జియో, ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్‌ ప్లాన్స్, షాకిచ్చిన చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు

దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజురోజుకు వేడెక్కిపోతోంది. ముఖ్యంగా జియో, ఎయిర్‌టెల్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రీఛార్జ్ వార్ జరుగుతోంది.

|

దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజురోజుకు వేడెక్కిపోతోంది. ముఖ్యంగా జియో, ఎయిర్‌టెల్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రీఛార్జ్ వార్ జరుగుతోంది. రెండు కంపెనీలు ఒకదానికొకటి పోటీపడుతూ ఎప్పడికప్పుడు సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ రెండు దిగ్గజాలు ఇప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా మార్కెట్లోకి రెండు సరికొత్త ప్లాన్లను తీసుకువచ్చాయి. జియో రూ.99 ఎక్స్‌క్లూజివ్‌ ప్లాన్‌తో దూసుకురాగా ఎయిర్‌టెల్ రూ.299 ఎక్స్‌క్లూజివ్‌ ప్లాన్‌తో దూసుకొచ్చింది. ఈ ప్లాన్లు ఇలా ఉంటే రెండు కంపెనీలకు చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు ఒకేసారి షాక్ ఇచ్చారు. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

మనుగడ ప్రశ్నార్థకం, అనిల్ అంబానీకి మరో భారీ దెబ్బ !మనుగడ ప్రశ్నార్థకం, అనిల్ అంబానీకి మరో భారీ దెబ్బ !

రిలయన్స్ జియో ఎక్స్‌క్లూజివ్‌ ప్లాన్

రిలయన్స్ జియో ఎక్స్‌క్లూజివ్‌ ప్లాన్

99 రూపాయలతో కొత్త జియోఫోన్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. దీని కింద 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ డేటాను కస్టమర్లకు జియో ఆఫర్‌ చేయనుంది.

 49 రూపాయల, 153 రూపాయల ప్యాక్‌లకు

49 రూపాయల, 153 రూపాయల ప్యాక్‌లకు

ప్రస్తుతమున్న 49 రూపాయల, 153 రూపాయల ప్యాక్‌లకు ఈ ప్లాన్‌ అదనం. ఈ ప్లాన్‌ను, కంపెనీ జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌తో పాటు తీసకొచ్చింది.

వాయిస్‌ కాల్స్‌ ఉచితం

వాయిస్‌ కాల్స్‌ ఉచితం

కొత్త రూ.99 జియోఫోన్‌ రీఛార్జ్‌, యూజర్లు నెలవారీ ఖర్చులను సుమారు 50 శాతం తగ్గించింది. డేటాతో పాటు ఎస్‌ఎంఎస్‌లను జియో 300కు పెంచింది. వాయిస్‌ కాల్స్‌ను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది.

రూ.594 రీఛార్జ్‌ ప్యాక్‌
 

రూ.594 రీఛార్జ్‌ ప్యాక్‌

అదేవిధంగా రూ.594 రీఛార్జ్‌ ప్యాక్‌ను కూడా జియో ఆఫర్‌ చేస్తోంది. దీని కింద ఆరు నెలల పాటు అపరిమిత డేటాను, అపరిమిత కాల్స్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఈ ప్యాక్‌లో ఎలాంటి టెక్ట్స్‌ మెసేజ్‌లు రావడం లేదు.

రూ.501 రీఫండబుల్‌ డిపాజిట్‌

రూ.501 రీఫండబుల్‌ డిపాజిట్‌

జియో తీసుకొచ్చిన మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ కింద, రూ.501 రీఫండబుల్‌ డిపాజిట్‌ కింద కొత్త జియోఫోన్‌ను తీసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్‌ చేసే ఫీచర్‌ ఫోన్‌, వర్కింగ్‌ కండీషన్‌లో ఉండి, మూడేళ్ల కంటే తక్కువ వాడినదై ఉండాలి.

 101 రూపాయల విలువైన 6 జీబీ కాంప్లిమెంటరీ డేటా

101 రూపాయల విలువైన 6 జీబీ కాంప్లిమెంటరీ డేటా

ఈ హ్యాండ్‌సెట్‌ను ఎవరైతే పొందాలనుకుంటున్నారో, వారికి 101 రూపాయల విలువైన 6 జీబీ కాంప్లిమెంటరీ డేటాను జియో ఆఫర్‌ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌తో పాటు, కొత్త జియో సిమ్‌ కూడా కస్టమర్లకు వస్తుంది. అయితే పాత నెంబర్‌ను మొబైల్‌ పోర్టబులిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్‌ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్‌ ప్లాన్

టెలికాం టాక్‌ రిపోర్టు ప్రకారం ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం 299 రూపాయల ప్లాన్‌ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ కింద 45 రోజుల పాటు అపరిమితంగా వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది.రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందజేయనున్నట్టు తెలిసింది.

కస్టమర్లకు ఎలాంటి డేటా రాదు

కస్టమర్లకు ఎలాంటి డేటా రాదు

ఇప్పటి వరకు కాలింగ్‌లో రోజువారీ పరిమితులతో ఇబ్బంది పడ్డ వారికి, ఇది ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులను విధించడం లేదు. అయితే ఈ ప్లాన్‌లో మేజర్ విషయం కస్టమర్లకు ఎలాంటి డేటాను అందించకపోవడమే.

రూ.249, రూ.349 ప్లాన్లను

రూ.249, రూ.349 ప్లాన్లను

ఇప్పటికే రూ.249, రూ.349 ప్లాన్లను కూడా ఎయిర్‌టెల్ ఆఫర్‌ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లపై అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, డేటా ప్రయోజనాలను కేవలం 28 రోజుల పాటు అందిస్తోంది.

 రూ.1,199 పోస్టు పెయిడ్‌ ప్లాన్‌

రూ.1,199 పోస్టు పెయిడ్‌ ప్లాన్‌

ఇటీవల రూ.1,199 పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్‌ సమీక్షించింది. ఈ అప్‌గ్రేడేషన్‌తో అంతకముందు అందించే 90 జీబీ డేటా పరిమితిని, 120 జీబీకి ఎయిర్‌టెల్‌ పెంచింది.

షాకిచ్చిన చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు

షాకిచ్చిన చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు

టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లకు కంపెనీల చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు షాకిచ్చారు. రిలయన్స్‌ జియో గ్రూప్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జగ్బీర్‌ సింగ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెట్‌వర్క్స్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ శ్యాం ప్రభాకర్‌ మార్దికార్‌లు కంపెనీలకు రాజీనామా పత్రాలు అందించినట్టు తెలిసింది.

జగ్బీర్‌ సింగ్‌

జగ్బీర్‌ సింగ్‌

జగ్బీర్‌ సింగ్‌ జియో కంపెనీ 4జీ సర్వీసులు లాంచ్‌ చేయకముందు నుంచి దానిలో పనిచేస్తున్నారు. అంతకుముందు శాంసంగ్‌లో పనిచేశారు. ఓ దశాబ్ద కాలం పాటు ఎయిర్‌టెల్‌ కూడా పనిచేసినట్టు సమాచారం. జగ్బీర్‌ ప్రస్తుతం ఢిల్లీ వెళ్తున్నారని, అందుకే రాజీనామా చేశారని వెల్లడైంది. మిగతా ఏ వివరాలను కూడా కంపెనీ వర్గాలు వెల్లడించలేదు.

 భారతీ ఎయిర్‌టెల్‌కు..

భారతీ ఎయిర్‌టెల్‌కు..

మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌కు శ్యాం రాజీనామా చేసినట్టు ఈ కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. సంబంధిత వర్గాల వివరాల ప్రకారం మార్దికార్‌, తన కెరీర్‌లో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి రాజీనామా చేసినట్టు తెలిసింది.

ఎయిర్‌టెల్‌తో అనుబంధం

ఎయిర్‌టెల్‌తో అనుబంధం

2012 నుంచి మార్దికార్‌ ఎయిర్‌టెల్‌లో పనిచేస్తున్నారు. 2001-2010 మధ్యలో కూడా ఎయిర్‌టెల్‌లో ఈయన పనిచేశారు. ఆ అనంతరం ఉద్యోగం వదిలేశారు. మళ్లీ 2012 ఆగస్టులో అదే కంపెనీలో చేరారు. 2017 జనవరి నుంచి ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెట్‌వర్క్స్‌కు సీటీఓగా కూడా ఉన్నారు.

Best Mobiles in India

English summary
Jio Rs. 99 Recharge With 500MB Data per Day Launched Exclusively for Jio Phone Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X