స్పీడ్ టెస్ట్‌లో Reliance Jio గెలిచిందా..?

రిలయన్స్ జియో 4జీ సర్వీస్ ఇప్పుడు అన్ని 4జీ ఫోన్‌లను అందుబాటులోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ను వొడాఫోన్, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ స్పీడ్‌లతో కంపేర్ చేస్తూ నిర్వహించిన Speed Test ఆసక్తికర ఫలితాలను బహిర్గతం చేసింది.

స్పీడ్ టెస్ట్‌లో  Reliance Jio గెలిచిందా..?

Read More : బిల్‌గేట్స్... ఆ నిజాలు మీకు తెలియాలి..?

రిలయన్స్ జియో 4జీ సిమ్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న GizBot బృందం ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్పీడ్ టెస్ట్‌ను నిర్వహించింది. ఈ స్పీడ్ టెస్ట్‌లో విజేతగా నిలిచిన రిలయన్స్ జియో 4జీ ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే హైస్పీడ్ నెట్‌వర్క్ కవరేజ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ స్పీడ్ టెస్ట్‌లో వెల్లడైన ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ టెస్ట్‌లో భాగంగా

ఈ టెస్ట్‌లో భాగంగా వొడాఫోన్, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌లతో కూడిన మూడు 4జీ స్మార్ట్‌ఫోన్‌లను GizBot వినియోగించింది.

ఇండోర్ ఏరియాల్లో

ఈ మూడు 4జీ నెట్‌వర్క్‌లను ఇండోర్ స్థలాల్లో GizBot బృందం పరీక్షించింది. ఈ పరీక్షల్లో భాగంగా వొడాఫోన్ 4జీ సర్వీస్ 14.58 ఎంబీపీఎస్ అప్‌లోడ్, 8.71 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. మరోవైపు రిలయన్స్ జియో 4జీ సర్వీస్ డౌన్‌లోడ్ వేగం 20.97 ఎంబీపీఎస్, అప్‌లోడ్ వేగం 0.53ఎంబీపీఎస్‌గాను ఉంది. ఎయిర్‌టెల్ 4జీ సర్వీస్ విషయానికి వచ్చేసరికి అప్‌లోడ్ వేగం 2.36 ఎంబీపీఎస్ గాను, డౌన్‌లోడ్ వేగం 3.52 ఎంబీపీఎస్ గాను ఉంది.

 

అవుట్ డోర్ ఏరియాల్లో

ఈ మూడు 4జీ నెట్‌వర్క్‌లను అవుట్ డోర్ ఏరియాల్లో పరీక్షించి చూడగా, రిలయన్స్ జియో 4జీ డౌన్‌లోడ్ వేగం 41.16 ఎంబీపీఎస్‌గాను, అప్‌లోడ్ వేగం 7.86 ఎంబీపీఎస్ గాను ఉంది. వొడాఫోన్ 4జీ విషయానికి వచ్చేసరికి డౌన్‌లోడ్ వేగం35.37 ఎంబీపీఎస్ గాను, అప్‌లోడ్ వేగం 6.10 ఎంబీపీఎస్ గాను ఉంది. ఎయిర్‌టెల్ 4జీ విషయానికి వచ్చేసరికి డౌన్‌లోడ్ వేగం 3.46 ఎంబీపీఎస్ గాను, అప్‌లోడ్ వేగం 2.12 ఎంబీపీఎస్ గాను ఉంది.

కవరేజ్ పరంగా

నెట్‌వర్క్ కవరేజ్ పరంగా వాతావరణంతో సంబంధం లేకుండా రిలియన్స్ జియో 4జీ తన సత్తాను చాటకుంది. వొడాఫోన్ రెండవ స్థానంలో, ఎయిర్‌టెల్ మూడో స్థానంలో నిలిచాయి. 

జియో 4జీ సిమ్‌ను పొందాలంటే

4జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతి ఒక్కరూ Jio 4G సిమ్‌ను పొందవచ్చు ఈ సిమ్‌తో పాటు అందిస్తోన్న 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల వాయిస్ , డేటా ఇంకా మెసేజింగ్ సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు. జియో సిమ్ పొందలానుకునే వారు సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు వెళ్లి సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's the Reliance Jio Speed Test: And the Winner Is. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot