4జీ ఫోన్స్ లేకున్నా సరే, జీవితాంతం జియో ఉచిత కాల్స్ చేసుకోవచ్చు

Written By:

చాలామంది చేతిలో 4 జీ ఫోన్ లేని కారణంగా రిలయన్స్ జియో అపరిమిత ఉచిత కాల్స్ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామని బాధపడుతుంటారు. ఇప్పుడు అలా బాధపడుతున్న వారికి జియో ఓ శుభవార్త మోసుకొచ్చింది. 4జీ ఫోన్ లేనివారికి సైతం జీవితాంతం జియో ఉచిత కాల్స్ ని అందించాలని చూస్తోంది. ఈమేరకు చర్చలు జరుపుతున్నట్లుగా జియో అధికార వర్గాలు చెబుతున్నాయి.

పూర్తి ఉచితం సాధ్యం కాదు: జియోకి కూడా డబ్బులు కట్టాల్సిందే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బేసిక్ హ్యాండ్ సెట్లను

టెలికం రంగంలో మరో సంచలనానికి జియో సిద్ధమైంది. రూ. 1000 నుంచి రూ. 1500 మధ్య ఉండే బేసిక్ హ్యాండ్ సెట్లను విక్రయించి, వాటి ద్వారా జియో ఉచిత కాల్స్ సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తోంది.

ఈ ఫోన్లలో వాయిస్ ఓవర్ ఎల్టీఈ

ఈ ఫోన్లలో వాయిస్ ఓవర్ ఎల్టీఈ (వీఓఎల్టీఈ) సౌకర్యాన్ని చేర్చగలిగితే, అన్ని వర్గాలకూ చేరువ కావచ్చని జియో భావిస్తోంది. దీనికోసం పలు మొబైల్ తయారీ కంపెనీలతో చర్చలు సాగిస్తోంది.

టెలికం సంస్థలతో జియో చర్చలు

టెలికం సంస్థలతో జియో చర్చలు సఫలమై అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, ఈ నెలాఖరులోగానే జియోకు మద్దతిచ్చే ఫీచర్ ఫోన్స్ మార్కెట్లోకి వస్తాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 2,999 కి 4 జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ

లైఫ్ బ్రాండ్ పేరిట రూ. 2,999 కి 4 జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఫోన్లను రిలయన్స్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

బేసిక్ వీఓ ఎల్టీఈ ఫోన్లను

ఇక బేసిక్ వీఓ ఎల్టీఈ ఫోన్లను పరిశీలిస్తున్నామని కార్బన్ మొబైల్స్ చైర్మన్ సుధీర్ హసిజా వెల్లడించగా, జియోతో తాము చర్చలు జరుపుతున్నామని ఇన్ ఫోకస్ వెల్లడించింది.

వీడియోకాన్ మొబైల్స్

కాగా దీనిపై తామింకా ఏ నిర్ణయం తీసుకోలేదని వీడియోకాన్ మొబైల్స్ సీఈవో జెరాల్డ్ పెరీరా చెప్పారు. భవిష్యత్లో సంస్థ తీసుకొచ్చే టెక్నాలజీపై ఇప్పుడే స్పందించలేమంటూ శామ్సంగ్ మొబైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ మను శర్మ సమాధానం దాటవేశారు.

పరిమాణం పరంగా

నిజానికి పరిమాణం పరంగా దేశంలో మొబైల్స్ విక్రయాల్లో 54 శాతం వాటా బేసిక్ ఫోన్లదే. ఇవి నెలకు కోటి యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఈ మార్కెట్లో కూడా జియో తన సత్తాను చాటుకోవాలని చూస్తోంది.

ప్రీ, పోస్ట్ పెయిడ్ ప్లాన్లను

జియో ఇటీవలే రూ .19 మొదలుకుని రూ .4,999 వరకు గల ధరలో శ్రేణిలో ప్రీ, పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. కస్టమర్లు ఏ ప్యాక్ తీసుకున్నా లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ తో పాటు రోమింగ్ కూడా ఉచితమే.

దేశవ్యాప్తంగా 4 జీ లెసైన్స్ మాత్రమే

నిజానికి రిలయన్స్ కు దేశవ్యాప్తంగా 4 జీ లెసైన్స్ మాత్రమే ఉంది. దీంతో వాయిస్ కాల్స్ కూడా అది డేటా ఆధారంగానే ఇవ్వాల్సి ఉంటుంది.

సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో

అయితే రూ. 149 ప్యాకేజ్ తీసుకుంటే డేటా మొత్తం కాల్స్ కే ఖర్చు అవుతుందని అలాంటప్పుడు ఉచిత కాల్స్ ఇచ్చి లాభమేంటని సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జియో వివరణ ఇచ్చింది.

అతి తక్కువ డేటా ప్యాక్ తీసుకున్న

కష్టమర్లు అతి తక్కువ డేటా ప్యాక్ తీసుకున్న అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని దీనిలో ఎలాంటి సందేహం అవసరం లేదని కంపెనీ చెబుతోంది. మరి ఈ టెక్నాలజీ ముందు ముందు ఎటువంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Reliance Jio Unlimted Free Calls for Basic Mobile Phones read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting