పోర్న్ వెబ్‌సైట్ల ను బ్లాక్ చేయడం పై జియో యూజర్లు ఘరమ్ ఘరమ్
డాట్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) సూచనల మేరకు దేశంలో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పీలు) ఈ మధ్యే 850 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే .
డాట్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) సూచనల మేరకు దేశంలో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పీలు) ఈ మధ్యే 850 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే . కాగా జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న పలువురు యూజర్లు తమ ఫోన్లలో పోర్న్ వెబ్‌సైట్లు రావడం లేదని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జియోకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ట్వీట్లు చేస్తున్నారు.
జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న వారి డివైస్‌లలో పోర్న్ సైట్లు రావడం లేదని వారు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అశ్లీల వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలని కేంద్రానికి సూచించగా....
సెప్టెంబర్ 28, 2018వ తేదీన ఉత్తరాఖండ్ హై కోర్టు అశ్లీల వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలని కేంద్రానికి సూచించగా, డాట్ ఈ మేరకు దేశంలో ఉన్న అన్ని ఐఎస్‌పీలకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే 850 వరకు పోర్న్ సైట్లను పలు ఐఎస్‌పీలు బ్లాక్ చేయగా, కొన్ని ఐఎస్‌పీలు ఇంకా ఆ సైట్లను బ్యాన్ చేయలేదు. ఈ క్రమంలోనే జియో యూజర్లు తమ డివైస్‌లలో ఆ సైట్లు రావడం లేదని జియోపై మండిపడుతున్నారు. వెంటనే ఆ సైట్లపై బ్యాన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై జియో ఇంకా స్పందించలేదు.....
అయితే ఈ విషయంపై జియో ఇంకా స్పందించలేదు. కాగా పలువురు జియో యూజర్లు ఇంకాస్త ముందుకు వెళ్లి ఆ సైట్లపై వెంటనే బ్యాన్ ఎత్తేయకపోతే జియో నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌కు మారుతామని హెచ్చరిస్తున్నారు. దేశంలోనే భారీ సంఖ్యలో కస్టమర్లు కలిగిన టెలికాం నెట్‌వర్క్‌లలో జియో 3వ స్థానంలో ఉండగా, తాజాగా పలువురు వినియోగదారులు ఇస్తున్న హెచ్చరికల నేపథ్యంలో జియో సందిగ్ధంలో పడినట్లు తెలుస్తున్నది.

పోర్న్ సైట్లపై ఇప్పుడు కాదు, గతంలోనే కేంద్రం....
నిజానికి పోర్న్ సైట్లపై ఇప్పుడు కాదు, గతంలోనే కేంద్రం కొరడా ఝులిపించింది. 2015లోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దేశంలోని ఐఎస్‌పీలకు పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని చెప్పగా, ఐఎస్‌పీలన్నీ అప్పట్లో ఆ సైట్లను బ్లాక్ చేశాయి. ఈ విషయంపై అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన సెగలు వినిపించగా, కేంద్రం వెనక్కి తగ్గి ఆ సైట్లపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. అప్పటి నుంచి ఆ సైట్లు యథావిధిగా నడుస్తున్నాయి.

డెహ్రాడూన్‌లో 16 ఏళ్ల బాలికపై తోటి విద్యార్థులు నలుగురు లైంగిక దాడి చేశారు.....
ఈ క్రమంలో తాజాగా డెహ్రాడూన్‌లో 16 ఏళ్ల బాలికపై తోటి విద్యార్థులు నలుగురు లైంగిక దాడి చేశారు. వారు అంతకు ముందు అశ్లీల సైట్లు చూసి ప్రేరణ పొంది ఆ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తెలియడంతో ఉత్తరాఖండ్ హైకోర్టు అశ్లీల సైట్లపై నిషేధాన్ని అమలు చేయాలని, 2015 జూలై 31వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఆచరణలో పెట్టాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం పోర్న్ సైట్లను నిషేధించారు.


Click it and Unblock the Notifications








