రెండేళ్ల జియో ప్రస్థానంలో ఎన్నో మలుపులు
జియో రెండేళ్ల క్రితం తన ప్రస్థానాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు టెలికాం రంగంలో భారీ మార్పులకు కేంద్ర బిందువుగా మారింది.
జియో రెండేళ్ల క్రితం తన ప్రస్థానాన్ని మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు టెలికాం రంగంలో భారీ మార్పులకు కేంద్ర బిందువుగా మారింది. ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బ తీసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీల నుంచి వచ్చిన ఆలోచన టెలికాం రంగాన్ని పూర్తిగా మార్చివేసింది. దేశీయ మార్కెట్‌లోనే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా జియో తానేంటో నిరూపించుకుంటూ.. అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. సెప్టెంబర్ 5 రిలయన్స్ జియో తన రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ రెండేళ్ల ప్రస్థానంలో జియో సాధించిన విజయాలను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో ఎంట్రీ తర్వాత..
జియో ఎంట్రీ తర్వాత మొబైల్ డేటా వినియోగం ఇండియాలో నెలకు 20 కోట్ల జీబీ నుంచి 370 కోట్ల జీబీకి పెరిగింది. కేవలం జియో కస్టమర్లే 240 కోట్ల జీబీ డేటాను వినియోగిస్తున్నారంటే దాని ప్రభావం ఎంతో తెలుుకోవచ్చు.

లాంచ్ అయిన నెలల్లోనే..
జియో లాంచ్ అయిన నెలల్లోనే, ప్రపంచంలోనే నెంబర్ కంపెనీగా ఎదిగింది. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను తన సొంతం చేసుకుంది. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. 2018 జూన్ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది.

ప్రతి సెకనుకు ఏడుగురు..
ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. 2018 జూన్ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది.

4జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో
భారత్‌లో ఎల్‌టీఈ కవరేజ్ ఎక్కువగా జియోకే ఉంది. 99 శాతం భారత జనాభాను త్వరలో జియోనే కవర్ చేయబోతుంది.4జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో జియోనే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ట్రాయ్ స్పీడ్‌టెస్ట్ పోర్టల్ వెల్లడించింది.

టారిఫ్ ప్లాన్లపై
అన్ని టారిఫ్ ప్లాన్లపై జియో ఉచిత అపరిమిత కాలింగ్‌ను ఆఫర్ చేసింది. జియో రాక ముందు ఏ కంపెనీ కూడా అలా ఆఫర్ చేయలేదు. జియో తీసిన ఈ అపరిమిత సంచలనంతో, మిగతా అన్ని కంపెనీలు కూడా ఉచితాల బాట పట్టాయి. డేటాను ధరలను కూడా తగ్గించాయి.

ప్రస్తుతం 15 రూపాయలకు
జియో లాంచ్ తర్వాత, 250 రూపాయల నుంచి 10వేల రూపాయల మధ్యలో ఉన్న ఒక్క జీబీ డేటా ధర, ప్రస్తుతం 15 రూపాయలకు తగ్గింది. జియో లాంచింగ్ తర్వాత డేటా ధరలు భారీగా కుప్పకూలి, సామాన్యుడికి చేరువలో ఇంటర్నెట్ వచ్చేసింది.

జియో దెబ్బకు చాలా కంపెనీలు ..
జియో తీసుకొస్తున్న కొత్త కొత్త టారిఫ్ ప్లాన్లతో ఇతర టెల్కోల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయా కంపెనీలు కూడా జియో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టిన వెంటనే, దానికి కౌంటర్‌గా టారిఫ్ ధరలను తగ్గిస్తూ పోతున్నాయి. జియో దెబ్బకు చాలా కంపెనీలు మూత పడటం, మరికొన్ని కంపెనీలు విలీనమవడం జరిగింది.

ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు..
జియో ఎంట్రీ అనంతరం, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు యూజర్ బేస్ పెరిగింది. అంటే పరోక్షంగా ఈ కంపెనీలకు కూడా జియో బాగా సహకరించింది. జియో కార్యకలాపాలు లాంచ్ అయినప్పటి నుంచి గూగుల్, ఫేస్‌బుక్‌లకు భారత్ మోస్ట్ యాక్టివ్ మార్కెట్‌గా మారింది.

ఎల్‌వైఎఫ్ బ్రాండ్ కింద ..
ఎల్‌వైఎఫ్ బ్రాండ్ కింద వాయిస్‌ఓవర్ ఎల్‌టీఈ డివైజ్‌లను కూడా రిలయన్స్ రిటైల్ లాంచ్ చేసింది. జియో అరంగేట్రం తర్వాత ఈ డివైజ్‌ల సరుకు రవాణా పెరిగింది.

ఫీచర్ ఫోన్ మార్కెట్‌లోనూ..
ఫీచర్ ఫోన్ మార్కెట్‌లోనూ జియో సంచలనానికి తెరలేపింది. జియోఫోన్ పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను ప్రవేశపెట్టి, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఇటీవలే ఫీచర్ ఫోన్‌లో హైఎండ్ మోడల్ జియోఫోన్ 2ను కూడా ఆవిష్కరించింది.

బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లోకి..
బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లోకి జియో అడుగుపెట్టింది. జియో గిగాఫైబర్ పేరుతో ఫైబర్ ఆధారిత వైర్‌లైన్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2018 ఆగస్టు 15 నుంచి దీని రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది.

గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో ..
భారత్‌ను గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో నిల్చోబెట్టడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతుందని ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ పలుమార్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








