700 MHz ఎయిర్‌వేవ్‌లు జియో 5Gకి ఎలా సహాయపడుతుంది?

|

భారతదేశంలో మొదటిసారి నిర్వహించిన 5G స్పెక్ట్రమ్ వేలం పూర్తయింది. ఈ 5G స్పెక్ట్రమ్ వేలంలో 700 MHz ఎయిర్‌వేవ్‌లను కలిగి ఉన్న ఏకైక టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కావడం విశేషం. ఈ స్పెక్ట్రమ్ వేలం 5G ఎయిర్‌వేవ్‌లపై అధికంగా దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు టెలికాం ఆపరేటర్లు 700 MHz ఎయిర్‌వేవ్‌లను స్పెక్ట్రమ్ యొక్క రిజర్వ్ ధర కారణంగా కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపలేదు. కానీ ఈసారి రిలయన్స్ జియో టెలికాం సంస్థ దూకుడుగా ముందుకు వచ్చి 700 MHz బ్యాండ్‌లో PAN-ఇండియా 5G వినియోగం కోసం 10 MHz ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేసింది.

700 MHz స్పెక్ట్రమ్‌

ఈ కొనుగోలు కోసం జియో మొత్తంగా రూ.88,078 కోట్లను ఖర్చుచేసింది. 5G వేలం సమయంలో ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు చేసిన ఖర్చుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 700 MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి జియో సంస్థ ఇంత ఎక్కువ మొత్తాన్ని ఎందుకు ఖర్చు చేసిందో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

700 MHz స్పెక్ట్రమ్‌ కొనుగోలుతో జియో కస్టమర్‌లకు ఎలా ఉపయోగపడుతుంది?

700 MHz స్పెక్ట్రమ్‌ కొనుగోలుతో జియో కస్టమర్‌లకు ఎలా ఉపయోగపడుతుంది?

జియో 700 MHz స్పెక్ట్రమ్‌ను పొందడానికి జియో టెలికాం సంస్థ అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేసింది. దీనికి గల ముఖ్యమైన కారణం అధిక మంది కస్టమర్‌లను పొందడం మరియు వారికి అపారమైన ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొనిరావడం. ఇది తక్కువ-ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కాబట్టి మెరుగైన కవరేజీని అందించడానికి వీలుగా ఆప్టిమైజ్ చేయబడి ఉంటుంది. ఈ సబ్-GHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో జియో మెరుగైన ఇండోర్ మొబైల్ నెట్‌వర్క్ కవరేజీని అందించగలదు. ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 700 MHz బ్యాండ్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అతి తక్కువ ధర వద్దకే 5G సేవలను అందించగల ఏకైక టెల్కోగా జియో అవతరించనున్నది.

5G వేలం

5G వేలం సమయంలో 700 MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన ఏకైక టెల్కో రిలయన్స్ జియో మాత్రమే. ఇది సబ్-GHz బ్యాండ్‌ని ఉపయోగించి 5G సేవలను అందించడంలో కంపెనీని చాలా ప్రత్యేకమైన స్థితిలో ఉంచింది. 700 MHz బ్యాండ్‌తో 5G సేవలను జియో సంస్థ అందివ్వనున్నది. దీని కారణంగా జియోకు 4% నుండి 5% వరకు అధికంగా సబ్‌స్క్రైబర్ మార్కెట్ వాటాను పొందడంలో సహాయపడవచ్చు. ఇంకా జియో ఇతర టెల్కోల కంటే 50% తక్కువ ధరతో గ్రామీణ ప్రాంతాల్లో 5Gని డెలివరీ చేయగలదు. జియో యొక్క పోటీదారులు ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు సబ్-GHz ఎయిర్‌వేవ్‌లను లేకపోవడం అనేది జియోకు కలసివచ్చిన మరొక అదనపు ప్రయోజనం.

5G నెట్ వర్క్ కోసం టవర్లు

ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో 5G నెట్ వర్క్ కోసం టవర్లు మరియు చిన్న సెల్‌లను సెటప్ చేయడానికి అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే 700 MHz బ్యాండ్ టెల్కోకు అందించే అధిక కవరేజ్ ప్రయోజనం కారణంగా జియో చాలా తక్కువ ఖర్చుతో 5G ని అందుబాటులోకి తీసుకొనిరాగలదు. ఎయిర్‌టెల్ మరియు Vi రెండూ ఇప్పటికే 2G/4G కస్టమర్‌లకు సేవలను అందించడానికి సబ్-GHz స్పెక్ట్రమ్‌ని ఉపయోగిస్తున్నాయి. వారు ప్రస్తుతం 5G కోసం ఆ స్పెక్ట్రమ్‌ను రీఫార్మ్ చేయరు. అంటే భారతదేశం అంతటా 5Gని అందించడానికి సబ్-GHz స్పెక్ట్రమ్‌ను ఉపయోగించగల ఏకైక టెల్కో జియో మాత్రమే. జియో టెల్కో యొక్క పోర్ట్‌ఫోలియోలో 700 MHz బ్యాండ్ ఉన్నందున చెన్నై, బెంగళూరు, పూణే వంటి అధిక జనాభా ఉన్న నగరాలలో మెరుగైన ఇండోర్ కవరేజ్ సేవలను అందించగలుగుతుంది. ఇది చందాదారుల మార్కెట్ వాటాను పొందడంలో టెల్కోకు సహాయపడుతుంది.

700 MHz స్పెక్ట్రమ్ తో జియో మెరుగైన 5G సేవలు

700 MHz స్పెక్ట్రమ్ తో జియో మెరుగైన 5G సేవలు

5G SA (స్వతంత్ర) సేవలను అందించడానికి రెండు నుండి మూడు సంవత్సరాల వ్యవధిలో అంకితమైన 700 MHz స్పెక్ట్రమ్‌ను కూడా జియో సంస్థ ఉపయోగించుకోగలుగుతుంది. ఇది ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌లో టెల్కో బ్రాండ్‌ను పెంచుతుంది. ఇది 5G ఎంటర్‌ప్రైజ్ యూజ్ కేస్ మార్కెట్‌లో 5% వరకు మార్కెట్ వాటాను పొందేందుకు దోహదం చేస్తుంది.

5G లాంచ్ గురించి ఆసక్తి ప్రకటన చేసిన ఆకాష్ అంబానీ

5G లాంచ్ గురించి ఆసక్తి ప్రకటన చేసిన ఆకాష్ అంబానీ

ఆకాష్ అంబానీ 5G లాంచ్ కి సంబందించిన వివరాలు చాలా సూటిగా ఉన్నాయి. అయితే జియో దీన్ని ఎలా అమలు చేస్తుందో చూడటం ఇక్కడ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఒక్క 5G నెట్‌వర్క్ కూడా అందుబాటులో లేదు. ఇప్పటివరకు ఉన్న అన్ని 5G నెట్‌వర్క్‌లు ట్రయల్ ప్రయోజనాల కోసం స్పెక్ట్రమ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కేటాయించింది. రిలయన్స్ జియో టెలికాం సంస్థ తన 5G సేవల గురించి చాలా వివరాలను విడుదల చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా వినియోగదారులు ఖచ్చితంగా 5G SIMకి మారవలసి ఉంటుంది. దీన్ని త్వరగా అందుబాటులోకి వచ్చేలాగా చేయగలిగితే కనుక జియో దాని పోటీదారుల కంటే సూపర్ మాసివ్ ఫస్ట్ మూవర్ ప్రయోజనాన్ని పొందుతుంది. అయితే ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా సంస్థలు తమ యొక్క 5G సేవలను ఇండియాలో ఎప్పుడు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాయో వంటి వివరాలు ఖచ్చితంగా తెలియదు. ఇతర టెల్కోలు కూడా ఆగస్టు 15, 2022 నాటికి వాణిజ్య 5Gని ప్రారంభించేందుకు సిద్ధమై ఉండవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio Why Spent Much Money to Bring 700 MHz Spectrum! How it Help For Customers?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X