Reliance Jio vs Airtel vs Vi: Postpaid Plans ప్రయోజనాలలో ఎయిర్‌టెల్,Viలను వెనక్కి నెట్టిన జియో

|

ఇండియాలో టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సంస్థ ప్రవేశంతో మార్కెట్‌లో ముఖ్యంగా ప్రీపెయిడ్ విభాగంలో తుఫానును తీసుకువచ్చింది. రిలయన్స్ జియో సంస్థ ఎట్టకేలకు ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ మార్కెట్‌పై కూడా దృష్టి పెట్టింది. జియో సంస్థ ఇటీవల పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఎప్పటిలాగే మిగిలిన వాటితో పోలిస్తే రిలయన్స్ జియో పరిశ్రమలో ఉత్తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది.

 

Jio vs Airtel vs Vi: పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలు

Jio vs Airtel vs Vi: పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలు

జియో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లను ప్రవేశపెట్టడానికి ముందు కేవలం రూ.199 ధర వద్ద కేవలం ఒకే ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందించేది. కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రూ.399 నుండి ప్రారంభమై రూ.1,499 వరకు లభిస్తాయి. రూ.399 జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఎయిర్‌టెల్ మరియు VI కూడా తమ ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో కొన్ని మార్పులను తీసుకువచ్చింది. కొత్త కస్టమర్ల కోసం ఎంపిక చేసిన సర్కిల్‌లలో 299 రూపాయల ధర నుండి పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ప్రస్తుత వినియోగదారుల కోసం టెల్కోలు 399 రూపాయల నుండి పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఎయిర్‌టెల్‌తో పోలిస్తే 399 రూపాయల జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Redmi Note 9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 750G చిప్‌సెట్ ఫీచర్స్!!Also Read: Redmi Note 9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 750G చిప్‌సెట్ ఫీచర్స్!!

రిలయన్స్ జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ ప్రయోజనాలు
 

రిలయన్స్ జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ ప్రయోజనాలు

రిలయన్స్ జియో యొక్క రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ నెలకు 75GB డేటా బెనిఫిట్‌తో పాటు 200GB డేటా రోల్‌ఓవర్ సౌకర్యంను కూడా అందిస్తుంది. అలాగే ఎటువంటి FUP పరిమితి లేకుండా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.రూ.399 రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ను ఎంచుకోవడంలో ఉత్తమ భాగం ఉచిత OTT సబ్స్క్రిప్షన్. రూ.199 నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్, రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ చందా మరియు రూ.399 విలువైన డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ వంటి OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

భారతి ఎయిర్‌టెల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

భారతి ఎయిర్‌టెల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

భారతి ఎయిర్‌టెల్ సంస్థ రూ.399 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 40GB డేటా బెనిఫిట్ తో పాటుగా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ల ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో యూజర్లు 200GB వరకు డేటాను పొందే అవకాశం కూడా ఉంది. అలాగే వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ కు ఉచిత యాక్సిస్ లభిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ ఇది కాకుండా అదనపు OTT ప్లాట్‌ఫాం చందాలను అందించడం లేదు. OTT సబ్స్క్రిప్షన్ లను ఎయిర్‌టెల్ యొక్క రూ.499 మరియు అంతకంటే ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అందిస్తున్నాయి.

Vi రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

Vi రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థ రూ.399 ధర వద్ద అందించే ఎంట్రీ-లెవెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 40GB డేటా బెనిఫిట్ మరియు 200GB డేటా రోల్‌ఓవర్ సౌకర్యంతో పాటుగా నెలకు 100SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ మాదిరిగానే Vi కూడా కేవలం Vi మూవీస్ & టీవీ సేవలకు మాత్రమే ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది.

జియో vs ఎయిర్‌టెల్ vs Vi పోస్ట్‌పెయిడ్ బేస్ ప్లాన్‌ల OTT సబ్స్క్రిప్షన్స్

జియో vs ఎయిర్‌టెల్ vs Vi పోస్ట్‌పెయిడ్ బేస్ ప్లాన్‌ల OTT సబ్స్క్రిప్షన్స్

జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌తో రూ.399 క్లియరీతో లభించే OTT చందాలు ఇక్కడ తేడాను కలిగిస్తాయి. జియో తన బేస్ ప్లాన్‌తో కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ వంటి OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. JioTV మరియు JioCinema వంటి Jio యొక్క మొబైల్ యాప్ లు కూడా ఎయిర్‌టెల్ మరియు Vi కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను మరియు VOD కంటెంట్‌ను అందిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Reliance Jio vs Airtel vs Vi: Entry Level Postpaid Plans Comparison

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X