Jio Vs Airtel: 365రోజుల వాలిడిటీతో రోజుకు 2GB డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

|

ఇండియాలోని టెలికామ్ రంగంలో గల ఆపరేటర్లు రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ రెండు కూడా తమ వినియోగదారులకు అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తూ అత్యంత విశ్వసనీయ మరియు చౌకైన ఆపరేటర్లుగా అవతరించాయి. ఈ ఇరువురు ఆపరేటర్లు తమ చందాదారుల యొక్క అన్ని రకాల అవసరాలను తీర్చడానికి ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క విస్తృతమైన పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసాయి.

ప్రీపెయిడ్ ప్లాన్

ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులు 2GB రోజువారీ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎక్కువగా ఇష్టపడతారు. ఏదేమైనా రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ రెండూ కూడా తమ చందాదారులలో అధికంగా వినోద ప్రయోజనాలను కోరుకునే వారి కోసం రోజువారి 3GB డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నాయి. రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ 2GB రోజువారీ డేటా ప్రయోజనాలను లాంగ్ టర్మ్ అంటే 365 రోజుల చెల్లుబాటుతో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో చందాదారులు సాధారణంగా 28 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ కోసం చూస్తున్న వారి దృష్టిని ఆకర్షించిన మొదటి ప్లాన్ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్. అయితే చందాదారులు 365 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా కోసం ఎదురుచూస్తున్న వారికి రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్ ఉత్తమమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే చందాదారులు 365 రోజుల చెల్లుబాటు కాలంలో 2GB రోజువారీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ కాలంలో మొత్తంగా 730GB డేటా ప్రయోజనాన్ని సమకూరుస్తుంది. అలాగే రిలయన్స్ జియో కాకుండా ఇతర ఆపరేటర్లకు కాల్ చేయడానికి 12,000 నిమిషాల  FUP మరియు జియో-టు-జియో అపరిమిత కాల్స్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే రోజుకు 100SMS ల ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

రిలయన్స్ జియో రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు

రిలయన్స్ జియో రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు

రిలయన్స్ జియో యొక్క రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తు సంవత్సరం మొత్తానికి 730GB డేటాను అందిస్తుంది. అయితే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే రిలయన్స్ జియో ఈ ప్లాన్‌లో అదనంగా 10GB డేటాను కూడా అందిస్తుంది. మొత్తం  డేటా ప్రయోజనాల విషయానికి వస్తే మొత్తం చెల్లుబాటు కాలంలో 740GB డేటాను సమకూరుస్తుంది. ఇది కాకుండా చందాదారులకు అదనపు ఖర్చు లేకుండా రూ.399 విలువైన డిస్నీ + హాట్‌స్టార్ యొక్క ఒక సంవత్సరం చందాను ఉచితంగా అందిస్తుంది. అలాగే జియో యొక్క అన్ని రకాల యాప్ ల యొక్క కాంప్లిమెంటరీ చందాను కూడా ఉచితంగా అందిస్తుంది.

భారతి ఎయిర్‌టెల్ రూ .2498 ప్రీపెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ రూ .2498 ప్రీపెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ యొక్క ఈ లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో చెప్పుకోదగ్గ మంచి విషయం ఏమిటంటే అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాల్‌లను అందించడం. రిలయన్స్ జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ యొక్క రూ.2498 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటు వాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా చందాదారులు 2GB రోజువారీ డేటాను పొందుతారు. ఇది కాకుండా వారు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు మరియు రోజుకు 100 SMS ల ప్రయోజనాలను పొందుతారు.

భారతి ఎయిర్‌టెల్ రూ .2498 ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క అదనపు ప్రయోజనాలు

భారతి ఎయిర్‌టెల్ రూ .2498 ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క అదనపు ప్రయోజనాలు

రిలయన్స్ జియో మాదిరిగా కాకుండా భారతి ఎయిర్‌టెల్ చందాదారులకు రూ.2498 ప్రీపెయిడ్ ప్లాన్‌తో మరిన్ని అదనపు డేటా ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్రయోజనాలలో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మరియు వింక్ మ్యూజిక్ యొక్క ఉచిత సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఎయిర్టెల్ ఫాస్ట్ ట్యాగ్ లో రూ .150 క్యాష్ బ్యాక్ మరియు ఉచిత హలో ట్యూన్స్ ప్రయోజనాలు  కూడా లభిస్తాయి. చివరగా చందాదారులకు ఈ ప్లాన్ తో షా అకాడమీ ద్వారా 1 సంవత్సరం ఉచిత కోర్సులు కూడా లభిస్తాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Vs Bharti Airtel: 2GB Daily Data LongTerm Prepaid Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X