మార్కెట్లోకి కొత్త ప్లాన్స్,ఇదుగోండి లిస్ట్!

జియో రాకతో టెలికం ఆపరేటర్ల మధ్య నువ్వా-నేనా అన్న చందాన టారిఫ్ వార్ నడుస్తోంది. రిలయన్స్ జియో అన్‌లిమిటెడ్ వాయిస్ ఇంకా డేటా ప్లాన్స్ మార్కెట్‌ను కుదిపేస్తున్న నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికం ఆపరేటర్స్ పోటాపోటీగా తగ్గింపు ఆఫర్లను రెగ్యులర్‌గా లాంచ్ చేస్తున్నాయి.

మార్కెట్లోకి కొత్త ప్లాన్స్,ఇదుగోండి లిస్ట్!

జియోకు పోటీగా ప్రముఖ టెలికం ఆపరేటర్స్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్‌ల వివరాలను మీముందుకు తీసుకురావడం జరుగుతోంది....

Read More : ఫోన్ కొంటే రూ.10,000 మీ అకౌంట్‌లోకి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్ అన్‌లిమిటెట్ వాయిస్‌ కాల్స్..

రిలయన్స్ జియో అన్‌లిమిటెట్ వాయిస్‌ కాల్ ఆఫర్‌కు పోటీగా భారతి ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజుల పాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 18జీబి వరకు 3జీ/4జీ మొబైల్ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.

 

ఏ నెట్‌వర్క్‌‌కు అయినే అన్‌లిమిటెడ్..

రూ.2,249 పెట్టి రీఛార్జ్ చేయించటం ద్వారా ఈ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ యూజర్లు పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ నెంబర్లతో పాటు వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, డొకోమో వంటి నెట్‌వర్క్‌లకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.148 పెట్టి రీచార్జ్ చేయించుకున్నట్లయితే..

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్ రూ.148 పెట్టి రీచార్జ్ చేయించుకున్నట్లయితే లోకల్ ఎయిర్‌టెల్ నెంబర్ల మధ్య 28 రోజుల పాటు అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఎయిర్‌టెల్ అఫీషియల్ సైట్‌లోకి వెళ్లండి.

 

ఎయిర్‌టెల్ బాటలోనే వొడాఫోన్..

ఎయిర్‌టెల్ బాటలోనే వొడాఫోన్ ఇండియా కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. వొడాఫోన్ యూజర్ రూ.297 పెట్టి రీఛార్జ్ చేయించుకోవటం ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 3జీబి 3జీ/4జీ డేటాను పొందే అవకాశం ఉంటుంది. రూ.449 రేంజ్ లోనూ ఈ ప్లాన్‌లను వొడాఫోన్ అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు వొడాఫోన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.

బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్‌

రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు.

 

RComm అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్‌..

రిలయన్స్ జియోకు పోటీగా RComm ఓ ఆసక్తికర అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా RComm యూజర్ రూ.149 పెట్టి రీఛార్జ్ చేయించుకున్నట్లయితే నెలరోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 300 ఎంబి మొబైల్ డేటాను కూడా ఉచితంగా పొందవచ్చు.

 

డిసెంబర్ 31, 2016కు జియో వెల్‌‌కమ్ ఆఫర్

తన 4జీ వోల్ట్ నెట్‌వర్క్‌తో మార్కెట్‌ను ఒకస్కారిగా తన వైపుకు తిప్పుకున్న రిలయన్స్ జియో, సెప్టంబర్ 5న లాంచ్ చేసిన వెల్‌‌కమ్ ఆఫర్ భాగంగా డిసెంబర్ 31, 2016కు అన్నిరకాల జియో సేవలను తమ యూజర్లకు అందుబాటులో ఉంచిన తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio vs Airtel vs RComm vs Vodafone vs BSNL: Here are the Best Unlimited Call Plans. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot