జియో నుంచి కొత్తగా 3 చవకైన ప్లాన్లు, ప్లాన్లపై అదిరే డిస్కౌంట్లు

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తాజాగా సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటూ ముందుకుపోతున్న ఈ దిగ్గజం టాప్ దిగ్గజాలకు అదిరిపోయే టారిఫ్ లతో సవాల్ విసురుతూ పోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మరో సారి టారిఫ్ ప్లాన్లతో దూసుకొచ్చింది. రూ.100 ధరలో మూడు అత్యంత చవకైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లతో పాటు పాత ప్లాన్లపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. జియో పరిచయం చేసిన రూ.19, రూ. 52,రూ.98 ప్లాన్లపై ఓ లుక్కేయండి.

బిట్ కాయిన్‌కు పోటీగా జియో కాయిన్, అంబాని టార్గెట్ ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.19 ప్లాన్

ఒకరోజు వాలిడిటీ, 150 ఎంబీ 4జీ హై స్పీడ్‌ డేటా, 20 లోకల్‌ ఎస్‌ఎంఎస్‌లు ఉచితం

రూ. 52 ప్లాన్

10.5 జీబీ 4జీ డేటా, వారం రోజుల వాలిడిటీ, 70 లోకల్‌ ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ. 98 ప్లాన్

2.1 జీబీ 4జీబీ డేటా, 14 రోజుల వాలిడిటీ. డెయిలీ లిమిట్‌ 0.15 జీబీ, 140 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.199 ప్యాక్‌పై రూ. 50 డిస్కౌంట్

వీటితో పాటు ఇప్పటికే ఉన్నప్లాన్లపై కూడా డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ.199 ప్యాక్‌పై రూ50 లు తగ్గించి రూ149లకే అందిస్తోంది. 1 జీబీ 4జీబీ డేటా, 28 రోజులువాలిడిటీ.

రూ.399 ప్యాక్‌ మీద రూ.50 డిస్కౌంట్‌

రూ.399 ప్యాక్‌ రూ.50 డిస్కౌంట్‌తో రూ.349 లకే లభ్యం. రోజుకి 1 జీబీ చొప్పున మొత్తం 70 జీబీ అందిస్తుంది.

రూ. 499 రూ.399 రూ. 449 ప్లాన్లపై రూ. 50 తగ్గింపు


రూ. 499 రూ.399 రూ. 449 ప్లాన్లకు కూడా ఈ రూ. 50 తగ్గింపును వర్తింప చేస్తోంది. డేటా అలాగే కాల్స్ విషయంలో పాత నిబంధనలే కొనసాగుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio: These are the cheapest 4G data plans under Rs 100 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot