రూ.50లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!

ఒకానొక సమయం లో డేటా వాడుకోవాలన్న కాల్స్ చేయాలన్న చాలా పొదుపుగా వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్ని మారిపోయాయి.

By Anil
|

ఒకానొక సమయం లో డేటా వాడుకోవాలన్న కాల్స్ చేయాలన్న చాలా పొదుపుగా వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్ని మారిపోయాయి. జియో తన ఉచిత ప్లాన్ తో మార్కెట్‌ను ముంచెత్తటంతో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు కూడా ఉచిత ప్లాన్లను మార్కెట్ లో ప్రవేశబెట్టాయి. మొదట ఉచిత డేటా తో మొదలైన వార్ అన్ లిమిటెడ్ కాల్స్,ఫ్రీ SMS ,ఫ్రీ రోమింగ్ కాల్స్ వరకు వెళ్లాయి.అయితే ఇప్పుడు లేటెస్ట్ గా రూ.50 ప్లాన్లను టెలికాం దిగ్గజాలు మార్కెట్ లోకి విడుదల చేశాయి .ఈ శీర్షిక లో భాగంగా రూ.50 బడ్జెట్‌లో మార్కెట్లో సిద్థంగా ఉన్న బెస్ట్ ప్లాన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము.

రిలయన్స్ జియో రూ.49 ప్లాన్....

రిలయన్స్ జియో రూ.49 ప్లాన్....

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్లాన్‌లో భాగంగా రోజుకు 1 జీబి డేటా చొప్పున వాడుకోవల్సి ఉంటుంది అలాగే అపరిమిత కాల్స్, 50 SMS, మరియు జియో యాప్ సూట్‌ను కూడా ఉచితంగా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.. అయితే ఈ ప్లాన్ రిలయన్స్ జీయోఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితం చేయబడింది.

వోడాఫోన్  రూ.47 ప్లాన్...

వోడాఫోన్ రూ.47 ప్లాన్...

ఐడియా సెల్యులర్ మరియు వొడాఫోన్ విలీనం DoT ఆమోదం పొందింది మరియు విలీనానికి ముందు, వోడాఫోన్ దాని ప్రణాళికలతో పూర్తి దూకుడుగా ఉంది.అయితే ఈ టెల్కో ఇటీవలే రూ.47 ప్లాన్ ను విడుదల చేసింది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్లాన్‌లో భాగంగా రోజుకు 500 MB డేటా చొప్పున వాడుకోవల్సి ఉంటుంది అలాగే రోజుకి 50 SMS పొందవచ్చు. ఈ ప్లాన్ లో 125 నిముషాలు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు . ఇది అన్ని రోమింగ్ STD మరియు లోకల్ కాల్స్ కు వర్తిస్తాయి.

భారతీ ఎయిర్‌టెల్ రూ.47 ప్లాన్....

భారతీ ఎయిర్‌టెల్ రూ.47 ప్లాన్....

భారతీ ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న అత్యుత్తమ ప్లాన్‌లలో రూ.47 డేటా ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజుల పాటు రోజుకు 500 MB డేటా చొప్పున వాడుకోవల్సి ఉంటుంది. అలాగే రోజుకి 50 SMS పొందవచ్చు. ఈ ప్లాన్ లో 125 నిముషాలు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు ఇది అన్ని రోమింగ్ STD మరియు లోకల్ కాల్స్ కు వర్తిస్తాయి.

బీఎస్ఎన్ఎల్ రూ.19 ప్లాన్....

బీఎస్ఎన్ఎల్ రూ.19 ప్లాన్....

బీఎస్ఎన్ఎల్ అతి తక్కువ రూ .19 ప్లాన్ ను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది .ఇది చెన్నై, తమిళనాడు సర్కిల్స్ లభించే ఎస్.టి.వి. మాత్రమే. అక్టోబర్ 11 ఈ ప్లాన్ గడువు , ఈ ప్లాన్ 54 రోజులు వరకు చెల్లుతుంది. అయితే, ఉచిత డేటా, ఎస్ఎంఎస్, కాలింగ్ అందిస్తున్న పోటీదారులతో పోలిస్తే, BSNL యొక్క ప్రణాళిక ప్రాథమికంగా ఒక రేటు కట్టర్, ఇక్కడ BSNL నంబర్లకు అవుట్-నెట్ కాల్స్ కు నిమిషానికి 15 పైసలు మాత్రమే , ఇతర నెట్ వర్కులకు ఆఫ్-నెట్ కాల్స్ ధరకే ఉంటుంది అంటే నిమిషానికి 35 పైసలు.

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio vs Vodafone vs BSNL vsBSNL: Best prepaid recharge plans under Rs 50.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X