జియో ‘Welcome Offer’ వచ్చేసింది, పొందాలంటే ఇలా చేయండి

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న రిలయన్స్ జియో Welcome Offer సేవలు నేటి నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అతి తక్కువ ధరకే డేటా ఆఫర్స్‌ను ప్రకటించడం ద్వారా టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

జియో ‘Welcome Offer’ వచ్చేసింది, పొందాలంటే ఇలా చేయండి

Read More : పండుగ స్పెషల్ : ఆఫర్లతో ఊరిస్తోన్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఇటీవలి దాకా కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే అందుబాటులోని ఉన్న జియో సేవలు నుంచి నుంచి అందరికీ అందుబాటులోకి వస్తాయి. 4జీ VoLTE సపోర్ట్ చేసే ఫోన్ ఉంటే చాలు ఆ సౌకర్యాన్ని పొందవచ్చు. సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కెళ్లి సంప్రదించినా వివరాలు చెబుతారు.

Read More : రూపాయికే 1జీబి ఇంటర్నెట్, BSNL సంచలన నిర్ణయం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెల్‌కమ్ ఆఫర్ వ్యాలిడిటీ ఎంత కాలం ఉంటుంది..?

సెప్టంబర్ 5 నుంచి అందుబాటులోకి వచ్చే రిలయన్స్ జియో Welcome Offer 2016, డిసెంబర్ 31తో ముగుస్తుంది.

వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు వర్తించేవేంటి..?

జియో అందించే అన్నీ సర్వీసులను డిసెంబర్ 31 వరకు పూర్తిస్థాయిలో ఉచితంగా పొందవచ్చు.

మీరు జియో ప్రివ్యూ ఆఫర్‌లో ఉన్నట్లయితే Welcome Offer వర్తించే అవకాశం ఉందా..?

మీరు ఇప్పటికే జియో ప్రివ్యూ ఆఫర్‌‌ను వినియోగించుకుంటున్నట్లయితే ఆటోమెటిక్‌గా సెప్టంబర్ 5 తరువాత వెల్‌కమ్ ఆఫర్‌లోకి మైగ్రేట్ అయిపోతారు. అంటే మీరు డిసెంబర్ 31, 2016 వరకు అన్ని రకాల జియో సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చన్నమాట.

 

వెల్‌కమ్ ఆఫర్‌ పూర్తి అయిన తరువాత ఛార్జీలు ఎలా ఉంటాయ్..?

వెల్‌కమ్ ఆఫర్‌ పూర్తి అయిన తరువాత యూజర్లు తాము ఎంపిక చేసుకునే టారిఫ్ ప్లాన్‌ను బట్టి డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో తన టారిఫ్ ప్లాన్‌లను రూ.19 నుంచి రూ.4,999 రేంజ్ వరకు అందుబాటులో ఉంచింది.

రిలయన్స్ జియో 4జీ సర్వీసులు అన్ని రకాల ఫోన్‌లను సపోర్ట్ చేస్తాయా..?

రిలయన్స్ జియో 4జీ సర్వీసులు VoLTE సపోర్ట్‌తో వచ్చే ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఫీచర్ ఫోన్‌లను జియో సేవలు సపోర్ట్ చేయవు.

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ సర్వీస్ నుంచి పోస్ట్ పెయిడ్ సర్వీసులోకి మారాలంటే..?

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ సర్వీసులోకి మారాలంటే కస్టమర్ అప్లికేషన్ ఫారమ్‌తో పాటు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీతో సంబంధిత రిలయన్స్ స్టోర్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సదుపాయం అందుబాటులో లేదు. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

రిలయన్స్ జియో సిమ్ పొందటం ఎలా..?

మీ దగ్గరలోని రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌కు వెళ్లి ఫోటో ఐడెంటిటీతో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను సబ్మిట్ చేసినట్లయితే సిమ్ జారీ చేయబడుతుంది.

e-KYC activation

ఇ-కేవైసీ పేరుతో సరికొత్త యాక్టివేషన్ ప్రక్రియను రిలయన్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ కొత్త పద్ధతిలో యూజర్ తన ఆధార్ కార్డ్ ద్వారా జియో సిమ్‌ను పొందిన 15 నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి అవుతుంది. ప్రస్తుతానికి రిలయన్స్ e-KYC activation సర్వీసు ముంబై, ఢిల్లీ నగరాల్లోచి అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సర్వీస్ అన్ని నగరాల్లో అందుబాటులోకి రాబోతంది.

 

విద్యార్థులకు స్పెషల్ డిస్కౌంట్స్

రిలయన్స్ జియో విద్యార్థులకు ప్రత్యేకమైన రాయితీలను అందిస్తోంది. విద్యార్థులు తమ గుర్తింపు కార్డును చూపించటం ద్వారా 25 రాయితీని పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Welcome Offer goes live: All you need to know Telugu. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot