జియోఫోన్ 5G యొక్క ఫీచర్స్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి!!

|

భారతదేశంలోని టెలికాం రంగంలోని మార్పులకు మొదటగా శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో సంస్థ అనతి కాలంలోనే టాప్ స్థానాన్ని అందుకున్నది. భారతదేశంలో ఇప్పటికి 5G నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినప్పటికీ 5Gసేవలను ఈ సంవత్సరంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నందున ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్తగా 5G ని సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. ఈ టెలికాం ఆపరేటర్ ఇప్పటికే భారతదేశంలోని 1000 నగరాలకు 5G కవరేజ్ ప్రణాళికను పూర్తి చేసినట్లు నివేదించబడింది. మొదటి దశలో భారతదేశంలోని 13 ప్రధాన నగరాలను ముందుగా కవర్ చేయాలని భావిస్తున్న కవరేజ్ ప్లానింగ్ అమలులో జియో నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ ముఖ్యమైన పాత్ర పోషించనున్నది.

 

జియో

ఆండ్రాయిడ్ సెంట్రల్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం రిలయన్స్ జియో సంస్థ తన యొక్క 5G స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన కేటగిరీలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది జియోఫోన్ 5G గా పిలుస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని 5G స్మార్ట్‌ఫోన్‌ పరికరాలు 5G మోడెమ్‌తో వస్తాయి కానీ ఇప్పటికి 5G సర్వీసులు ఇండియాలో అందుబాటులో లేదు. జియో తన 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌తో దీన్ని మార్చాలని భావిస్తోంది. ఇది దేశంలో 5G సేవల రోల్‌అవుట్‌తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం ప్రణాళికాబద్ధమైన జియోఫోన్ 5G కు సంబందించిన ఫీచర్స్ యొక్క ప్రధాన వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. దీని గురించి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫోన్ 5G స్పెసిఫికేషన్‌ల వివరాలు

జియోఫోన్ 5G స్పెసిఫికేషన్‌ల వివరాలు

రిలయన్స్ జియో సంస్థ నుంచి త్వరలో రాబోయే 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే ఇది 5G నెట్‌వర్క్ మద్దతుతో ప్రారంభించబడనున్నది. దీనికి అదనంగా జియోఫోన్ 5G హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 480 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది జియోఫోన్ నెక్స్ట్‌లో ఫీచర్ చేయబడిన స్నాప్‌డ్రాగన్ 215 చిప్‌సెట్ నుండి అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క డిస్‌ప్లే స్పెక్స్ విషయానికి వస్తే అదే 1600×720 పిక్సెల్‌ల HD+ డిస్‌ప్లేతో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

జియోఫోన్ 5G
 

జియోఫోన్ 5G పరికరంలో RAM 4GBకి పెంచబడింది. అయితే అందుబాటులో ఉన్న ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 32GB విస్తరించవచ్చు. అంతేకాకుండా కొత్త ఫోన్ 2MP సెకండరీ కెమెరాతో పాటు 13MP మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానున్నది. అలాగే జియోఫోన్ 5G ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ మద్దతుతో లభించడమే కాకుండా USB టైప్-సి పోర్ట్ ద్వారా కనెక్ట్ చేయగల 18W ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. పరికరం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కూడా రావచ్చు. జియోఫోన్ 5G ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా రూ. 10,000 ధర ఉంటుందని అంచనా వేయబడింది.

Jio UPI ఆటోపే ఫెసిలిటీ

Jio UPI ఆటోపే ఫెసిలిటీ

మీరు జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్ అయితే కనుక UPI ఆటోపే ఎంపికతో జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు తాము ఇంతకు ముందు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ప్లాన్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా మీ ప్రస్తుత ప్లాన్ యొక్క వాలిడిటీ ముగింపును ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఫీచర్‌తో మీరు అదే ప్లాన్‌తో సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఫీచర్‌ని ఎంచుకుంటే రీఛార్జ్ ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. రూ.5,000 రీఛార్జ్ మొత్తాల కోసం ఈ ఫీచర్ అనుమతిస్తుంది. అంతేకాకుండా మీరు మీ ప్రీపెయిడ్ నంబర్‌ని రీఛార్జ్ చేసేటప్పుడు UPI పిన్‌ని నమోదు చేయవలసిన అవసరం లేదు. అయితే అధిక మొత్తంలో రీఛార్జ్ చేసే మొత్తాలకు మాత్రమే UPI పిన్ ప్రమాణీకరణ అవసరం. ఇంకా మీరు ఈ ఆటోపే ఫీచర్ ద్వారా మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకున్న టారిఫ్ ప్లాన్‌ల కోసం ఇ-మాండేట్‌ను సృష్టించవచ్చు, సవరించవచ్చు మరియు పూర్తిగా తొలగించవచ్చు. ఈ UPI ఆటోపే ఎంపిక ప్రస్తుతానికి ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్‌పెయిడ్ చందాదారులు మాత్రం మాన్యువల్‌గానే తమ బిల్లులను చెల్లించాలి.

MyJio యాప్ ద్వారా మీ జియో ప్రీపెయిడ్ నంబర్‌కు UPI ఆటోపే సెటప్ చేసే విధానం

MyJio యాప్ ద్వారా మీ జియో ప్రీపెయిడ్ నంబర్‌కు UPI ఆటోపే సెటప్ చేసే విధానం

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో MyJio యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: యాప్ ఎగువన ఉన్న మొబైల్ ట్యాబ్‌కి వెళ్లండి.

స్టెప్ 3: ఇప్పుడు సెటప్ జియో ఆటోపేపై ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: UPI మరియు బ్యాంక్ అకౌంట్ అనే రెండు ఎంపికల నుండి ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించే పేజీకి దారి మళ్లించబడతారు. ఇక్కడ మీరు UPI ఎంపికను ఎంచుకోవాలి.

స్టెప్ 5: ఇప్పుడు మీరు మీ జియో ప్రీపెయిడ్ నంబర్ యొక్క ఆటోమేటిక్ పేమెంట్లను ఎంచుకోవాలనుకుంటున్న రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోండి. మీరు మీ అవసరాలకు సరిపోయే ప్లాన్‌ని ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.

స్టెప్ 6: UPI ఎంపికను ఎంచుకున్న తర్వాత మీరు మీ UPI IDని అందించాలి మరియు ఆటోపే సదుపాయాన్ని సెట్ చేయాలి.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio Upcoming 5G Smartphone Comes With Snapdragon 480 SoC: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X