Home
News

రూ.300 లోపు బడ్జెట్లో 1జిబి కన్నా ఎక్కువ డేటా అందించే బెస్ట్ నెట్‌వర్క్ ఏది ?

టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశీయ టెలికాం రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశీయ టెలికాం రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జియో నుంచి అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లు రావడం కూడా వినియోగదారులకు పండగ వాతావరణాన్ని కల్పించింది. ఇప్పుడు దేశంలో మూడు ప్రధాన టెలికాం దిగ్గజాలు Airtel, Reliance Jio and Vodafoneలు టారిఫ్ ప్లాన్లలో పోటీలు మీద పోటీలు పడి యూజర్లను చేజారిపోనీకుండా కాపాడుకుంటున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రూ. 300 ధరలో 1జిబి డేటాను అందించే బెస్ట్ నెట్ వర్క్ ని అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో రూ.299 ప్లాన్

జియో రూ.299 ప్లాన్

రిలయన్స్ జియో తన కస్టమర్లకు రూ.299 ప్లాన్‌లో అందిస్తున్న డేటా లిమిట్‌ను పెంచింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభ్యం కాగా ప్రస్తుతం దీన్ని 1జీబీ పెంచారు. దీంతో ఇప్పుడీ ప్లాన్‌లో రోజుకు 3జీబీ మొబైల్ డేటాను యూజర్లు పొందవచ్చు. ఇక ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, కాంప్లిమెంటరీ జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ యథావిధిగా లభిస్తున్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉండడంతో మొత్తం అన్ని రోజులకు కలిపి జియో కస్టమర్లకు 84 జీబీ డేటా లభిస్తుంది.

వొడాఫోన్ రూ.255 ప్లాన్

వొడాఫోన్ రూ.255 ప్లాన్

రూ.255తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు రోజుకు 2 జీబీ చొప్పున నెలరోజులపాటు ఉచిత డేటా పొందుతారు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 మెసేజ్‌లు పంపుకోవచ్చు. గరిష్ఠంగా రోజుకు 250 నిమిషాలు లేదా వారానికి 1000 నిమిషాలు వాయిస్ కాల్స్‌ను ఈ ఆఫర్ ద్వారా పొందవచ్చు. 28 రోజుల కాలపరిమితితో ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. ఇంతే కాలపరిమితితో జియో రూ.299కు రోజుకు 3 జీబీ డేటాను, ఎయిర్‌టెల్ రూ.249కు 2జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వొడాఫోన్ తన రూ.348 ప్లాన్‌ను అప్‌‌డేట్ చేసింది. ఇక నుంచి ఈ ఆఫర్ కింద రోజుకు రూ.1.5 జీబీ డేటాను అందించనుంది. వీటితోపాటు 70 రోజుల కాలపరిమితితో రూ.458 ప్లాన్‌ను, 84 రోజుల కాలపరిమితితో రూ.509 ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందించనుంది.

ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్

రూ.249రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.దీంతోపాటు రూ.349 ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్‌ పునరుద్ధరించింది. ఇప్పటి వరకూ అందిస్తున్న 2.5జీబీ డేటా స్థానంలో తాజాగా 28రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను అందించనుంది. కాగా రూ.499 రీఛార్జ్‌తో నిన్న (మంగళవారం) కొత్త ప్రీపెయిడ్‌ను ప్రకటించింది. ఇందులో ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు, రోజుకు 2జీబీ డేటాను 82 రోజుల పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio vs Vodafone vs Airtel prepaid plans under Rs 300 with more than 1GB data More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X