతుందని దీనికి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు. ఏ కస్టమర్లైతే, తమ ఇంటరెస్ట్ మేరకు వివరాలు నమోదు చేసుకుంటారో వారికి జియోఫోన్ బుకింగ్, అందుబాటులో ఉండే వివరాలు వంటి వాటిని అప్ డేట్ చేయనున్నట్టు పేర్కొన్నారు.

ఇలాంటి ప్రక్రియను
ప్రస్తుతం ఇలాంటి ప్రక్రియను ఈ-కామర్స్ కంపెనీలు చేపడుతున్నాయి. తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ప్రొడక్ట్ కావాలని రిజిస్ట్రర్ చేసుకుంటే, దాని గురించిన సమాచారం అందిస్తూ ఉంటాయి.

రూ.153తో రీఛార్జ్
రిలయన్స్ జియో తాజాగా లాంచ్‌చేసిన ఈ ఫోన్, 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్ ఫీచర్ ఫోన్. రూ.153తో రీఛార్జ్ చేయించుకున్న వారికి ఈ ఫోన్‌లో ఉచితంగా వాయిస్ సర్వీసులు, అపరిమిత డేటా అందించనుంది.

ఫోన్ పూర్తిగా ఉచితం
అంతేకాక ఈ ఫోన్ పూర్తిగా ఉచితం. తొలుత రూ.1500 కట్టి దీన్ని కొనుగోలు చేస్తే, మూడేళ్ల తర్వాత ఆ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేసేస్తోంది.


Click it and Unblock the Notifications








