ఆ ఫోన్ కొంటే 100 జిబి జియో డేటా ఫ్రీ

Written By:

షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మ్యాక్స్‌2 కొనుగోలు చేసేవారికి జియో బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ కొన్నవారికి 100 జిబి 4జీ డేటాను ఉచితంగా అందించనుంది. జియో, షియోమి భాగస్వామ్యంలో లాంచ్‌ ఆఫర్లలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్టు తెలిపింది. కాగా ఎంఐ మ్యాక్స్‌ 2 మంగళవారం భారత మార్కెట్‌లోకి లాంచైంది. దీని ధర 16,999 రూపాయలు. 6.44 అంగుళాల డిస్‌ప్లే అతి పెద్ద డిస్‌ప్లే,5300 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీనిలోని ప్రత్యేక ఫీచర్లు.

జియో ఎఫెక్ట్ , ఎయిర్‌సెల్ పరిమితి లేని ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో-ఎంఐ మ్యాక్స్‌ 2 ఆఫర్‌

జియో-ఎంఐ మ్యాక్స్‌ 2 ఆఫర్‌ 4జీ డేటా అందుబాటులో ఉన్న అన్ని రీఛార్జ్‌లకు, ఎస్‌ఎంఎస్‌లకు, సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్న జియో యాప్స్‌కు అందుబాటులో ఉంటుంది.

రూ.309

ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు రూ.309, అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్‌ చేసుకుంటే, ప్రతి 28 రోజుల వ్యవధికి 10జీబీ 4జీ డేటా అదనంగా పొందుతారు.

2018 మార్చి వరకు

10 రీఛార్జ్‌లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇలా 2018 మార్చి వరకు ప్రతి నెలా 10జీబీ అదనపు డేటాతో మొత్తం 100జీబీ డేటాను ఈ కస్టమర్లు పొందనున్నారు.

జియోనితో కూడా జియోకు భాగస్వామ్యం

జియోనితో కూడా జియోకు భాగస్వామ్యం ఉంది. ఇక తన బ్రాండు ఎల్‌వైఫ్‌ మొబైళ్లు కొనుగోలుచేసిన వారికి 20 శాతం అత్యధిక డేటా ఇస్తోంది. కొత్త జియోఫై పాకెట్‌ రూటర్‌ కొనుగోలుచేసిన వారికీ కూడా 224జీబీ వరకు ఉచిత డేటా ఆఫర్‌ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Users Buying Xiaomi Mi Max 2 Will Get Up to 100GB Free Data Read more At Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot