అమెరికాకు దిమ్మతిరిగింది, ఇచ్చిందెవరో తెలిస్తే ఇంకా షాక్ !

Written By:

అమెరికా...టెక్నాలజీలో దూసుకుపోతున్న దేశం.ఇప్పుడు ఆ దేశానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇచ్చింది ఎవరో కాదు..ఇండియా టెలికం మార్కెట్లో సునామిని సృష్టిస్తున్న జియో. ఏమిటి షాకవుతున్నారా..జియో ఏంటి అమెరికాకు షాకివ్వడం ఏంటీ అని అనుకుంటున్నారా..అయితే ఈ న్యూస్ చదవాల్సిందే.

Airtel, జియోలకు BSNL షాక్, 90 రోజుల పాటు అన్నీ అన్‌లిమిటెడ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికాను వెనక్కి నెట్టివేసి అగ్రస్థానంలోకి

డేటా విషయంలో ఇండియన్లు చాలా వీక్ అన్న అమెరికాను భ్రమలను జియో పటాపంచల్ చేసింది. అమెరికాను వెనక్కి నెట్టివేసి అగ్రస్థానంలోకి ఇండియా దూసుకెళ్లేలా చేసి అమెరికాకు జియో షాకిచ్చింది.

జియో వచ్చి నేటికి ఏడాది

అయితే జియో వచ్చి నేటికి ఏడాది. ఈ ఏడాదిలో జియో చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. డేటా విషయంలో జియోకు ముందు.. జియోకు తర్వాత అని చెప్పుకునే స్థాయికి చేరింది.

పాతికేళ్లలో..

ఇక గత పాతికేళ్లలో పాత ఆపరేటర్లందరూ కలిసి స్థాపించుకున్న 2జీ నెట్‌వర్క్‌కు మించి 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుందీ జియో సంస్థ. అందుకు ఈ కంపెనీ తీసుకున్న సమయం మూడేళ్లు మాత్రమే.

ఉచిత కాల్స్‌కు వాస్తవ రూపం

భారత్‌లో ఉచిత కాల్స్‌కు వాస్తవ రూపం ఇచ్చిన తొలి సంస్థ కూడా జియోనే. టెలికం మార్కెట్ మొత్తాన్ని డేటా దిశగా నడిపింది.

జియో రాకముందు

జియో రాకముందు నెలకు 20 కోట్ల జీబీ మాత్రమే భారతీయులు వినియోగించే వారు జియో రాకతో అది ఏకంగా 125 కోట్ల జీబీకి చేరింది.

జియోకు ముందు భారత్‌ 155వ స్థానంలో

మొబైల్‌ డేటా వినియోగంలో జియోకు ముందు భారత్‌ 155వ స్థానంలో ఉండగా.. ఇపుడు నంబర్‌ 1 స్థానంలో ఉంది. టీవీని చూసే సమయంతో పోలిస్తే అంతకు ఏడు రెట్లు మొబైల్‌పై భారతీయులు గడుపుతున్నారంటే అదంతా జియో చలవే.

170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను

ప్రపంచంలో ఏ కంపెనీ కూడా 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను సొంతం చేసుకోలేదు. అది జియోకు మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం 13 కోట్ల మందికి జియో తన సేవలందిస్తోంది.

ఒక జీబీ రూ.50 కంటే తక్కువకే

జియో రాకముందు 1జీబీకి రూ.250 నుంచి రూ.4000 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇపుడు ఒక జీబీ రూ.50 కంటే తక్కువకే లభిస్తోంది.

84 రోజులకు రోజూ 1 జీబీ

జియో వినియోగదార్లకియతే 84 రోజులకు రోజూ 1 జీబీ చొప్పున రూ.399కే వస్తోంది. అంటే రూ.50/జీబీ కంటే చాలా తక్కువన్నమాట.

వైర్‌లెస్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సంఖ్య విషయంలోనూ

వైర్‌లెస్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సంఖ్య విషయంలోనూ జియో విప్లవం కొనసాగుతోంది. అది ఇంకా నిర్మాణ దశలో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio turns one: From a disruptive 4G telco to a network leader in one year Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot