Home
News

జియోఫోన్ నెక్స్ట్ 4G ఫోన్ ప్రీ-బుకింగ్ డేట్ లీకైంది!! ఎప్పుడో తెలుసా??

ఇండియాలోని టెలికాం రంగంలో మార్పులను తీసుకొనివచ్చి కొద్ది కాలంలోనే మొదటి స్థానానికి ఎదిగిన రిలయన్స్ జియో త్వరలోనే సెప్టెంబర్ 10, 2021 న జియోఫోన్ నెక్స్ట్ అనే కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధర వద్ద విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చాలా పుకార్లు వచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే. కొత్త JioPhone Next ఫోన్ ను రిలయన్స్ జియో మరియు గూగుల్ సంస్థలు రెండు కలిసి అభివృద్ధి చేశాయి. ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్ టైమ్‌లైన్ లీకైంది. వచ్చే వారం నుండి భారతదేశంలోని వినియోగదారులు జియోఫోన్ నెక్స్ట్‌ను ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 10, 2021 న లాంచ్ కానున్నందున కంపెనీ వచ్చే వారం ప్రారంభంలోనే ఈ ఫోన్ ముందస్తు బుకింగ్ ప్రారంభిస్తుందని నమ్మడం కష్టం కాదు.

జియోఫోన్ నెక్స్ట్ 4G ఫోన్ ధరల వివరాలు

జియోఫోన్ నెక్స్ట్ 4G ఫోన్ ధరల వివరాలు

జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ కు సంబంధించి చాలా పుకార్లు మార్కెట్లో ఉన్నాయి. ఈ పుకార్లలో ఒకటి జియో కొత్త ఫోన్ సరసమైన ధర వద్దనే లభించడం. అనేక ఆన్‌లైన్ నివేదికల ప్రకారం జియోఫోన్ నెక్స్ట్ రూ.3,499 ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఖచ్చితమైనది అని చెప్పలేము కానీ సంస్థ ఈ ధర విభాగంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ సరసమైన ధర వద్ద అతుకులు లేని ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించగలిగితే కనుక జియోకి ఇది మరో ముఖ్యమైన విజయం కావచ్చు.

జియోఫోన్ నెక్స్ట్ 4G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

జియోఫోన్ నెక్స్ట్ 4G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

జియోఫోన్ నెక్స్ట్ 4G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌లు కూడా ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. జియోఫోన్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌లో పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ 5.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 215 SoC తో రన్ అవుతూ 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి శక్తినిపొందుతుంది.

జియోఫోన్ నెక్స్ట్

జియోఫోన్ నెక్స్ట్ 4G స్మార్ట్‌ఫోన్ అందించే ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది వెనుక భాగంలో సింగిల్ 13MP సెన్సార్ బ్యాక్ కెమెరాను మరియు సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది 2500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ వంటి ప్రీపెయిడ్ ప్లాన్‌లతో జతచేయబడుతుందా లేదా అనేది ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది. అయితే ఈ ఫోన్ ఇండియాలో ప్రారంభించడం చాలా దగ్గరలోనే ఉంది. దీనికి సంబందించిన అన్ని వివరాలు పూర్తిగా కొన్ని రోజుల్లోనే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ జియో దాదాపు రూ.3000 ధర పాయింట్‌ల వద్దనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయగలిగితే కనుక అది మార్కెట్‌లో విధ్వంసం సృష్టించవచ్చు. JioPhone Next కంపెనీకి విజయవంతం అవుతుందా లేదా అనేది సమయం మాత్రమే నిర్ణయిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio Upcoming 4G Phone JioPhone Next Pre-Booking Date Leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X