జియోని ఢీకొట్టలేకున్న దిగ్గజాలు,ఆగని Airtel దూకుడు

దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపేస్తున్న రిలయన్స్ జియో మరోమారు రికార్డుల్లోకెక్కింది.4జీ నెట్‌వర్క్ కవరేజీలో రిలయన్స్ జియో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

|

దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపేస్తున్న రిలయన్స్ జియో మరోమారు రికార్డుల్లోకెక్కింది.4జీ నెట్‌వర్క్ కవరేజీలో రిలయన్స్ జియో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా 99.3 శాతంతో జియో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, 99.1 శాతం స్కోర్‌తో భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానంలో నిలిచింది. 99శాతంతో వొడాఫోన్ మూడో స్థానంలోనూ, 98.9 శాతంతో ఐడియా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాయి. గ్లోబల్ స్పీడ్‌ టెస్ట్ సంస్థ ఊక్లా భారత్‌లో తాజాగా నిర్వహించిన అధ్యయనంలో భారతీ ఎయిర్‌టెల్ అత్యంత వేగవంతమైన 4జీ నెట్‌వర్క్‌గా అవతరించింది. సగటున 11.23 ఎంబీపీఎస్ వేగంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 9.13 ఎంబీపీఎస్ వేగంతో వొడాఫోన్, 7.11 ఎంబీపీఎస్ వేగంతో రిలయన్స్ జియో, 7.04 ఎంబీపీఎస్ వేగంతో ఐడియా వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

రూ.11కే జియో అన్-లిమిటెడ్ 4జీ డేటారూ.11కే జియో అన్-లిమిటెడ్ 4జీ డేటా

త్వరలో రానున్న జియో ఫోన్3పై ఓ లుక్కేయండి

త్వరలో రానున్న జియో ఫోన్3పై ఓ లుక్కేయండి

దేశీయ టెలికాం దిగ్గజం జియో మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. అదే జియో ఫోన్ 3. అత్యంత చౌకైన ధరకే స్మార్ట్ మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చిన జియో ఫోన్ కంపెనీ ఈ ఏడాది కొత్త మోడల్ ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

జియో 3 ఫోన్ అచ్చం బ్లాక్ బెర్రీ మోడల్

జియో 3 ఫోన్ అచ్చం బ్లాక్ బెర్రీ మోడల్

రానున్న జియో 3 ఫోన్ అచ్చం బ్లాక్ బెర్రీ మోడల్ ను పోలి ఉండి యూజర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. కాగా అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ ఫీచర్లు, ఫాస్ట్ డేటా నెట్ వర్క్ అందిస్తుండటంతో అందరూ జియో స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

జియో ఫోన్ 2 ను మార్కెట్లోకి

జియో ఫోన్ 2 ను మార్కెట్లోకి

జియో ఫోన్ 2 ను మార్కెట్లోకి విడుదల చేసిన తరువాత అది సక్సెస్ సాధించిన నేపథ్యంలో జియో 3 ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఓ వెబ్ సైట్ లో ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ ను పెట్టారు.

జూన్ లో జియో 3 ఫోన్ లాంచ్

జూన్ లో జియో 3 ఫోన్ లాంచ్

ఈ ఏడాది జూన్ లో జియో 3 ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. అదే నెలలో జియో కొత్త ఫోన్ Free ఆర్డర్లు ప్రారంభం అవుతాయిని, ఆగస్టు నుంచి కొత్త ఫోన్ షిప్ మెంట్స్ స్టార్ట్ అవుతాయని చెప్పారు.

జియో ఫోన్ 3 లో ఫీచర్లు

జియో ఫోన్ 3 లో ఫీచర్లు

ప్రస్తుతం జియో ఫోన్ రెండు మోడళ్ల కంటే ఈ జియో ఫోన్ 3 లో ఫీచర్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయట. తొలి మోడల్ ఫోన్లో T9 కీప్యాడ్ ఉండగా.. జియో ఫోన్ 2 లో QWERTY కీ ప్యాడ్ మాత్రమే ఉంది. కొత్తగా వచ్చే జియో 3 ఫోన్ లో Touch Screen తో రానుంది. జియో ఫోన్ 3 ధర రూ.4వేల 500 వరకు ఉండే అవకాశం ఉంది.

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio tops in overall 4G coverage but Airtel is still fastest 4G network in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X