జియో సంచలనం: భారత్‌లో 5.5G టెక్నాలజీ ఆవిష్కరణ.. ఇంటర్నెట్ స్పీడ్ చూస్తే..!!
ఇండియన్ మొబైల్ టెక్నాలజీలో రిలయన్స్ జియో మరో ముందడుగు వేసింది. జియో ఇప్పుడు సరికొత్త 5.5G టెక్నాలజీని ఆవిష్కరించింది. 5G-అడ్వాన్స్‌డ్ అని కూడా పిలిచే ఇది రెగ్యులర్ 5G కంటే చాలా ఫాస్ట్ ఉంటుంది. నెట్‌వర్క్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది.
అందుకే యూజర్లు సెకనుకు 1 గిగాబైట్ డేటా స్పీడ్‌ను అందుకోవచ్చు, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కమర్షియల్‌గా ఇది ఇంకా లాంచ్ కాలేదు. త్వరలోనే భారతీయులందరికీ అవైలబుల్‌లో ఉంటుంది.

* అసలు ఏంటీ 5.5G
5.5G అంటే 5G టెక్నాలజీకి అప్‌గ్రేడ్ వెర్షన్ అన్నమాట. దీన్ని 3GPP రిలీజ్ 18 స్టాండర్డ్ ప్రకారం తయారు చేశారు. ఇది పాత 5G టెక్నాలజీ కంటే ఎన్నో కోణాల్లో ఉత్తమంగా నిలుస్తుంది. ముఖ్యంగా డేటా స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, కవరేజ్ ఏరియా పెరుగుతుంది, అప్‌లోడ్ స్పీడ్ కూడా అదిరిపోతుంది.
* చూడండి.. ఎంత స్పీడో..
మల్టీ-క్యారియర్ అగ్రిగేషన్ అనే టెక్నాలజీతో, 5.5G ద్వారా గరిష్టంగా 10 Gbps డౌన్‌లోడ్ స్పీడ్, 1 Gbps అప్‌లోడ్ స్పీడ్ అందుకోవచ్చు. దీనివల్ల సినిమాలు, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వంటి పనులే కాదు, పరిశ్రమల్లో రియల్ టైమ్ డేటా మానిటరింగ్, ఆటోమేషన్ వంటి పనులకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
* ప్రపంచం మొత్తం దీన్నే చూస్తోంది
5.5G టెక్నాలజీ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా టెలికాం కంపెనీలు దీన్ని టెస్ట్ చేస్తున్నాయి. ఉదాహరణకు, కువైట్‌కు చెందిన జైన్ సంస్థ ట్రయల్స్‌లో ఏకంగా 10 Gbps స్పీడ్ సాధించింది. బల్గేరియాలో వివాకామ్ కూడా విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసింది. ఇండియాలో జియో ఈ టెక్నాలజీతో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలని చూస్తోంది. ఇప్పటికే యూజర్లు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ లాట్లు, రద్దీ ప్రదేశాలలో కూడా మంచి స్పీడ్‌ను, స్ట్రాంగ్ కనెక్షన్‌ను అందుకుంటున్నారు.
* యూజర్లకు దీనివల్ల లాభమేంటి..
జియో 5.5G మల్టీ-సెల్ కనెక్టివిటీని ఉపయోగిస్తుంది. అంటే ఫోన్ ఒకేసారి వేర్వేరు టవర్ల నుంచి వచ్చే అనేక నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అవ్వగలదు. ఫలితంగా డేటా ట్రాన్స్‌ఫర్ చాలా వేగంగా జరుగుతుంది, కాల్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది, నెట్‌వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కచ్చితమైన, నమ్మదగిన వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు అవసరమయ్యే పరిశ్రమలకు ఇది ఒక వరం లాంటిది.
* వన్‌ప్లస్ 13 సిరీస్‌తో 5.5G అనుభూతి..
ఇండియన్ యూజర్లకు 5.5G అనుభూతిని అందించడానికి వన్‌ప్లస్ రిలయన్స్ జియోతో చేతులు కలిపింది. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ ఫోన్‌లో జియో 5.5G నెట్‌వర్క్‌పై 1,014 Mbps కంటే ఎక్కువ స్పీడ్‌ను అందుకుని ఆశ్చర్యపరిచింది. అంటే యూజర్లు ఫైల్స్‌ను చాలా వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, యాప్ అప్‌డేట్స్ క్షణాల్లో పూర్తవుతాయి., లిఫ్టులు, రద్దీ ప్రదేశాలలో కూడా కనెక్షన్ ఎక్కడా ఆగదు.
లిఫ్టులో అదిరిపోయే కాలింగ్
టెస్టుల్లో వన్‌ప్లస్ 13 ఫోన్‌లో వాట్సాప్ కాల్స్ ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో పోలిస్తే లిఫ్టుల్లో 20% ఎక్కువ స్థిరంగా ఉన్నట్లు తేలింది. చూశారుగా, జియో, వన్‌ప్లస్ కలిసి భారతదేశంలో మొబైల్ కనెక్టివిటీకి సరికొత్త ఎక్స్‌పీరియన్స్, డెఫినేషన్ ఇస్తున్నాయి.


Click it and Unblock the Notifications








