మార్చి 2017 వరకు Jio ఉచితం..?

తన ఉచిత ఆఫర్లతో ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లకు దడ పుట్టిస్తోన్న జియో‌ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోందా..?

|

డిసెంబర్ 31, 2016తో ముగియనున్న జియో ఉచిత 4జీ ఆఫర్‌లను మార్చి 2017 వరకు పొడిగించనున్నట్లు వార్తలు వుస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజానిజాలు వెల్లడికావల్సి ఉంది.

మార్చి 2017 వరకు Jio ఉచితం..?

Read More : ఈ ఫోన్‌లు కొంటే రిలయన్స్ జియో ఏడాది ఉచితం..?

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే రిలయన్స్ ఆఫర్ చేస్తున్న జియోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ నెట్‌వర్క్ ఆఫర్ చేస్తున్న వెల్‌కమ్ ఆఫర్‌కు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. తన ఉచిత ఆఫర్లతో ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లకు దడ పుట్టిస్తోన్న జియో‌కు ఇంటర్ కనెక్టింగ్ సమస్యలు పెద్ద తొలనొప్పిగా మారాయి.

రూ.3,050 కోట్ల జరిమానా

రూ.3,050 కోట్ల జరిమానా

రిలయన్స్ జియోకు ఇంటర్‌కనెక్టింగ్ పాయింట్‌లను జారీ చేయకపోవటంతో ఎయిర్‌టెల్, వొడా‌ఫోన్‌లకు రూ.3,050 కోట్ల జరిమానాను ట్రాయ్ (TRAI) విధించిన విషయం తెలిసిందే. మార్కెట్లో రిలయన్స్ జియో ఎదుర్కొంటోన్న పలు సవాళ్లను ఇప్పుడు తెలుసుకుందాం...

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోజుకు 10 కోట్ల కాల్ డ్రాప్స్

రోజుకు 10 కోట్ల కాల్ డ్రాప్స్

ఇతర టెలికాం ఆపరేటర్ల నుంచి రిలయన్స్ జియోకు సరైన సపోర్ట్ లభించకపోవటంతో రోజుకు దాదాపు 10 కోట్ల కాల్ డ్రాప్స్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

 కస్టమర్ సపోర్ట్‌ను..
 

కస్టమర్ సపోర్ట్‌ను..

ఇతర టెలికం ఆపరేటర్లతో పోటీ పడాలంటే రిలయన్స్ జియో తన కస్టమర్ సపోర్ట్‌ను మరింతగా బలపర్చుకోవల్సి ఉంది. ప్రస్తుతం జియో కస్టమర్ సపోర్ట్ చాలా వీక్‌గా ఉందని పలువురు యూజర్లు అంటున్నారు.

ఇంటర్‌కనెక్టింగ్, నెమ్మదైన ఇంటర్నెట్

ఇంటర్‌కనెక్టింగ్, నెమ్మదైన ఇంటర్నెట్

ఇంటర్‌కనెక్టింగ్ పాయింట్స్, నెమ్మదైన ఇంటర్నెట్ వంటి సమస్యలు జియోను వేధిస్తున్నాయి. ఈ సమస్యలను పూర్తిస్థాయిలో అధిగమించినట్లయితే జియోకు మరింత ఆదరణ పెరిగే అవకాశముంటుంది.

ప్రస్తుతం 16 మిలియన్ యూజర్లు..

ప్రస్తుతం 16 మిలియన్ యూజర్లు..

ఈ ఏడాది చివరి నాటికి తమ కస్ట్‌మర్ బేస్ 100 మిలియన్ యూజర్లకు రీచ్ అవ్వాలని జియో లాంచ్ సయమంలో ముఖేష్ అంబానీ ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా జియోను ఉపయోగించుకునే వారి సంఖ్య ఇప్పటి వరకు 16 మిలియన్లు దాటినట్లు సమాచారం. ఒకవేళ అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోయినట్లయితే జియో తన వెల్‌కమ్ ఆఫర్‌ను
మరికొంత కాలం పొడిగించే అవకాశాలు కూడా లేకపోలేదు.

 4జీ సర్వీస్ బాగున్నప్పటికి..?

4జీ సర్వీస్ బాగున్నప్పటికి..?

మొత్తంమీద చూసుకుంటే జియో ఆఫర్ చేస్తున్న 4జీ సర్వీస్ బాగున్నప్పటికి సర్వీసెస్ మాత్రం అంతలా ఆకట్టుకునేలా లేవు. కొన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ వద్ద జియో సిమ్ కార్డ్స్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో కస్టమర్లు జియో సిమ్‌ను పొందేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio Welcome Offer Might be Extended Until March 2017 According to a New Rumor. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X