డౌన్‌లోడింగ్ స్పీడ్‌లో జియోని ఎవరు అందుకోలేరు అంటున్న ట్రాయ్
వచ్చి రావడంతోనే సంచలనాలు నమోదు చేసిన జియో టెలికం రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన సంగతి తెలిసిందే. దిగ్గజ టెల్కోలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తూ కొత్త కొత్త టారిఫ్ ప్లాన్లతో అందరినీ షాక్ కు గురి చేసింది.
వచ్చి రావడంతోనే సంచలనాలు నమోదు చేసిన జియో టెలికం రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన సంగతి తెలిసిందే. దిగ్గజ టెల్కోలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తూ కొత్త కొత్త టారిఫ్ ప్లాన్లతో అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ నేపథ్యంలో డౌన్‌లోడింగ్ స్పీడ్ జియో నెట్‌వర్క్ అన్ని టెలికాం కంపెనీలను మించి పోయిందని ట్రాయ్ పేర్కొంది. ఆగష్టు నెలలో డౌన్‌లోడ్ స్పీడ్ జియో నెట్‌వర్క్‌లో 22.3 ఎంబీపీఎస్‌గా నమోదయ్యిందని తెలిపింది.అయితే అప్ లోడింగ్ స్పీడ్ లో మాత్రం ఐడియా దూసుకుపోతుంది.

22.3 ఎంబీపీఎస్...
డౌన్‌లోడ్ స్పీడ్ జియో నెట్‌వర్క్‌లోనే ఎక్కువని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ పేర్కొంది. ఆగష్టు నెలలో డౌన్‌లోడ్ స్పీడ్ జియో నెట్‌వర్క్‌లో 22.3 ఎంబీపీఎస్‌గా నమోదయ్యిందని తెలిపింది.

ఎయిర్టెల్ డౌన్‌లోడ్ స్పీడ్...
ఎయిర్టెల్ డౌన్‌లోడ్ స్పీడ్ 10 ఎంబీపీఎస్‌గా నమోదయ్యిందని ట్రాయ్ పేర్కొంది.

ఎయిర్టెల్ vs జియో...
జీయో యొక్క సగటు 4G డౌన్‌లోడ్ వేగం దాని ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ తో పోల్చితే సెకనుకు 10 మెగాబిట్ల వేగం (Mbps) ఇస్తుంది. అంటే రెండింతలు ఎక్కువ వేగాన్ని జియో అందిస్తుంది.

ఐడియాలో డౌన్‌లోడ్ స్పీడ్...
ఐడియాలో డౌన్‌లోడ్ స్పీడ్ 6.2 ఎంబీపీఎస్‌గా నమోదయ్యిందని ట్రాయ్ పేర్కొంది.

ఐడియా అప్ లోడింగ్ స్పీడ్....
ఐడియా అప్ లోడింగ్ స్పీడ్ లో మాత్రం దూసుకుపోతుంది. అప్ లోడ్ స్పీడ్ 5.4 ఎంబీపీఎస్‌గా నమోదయ్యిందని ట్రాయ్ పేర్కొంది.

వొడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్ ...
జులై నెల తో పోలిస్తే వోడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్ కొంచెం పెరిగింది. ఆగష్టు నెలకు గాను వోడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్ 6.7 ఎంబీపీఎస్‌గా ఉందని ట్రాయ్ పేర్కొంది.

ట్రాయ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టెలికాం కంపెనీల అప్ లోడింగ్ స్పీడ్ ఈ విధంగా ఉన్నాయి...
జియో - 4.9 ఎంబీపీఎస్
ఎయిర్టెల్ - 4.4 ఎంబీపీఎస్
ఐడియా - 5.4 ఎంబీపీఎస్
వొడాఫోన్ - 5.1 ఎంబీపీఎస్


Click it and Unblock the Notifications








