మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ 4జీ డేటా ఆఫర్లు..

Written By:

జియో రాకతో ఇప్పుడు డేటా చాలా ఛీప్ అయిపోయింది. రేట్లు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. జియో నుంచి భారీ ఆఫర్లు దూసుకురాగా ఆ ఆఫర్లకు కౌంటర్ గా ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ లాంటి టెల్కో దిగ్గజాలు తమ ఆఫర్లను వదిలాయి. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ఆఫర్ల వివరాలేంటో చూద్దాం.

వివో నుంచి వీ7 ప్లస్ ఎనర్జిటిక్ బ్లూ స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ప్లాన్

రూ. 399 ప్లాన్
70 రోజుల పాటు రోజుకు 1జిబి డేటా అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, ఎసెమ్మెస్ లు లభిస్తాయి. రోజుకు 1జిబి కన్నా తక్కువగా ఉపయోగించే జియో యూజర్లకు ఇదే బెస్ట్ ప్లాన్. దీంతో పాటు ఇంకొంచెం ఎక్కువ రోజులు కావాలనుకునే వారికి రూ. 459 ప్లాన్ అందుబాటులో ఉంది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జిబి డేటా చొప్పున అన్‌లిమిటెడ్ కాల్స్ తో ఈ ప్లాన్ లభిస్తోంది.

ఎయిర్టెల్ ప్లాన్

రూ.399 ప్లాన్ కింద ప్ర‌తి రోజూ 1జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తున్న‌ది. ఈ ప్లాన్ కింద అప‌రిమితి ఉచిత కాలింగ్ , ఎస్ఎంఎస్ స‌దుపాయాలు అద‌నంగా ఉంటాయి.

వోడాఫోన్

రూ.257 ప్లాన్ ద్వారా 28 రోజుల అప‌రిమితి ఉచిత లోక‌ల్,ఎస్టీడీ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు. వాలిడిటీ 28 రోజులు
వోడాఫోన్లో మిగ‌తా నెట్‌వ‌ర్క్‌ల‌కు కాస్త దీటైన‌ది అంటే రూ.348 ప్యాక్. ఇది 28 రోజుల వాలిడిటీతో ప్ర‌తి రోజూ 1జీబీ డేటా ప్లాన్.
రూ.397 ప్లాన్ 4జీ/ 3జీ యూజ‌ర్ల కోసం ప్ర‌తి రోజూ 1జీబీ కాకుండా మొత్తం 6జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది.

ఐడియా డేటా ప్లాన్లు

ఐడియా రూ. 399 ప్లాన్ ప్ర‌కారం ప్ర‌తి రోజూ 1జీబీ డేటాను అందిస్తోంది. ఇది ఒక బిల్ సైకిల్ పీరియ‌డ్‌లో వ‌ర్తించేలా. ఇందులో 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ లోక‌ల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా ల‌భిస్తాయి. 28 రోజుల వ్యాలిడిటీ.

బిఎస్ఎన్ఎల్

రూ. 395 ప్లాన్ ప్రకారం ఫ్రీ డేటా కాలింగ్ డేటా బెనిఫిట్స్ ఉంటాయి. 71 రోజులు పాటు దీని కాలవ్యవధి ఉంటుంది. రోజుకు 2జిబి డేటాను వాడుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ టూ బిఎస్ఎన్ఎల్ 3 వేల కాలింగ్ నిమిషాలు వేరే నెట్ వర్క్ లకు 1800 నిమిషాల కాలింగ్ అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio vs Airtel vs Vodafone vs Idea: Top 4G prepaid plans compared Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot