జియో కొత్త ఫీచర్ : కస్టమర్ కేర్‌తో వీడియోకాల్‌లో మాట్లాడండి

By Gizbot Bureau
|

రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 2017వ సంవత్సరం రిలయన్స్ చీఫ్ ముకేష్ అంబానీ ఉచిత డేటాను అందించిన సంగతి తెలిసిందే. ఈ డేటా కోసం వొడాఫోన్, ఎయిర్‌టెల్ కస్టమర్లు కూడా జియోకు మారిపోయారు. దీంతో జియోకు పోటీగా ఇతర టెలికాం సంస్థలన్నీ డేటాతో ధరను తగ్గించాయి. ఇదిలా ఉంటే జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లో కూడా సంచలనాలు నమోదు చేస్తోంది. దీంతో రిలయన్స్ ఫోన్లకు క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ ఫోన్లలో రిలయన్స్ జియో వీడియో కాల్ అసిస్టెంట్‌ అనే సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో Artficial Intelligence ద్వారా 4జీతో కస్టమర్ కేర్ అధికారులను సంప్రదించడం సులభమవుతుంది.

AI వీడియో కాల్ అసిస్టెంట్
 

AI వీడియో కాల్ అసిస్టెంట్

రిలయన్స్ జియో AI వీడియో కాల్ అసిస్టెంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్ సర్వీసు ద్వారా ఇకపై కస్టమర్లు కస్టమర్ కేర్ అధికారులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడవచ్చు. ఈ సర్వీసును 4G ఫోన్ కాల్ ద్వారా యాక్సస్ చేసుకోవాలంటే ఎలాంటి అప్లికేషన్ ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేదు.

కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు

కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు

కస్టమర్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు వీలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడరీ, యూఎస్ ఆధారిత రాడీసిస్ రిలయన్స్ జియో సంయుక్తంగా ఈ వీడియో అసిస్టెంట్ సర్వీసును రూపొందించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. దీన్ని వివిధ కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు వీలుగా మార్పులు చేసుకోవచ్చు. ఈ ప్లాట్ ఫాంపై అదనంగా ఆటో లెర్నింగ్ ఫీచర్ ద్వారా కస్టమర్లకు కచ్చితమైన సమాధానాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది.

జియో బాట్ ప్లాట్ ఫాం

జియో బాట్ ప్లాట్ ఫాం

జియో బాట్ ప్లాట్ ఫాంతో పనిచేసే జియో బాట్ మేకర్ టూల్ సాయంతో చిన్న వ్యాపారాల్లో కూడా ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండానే సొంతంగా AI ఆధారిత బాట్ క్రియేట్ చేసుకునేలా చేయడమే కంపెనీ లక్ష్యమని పేర్కొంది. కస్టమర్లు ఎంపిక చేసుకున్న భాష ఆధారంగా సపోర్ట్ అందించేలా ఏఐ వీడియో బాట్ రాబోతోందని ప్రకటన తెలిపింది.

30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్
 

30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్

ఇదిలా ఉంటే.. వినియోగదారులకు జియో మరో ఫ్రీ ఆఫర్ తెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని చెప్పిన రెండ్రోజుల్లోనే.. జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ ఇవ్వనున్నట్లు జియో సంస్థ ప్రకటించింది. కొత్త రీచార్జ్‌తో వడ్డింపు స్టార్ట్ అవుతుందని భావించిన వినియోగదారులు.. అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో.. తన ఖాతాదారులను కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ప్రకటించింది జియో. తాజా ప్రకటన ద్వారా.. తొలిసారి రీచార్జ్ చేయించుకునన్న ఖాతాదారులకు 30 నిమిషాల పాటు ఉచిత టాక్‌టైం ఇవ్వనున్నట్టు పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio wants to change the way you talk to customer care with new Video Call Assistant bot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X