మార్చి 31 తరువాత మరో బంపర్ ఆఫర్..?

జూన్ 30, 2017 జియో సేవలను అతి తక్కుత రీఛార్జ్‌తో ఉపయోగించుకునేందుకు వీలుగా ఓ సరికొత్త టారిఫ్ ప్లాన్‌ సిద్ధమవుతోందా..?

|

మార్చి 31, 2017 తరువాత జియో మరో సంచలన ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు సమచారం. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగిసిన తరువాత జూన్ 30, 2017 జియో సేవలను అతి తక్కుత రీఛార్జ్‌తో ఉపయోగించుకునేందుకు వీలుగా ఓ సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సిద్ధం చేస్తున్నట్లు తెలియవచ్చింది.

Read More : దూసుకొస్తున్న 10 సామ్‌స్ంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

 వ్యూహత్మకంగా అడుగులు

వ్యూహత్మకంగా అడుగులు

జియో ఉచిత ఆఫర్ల పై ఇతర టెల్కోలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జియో వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రారంభ ఆఫర్ క్రింద రూ.100 మాత్రమే వసూలు చేసి మూడు నెలల పాటు డేటా అలానే వాయిస్ కాల్స్ ను జియో తన యూజర్లకు అందించే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ టాక్.

మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్తమీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్త

దేశవ్యాప్తంగా 7 కోట్ల యూజర్లు

దేశవ్యాప్తంగా 7 కోట్ల యూజర్లు

దేశవ్యాప్తంగా జియో సేవలను వినియోగించుకుంటున్న యూజర్ల సంఖ్య డిసెంబర్ 31, 2016 నాటికి 72.4 మిలియన్లకు చేరుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొద్ది రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే.

 83 రోజుల్లోనే 5 కోట్ల కస్టమర్లు
 

83 రోజుల్లోనే 5 కోట్ల కస్టమర్లు

లాంచ్ అయిన నాటి నుంచి కేవలం 83 రోజుల్లోనే 5 కోట్ల కస్టమర్ బేస్‌కు
రీచ్ అయిన జియో రోజుకు సగటున 6 లక్షల యూజర్లను రాబట్టుకోగలిగింది. రానున్న రోజుల్లో 90శాతం కంటే ఎక్కువ జనాభాను జియో సేవలు కవర్ చేస్తాయని రిలయన్స్ తెలిపింది.

రికార్డులు బద్దలు కొడుతున్న నోకియా ఫోన్రికార్డులు బద్దలు కొడుతున్న నోకియా ఫోన్

175 కాల్స్ ఫెయిల్ అవుతున్నాయి.

175 కాల్స్ ఫెయిల్ అవుతున్నాయి.

మార్కెట్లో లాంచ్ అయిన నాలుగు నెలలు కావస్తున్నప్పటికి కాల్ ఫెయిల్యుర్ సమస్యలు జియోనే వేధిస్తూనే ఉన్నాయి. జియో నెట్‌వర్క్ నుంచి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు వెళుతున్న ప్రతి 1000 కాల్స్‌లో 175 కాల్స్ ఫెయిల్ అవుతున్నట్లు జియో ఆరోపిస్తోంది. సర్వీస్ క్వాలిటీ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి 1000 కాల్స్‌కు 5 కాల్స్‌కు మించి ఫెయిల్ కాకూడదని రిలయన్స్ పేర్కొంది.

మరో 30,000 కోట్ల పెట్టుబడి

మరో 30,000 కోట్ల పెట్టుబడి

జియో ఇన్ఫోకామ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి ఇప్పటికే 1.71 లక్షల కోట్లను వెచ్చించిన రిలయన్స్ టెలికం యూనిట్‌ను మరితగా బలోపేతం చేసేందుకు మరో 30,000 కోట్లను వెచ్చించనుంది. కొత్తగా జియో పై వెచ్చించే మొత్తం నెట్‌వర్క్ బలోపేతానికి తోడ్పడుతుందని జియో ఇన్ఫోకామ్ భావిస్తోంది.

జియో రూ.999 ఫోన్ ఇదే!జియో రూ.999 ఫోన్ ఇదే!

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio users can continue to party after March 31, almost free. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X