తక్కువ వ్యాలిడిటీతో OTT ప్రయోజనాలతో లభించే జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

|

ఇండియాలోని టెలికాం రంగంలో ఆపరేటర్లు ఉన్నప్పటికీ కూడా రిలయన్స్ జియో సంస్థ ప్రారంభమయిన కొద్ది రోజులలోనే మొదటి స్థానాన్ని చేరుకున్నది అంతేకాకుండా ఇప్పటికి కూడా మొదటి స్థానంలో కొనసాగుతూ తన చందాదారుల యొక్క అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల ధరల విభాగాలలో వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. చవకైన ధరలో రోజువారీ డేటా ప్లాన్‌ల నుండి దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లతో మరియు OTT ప్రయోజనాలతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తూ మిగిలిన వారి కంటే మెరుగ్గా ఉంది అని ఏళ్ళప్పుడు నిరూపించుకుంటున్నది.

 

OTT ప్లాట్‌ఫారమ్‌

ప్రస్తుత సమయాలలో ప్రతి ఒక్కరు వినోదం కోసం OTT ప్లాట్‌ఫారమ్‌లవైపు చూస్తుండడంతో వాటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే వినియోగదారులు OTT యాప్ లను విడిగా కొనుగోలు చేయకుండా ఇప్పుడు వారి అవసరాలను తీర్చగల ప్లాన్‌లను పొందాలని చూస్తున్నారు. అటువంటి పరిస్థితులలో మీరు కూడా ఉండి జియో యొక్క సిమ్ ని ఉపయోగిస్తుంటే కనుక జియో పోర్ట్‌ఫోలియోలో బహుళ రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అయితే నేటి కథనంలో OTT ప్రయోజనాలతో రిలయన్స్ జియో స్వల్ప వాలిడిటీతో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రయోజనంతో రోజువారీ డేటా ప్లాన్‌లు
 

డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రయోజనంతో రోజువారీ డేటా ప్లాన్‌లు

డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రయోజనంతో లభించే ప్లాన్ల యొక్క జాబితాలోని మొదటి ప్లాన్ నవంబర్-డిసెంబర్‌లో టారిఫ్ పెంపు తర్వాత టెల్కో ఇటీవల జోడించిన ప్లాన్. రూ.499 ధర ట్యాగ్‌తో లభించే ఈ ప్లాన్ స్వల్ప వ్యాలిడిటీతో బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. రూ.499 ప్లాన్ కేవలం 28 రోజుల చెల్లుబాటు వ్యవధిని మాత్రమే కలిగి ఉంది. ఇది మొత్తం వాలిడిటీలో రోజుకు 2GB డేటాను, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. కొత్త వినియోగదారులు ఈ ప్లాన్ కొనుగోలుతో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌కు కూడా సభ్యత్వాన్ని పొందుతారు. ఈ ప్లాన్ తో వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్‌ OTT ప్లాట్‌ఫారమ్ సబ్స్క్రిప్షన్ కు ఉచిత యాక్సిస్ ను పొందవచ్చు.

ఉచిత యాక్సెస్‌

జాబితాలోని రెండవ ప్లాన్ కూడా అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇందులో రిలయన్స్ జియో యొక్క బహుళ OTT బండిల్ ప్యాక్‌లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.601 ధరతో స్వల్పకాలిక వాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు వ్యవధితో రోజుకు 3GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ 3GB డేటాతో పాటు ప్లాన్ అదనంగా 6GB డేటాను కూడా అందిస్తుంది. జియో యొక్క రూ.601 ప్లాన్ కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కి ఒక సంవత్సరం వాలిడిటీకి ఉచిత యాక్సెస్‌తో వస్తుంది. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ మరియు మరిన్ని వంటి వివిధ జియో అప్లికేషన్‌లను కూడా ఆస్వాదించవచ్చు.

టెలికాం ఆపరేటర్

జియో టెలికాం ఆపరేటర్ అధిక డేటా మరియు OTT ప్రయోజనాలతో మీడియం-టర్మ్ వాలిడిటీతో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ కూడా డిస్నీ+ హాట్‌స్టార్‌ యొక్క వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో లభిస్తుంది. రోజువారీ డేటా ప్రయోజనంతో ఈ ప్లాన్ ను రూ.799 ధర వద్ద అందిస్తుంది. నవంబర్‌లో టారిఫ్ పెంపుదల తరువాత ఈ ప్లాన్ దాని రూ.666 మునుపటి ధర నుండి సవరించబడింది. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు వ్యవధితో అందిస్తుంది. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి మరికొన్ని ఇతర జియో అప్లికేషన్‌లకు కూడా ఉచిత యాక్సెస్‌తో వస్తుంది. అంతేకాకుండా OTT ప్లాట్‌ఫారమ్ లలో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio These Prepaid Plans Comes With Short Validity and OTT Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X