జాబ్స్ సునామి, జియో నుంచి 80 వేలు,కేంద్రం నుంచి 40 లక్షల ఉద్యోగాలు,త్వరలో నోటిఫికేషన్ !

దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు రేపుతున్న రిలయన్స్ జియో ఉద్యోగ అవకాశాల్లోనూ సునామిని తలపించే దిశగా అడుగులు వేస్తోంది.

|

దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు రేపుతున్న రిలయన్స్ జియో ఉద్యోగ అవకాశాల్లోనూ సునామిని తలపించే దిశగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగులకు శుభవార్తను అందించే క్రమంలో జియో ఈ ఏడాది భారీ రిక్రూట్ మెంట్లను చేపట్టాలని అనుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 75వేల నుంచి 80వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు జియో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ తెలిపారు. కాగా ప్రస్తుతం కంపెనీలో 1.57 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, ఈ ఏడాది మరో 80వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొంది. ఎన్‌హెచ్ఆర్ఎం ఇండియా టెక్ 18 సదస్సులో ఆయన మాట్లాడుతూ..కంపెనీ విస్తరణలో భాగంగా బ్రాడ్ బ్యాండ్, పేమెంట్స్ బ్యాంకింగ్, కృత్రిమ మేధ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని తెలిపారు. సాంకేతికత, డిగ్రీ విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. దీంతో పాటు జాతీయ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ 2018' పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాలకు తెరలేపింది.

జియో 8జిబి డేటా ఉచితం,ఎటువంటి పరిమితులు లేవు !జియో 8జిబి డేటా ఉచితం,ఎటువంటి పరిమితులు లేవు !

టెలికాం సంస్థలు విలీనమైనా, మూతపడినా..

టెలికాం సంస్థలు విలీనమైనా, మూతపడినా..

టెలికాం సంస్థలు విలీనమైనా, మూతపడినా అందులోను ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. వారికి చాలా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, టెక్నికల్ రూట్‌లో ఉన్న వారు ఐటీ కంపెనీల్లో, మార్కెటింగ్‌లో ఉన్నవారు ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు చేయవచ్చన్నారు. డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు బాగా అబివృద్ధి చెందుతోందన్నారు.

సరైన నైపుణ్యాలు ఉన్నవారు..

సరైన నైపుణ్యాలు ఉన్నవారు..

మన వద్ద ఉద్యోగులు సులభంగా దొరుకుతారని, కానీ సరైన నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం లేదన్నారు. తాము కొత్తగా తీసుకునే వారిలో చాలామంది ఫ్రెషర్స్ ఉంటారని, తమ ఉద్యోగుల సిఫార్స్ ఆధారంగా కూడా 15 శాతం మందిని తీసుకుంటామన్నారు.

ప్రాథమిక ఉద్యోగం సమయంలో..

ప్రాథమిక ఉద్యోగం సమయంలో..

తమ సంస్థలో ప్రాథమిక ఉద్యోగం సమయంలో వలసలు 32 శాతంగా ఉన్నాయని, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి జియో ఒక ఆధారంగా ఉందని, ఆ తర్వాత వారి భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్తున్నారని, ఇది మంచి పరిణామం అన్నారు.

జాతీయ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ 2018..

జాతీయ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ 2018..

ఇదిలా ఉంటే దేశీయ టెలికాం రంగంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముసాయిదా టెలికాం విధానాన్ని ఆవిష్కరించింది. ‘జాతీయ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ 2018' పేరుతో ఆవిష్కరించిన ఈ ముసాయిదా విధానం ప్రకారం.. 2022నాటికి 40 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

50 ఎంబిపిఎస్‌ వేగంతో..

50 ఎంబిపిఎస్‌ వేగంతో..

50 ఎంబిపిఎస్‌ వేగంతో అందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం, 5జి సేవలను అందించడం కూడా ముసాయిదా విధానంలోని ప్రధానమైన అంశాలు. 2022నాటికి డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ రంగంలోకి 10,000 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ‘జాతీయ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ 2018లో పొందుపరిచారు.

తీవ్రమైన పోటీ కారణంగా..

తీవ్రమైన పోటీ కారణంగా..

టెలికాం రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా కొన్ని కంపెనీలు అప్పుల భారంతో నెట్టుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలు చెల్లించే లైసెన్స్‌ ఫీజులు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీలు తదితర అంశాలను ప్రభుత్వం సమీక్షించాలనుకుంటోంది.

 50 శాతం కుటుంబాలకు..

50 శాతం కుటుంబాలకు..

నూతన విధానంలో భాగంగా 50 శాతం కుటుంబాలకు ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పించడంతోపాటు లాండ్‌లైన్‌ పోర్టబిలిటీ సర్వీస్ ను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

స్పెక్ట్రమ్‌ ధరల నిర్ణయం విషయంలో..

స్పెక్ట్రమ్‌ ధరల నిర్ణయం విషయంలో..

అధిక స్పెక్ట్రమ్‌ ధర, అనుబంధ చార్జీల పట్ల టెలికాం కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఛార్జీల ప్రభావం వినియోగదారులపై పడకుండా స్పెక్ట్రమ్‌ ధరల నిర్ణయం విషయంలో పునరాలోచించి అందుబాటు ధరల్లోనే డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.కాగా ఇప్పటి వరకు టెలికాం కంపెనీలపై 7.8 లక్షల కోట్ల రూపాయల భారం ఉంది

నెక్ట్స్‌ జనరేషన్‌ నెట్‌వర్క్స్‌ (5జి)కు ..

నెక్ట్స్‌ జనరేషన్‌ నెట్‌వర్క్స్‌ (5జి)కు ..

నెక్ట్స్‌ జనరేషన్‌ నెట్‌వర్క్స్‌ (5జి)కు అవసరమైన మిడ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ (3గిగాహెట్జ్‌ నుంచి 24 గిగాహెట్జ్‌ శ్రేణి)ను గుర్తించాలని ఈ ముసాయిదా విధానంలో ప్రతిపాదించారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా కొత్త టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విధానంలో  నియంత్రణపరమైన మార్పులు తీసుకురానున్నట్టు ముసాయిదా విధానంలో పేర్కొన్నారు.

కస్టమర్లకు మెరుగైన సర్వీసులు

కస్టమర్లకు మెరుగైన సర్వీసులు

కస్టమర్లు మెరుగైన సర్వీసులు అందుకునేలా నిబంధనల్లో సడలింపులు, దీర్ఘకాలిక, సుస్థిర పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంలో భాగంగా నియంత్రణాపరమైన అవరోధాలను తొలగించడంతోపాటు రెగ్యులేటరీ భారాన్ని తగ్గించనున్నట్టు పాలసీలో ప్రభుత్వం హామీ ఇచ్చింది.

పన్నులు తగ్గించండి : కాయ్‌

పన్నులు తగ్గించండి : కాయ్‌

అయితే టెలికాం రంగం నుంచి వసూలు చేస్తున్న పన్నులను 10 శాతంకన్నా దిగువకు తగ్గించాలని, నూతన టెలికాం విధానాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వానికి సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాయ్‌) సూచించింది. ఈ చర్యలు 10,000 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడతాయని తెలిపింది.

Best Mobiles in India

English summary
It's raining jobs at Reliance Jio! Telco to hire 80,000 people in FY19 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X