రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు!! 3నెలల డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో...

|

రిలయన్స్ జియో టెలికాం సంస్థ ఇటీవల వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేస్తూ అందరి దృష్టి తన వైపుకు మరల్చుకుంటున్నది. ఈ టెల్కో ఇటీవల మూడు నెలల చెల్లుబాటు కాలంతో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంను అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ.151, రూ. 333, రూ. 583 మరియు రూ.783 ధరల వద్ద లభించే ఈ ప్లాన్‌లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2022 సమయంలో స్వల్పవాలిడిటీతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రవేశపెట్టబడ్డాయి. జూన్ 6 నుంచి సౌత్ ఆఫ్రికాతో టీమ్ ఇండియా తలపడనున్నది. ఐదు T20 మ్యాచ్ల సిరీస్ ను చూడడానికి ఈ మూడు నెలల వాలిడిటీ Disney+ Hotstar మొబైల్ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రిలయన్స్ జియో రూ.151 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.151 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో సంస్థ కొత్తగా రూ.151 ధర వద్ద ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ డేటా-ఓన్లీ ప్లాన్ తో వినియోగదారులు 8GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ తో వినియోగదారులు రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా మూడు నెలలు (90 రోజులు) వాలిడిటీ కాలానికి ఉచితంగా పొందుతారు. FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) 8GB డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గించబడుతుంది అని గమనించండి.

రిలయన్స్ జియో రూ.333 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.333 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో యొక్క కొత్త ప్లాన్‌లలో రెండవది రూ.333 ధర వద్ద లభిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటాతో మొత్తం వాలిడిటీకి 42GB డేటాతో పాటుగా వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అదనంగా రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ మరియు జియోక్లౌడ్ తో సహా అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో రూ. 583 ప్రీపెయిడ్ ప్లాన్
 

రిలయన్స్ జియో రూ. 583 ప్రీపెయిడ్ ప్లాన్

3నెలల డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో లభించే జియో యొక్క మరొక ప్లాన్ రూ.583 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 1.5GB డేటాతో మొత్తం వాలిడిటీకి దాదాపు 84GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో ఆనందించవచ్చు. ఈ ప్లాన్ వినియోగదారులకు రూ.149 విలువైన మూడు నెలల (90 రోజులు) డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో రూ. 783 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ. 783 ప్రీపెయిడ్ ప్లాన్

3నెలల డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో లభించే చివరి ప్లాన్ రూ.783 ధర వద్ద లభిస్తూ ఇతర మూడు ప్లాన్‌ల మాదిరిగానే అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. ఇది కాకుండా వినియోగదారులు జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ మరియు జియోక్లౌడ్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో రోజుకి 1.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను పొందుతారు.

Best Mobiles in India

English summary
Reliance Jio These Prepaid Plans Comes With 3 Months Validity Disney+ Hotstar Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X