జియో వాయిస్ కాల్స్ కట్, షాక్ తినేది ఈ కస్టమర్లే !

Written By:

అందరూ ఊహించినట్లుగానే జియో వాయిస్ కాల్స్‌కి లిమిట్ పెట్టేసింది. ఇంతకు ముందు ఉన్న అన్‌లిమిటెడ్ కాల్స్‌కి కోత వినియోగదారులకు షాకిచ్చింది. అయితే ఈ విషయం అందరికీ వర్తించదని కొంతమంది యూజర్లకు మాత్రమేనని కంపెనీ చెబుతోంది. మరి ఆ కొంతమంది కష్టమర్లు ఎవరంటే...?

రిలయన్స్ భారీ డిస్కౌంట్లు: సగానికి పైగా తగ్గిన Lyf ఫోన్ల ధరలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిస్ యూజ్ చేసేవారి కాల్స్ కి

అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ మిస్ యూజ్ చేసేవారి కాల్స్ కి జియో కోత పెట్టనుంది. దీని ప్రకారం వారికి రోజుకు 300 నిమిషాల కంటే ఎక్కువ కాల్స్ అందవు. వారానికి 1200 నిమిషాలు లేదా 28 రోజులకు 3 వేల నిమిషాలు మాత్రమే వారు కాల్స్ ను ఎంజాయ్ చేయగలుగుతారు.

కంపల్సరీగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే

ఈ లిమిట్ దాటితే వారు కంపల్సరీగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే ఎంత రీఛార్జ్ చేసుకోవాలన్న విషయాన్ని జియో ఇంకా వెల్లడించలేదు. వారం రోజుల పిరియడ్ లో 100 యూనిక్ MSIDNSలకు కాల్ చేసినా లిమిట్ దాటినట్లేనని కంపెనీ చెబుతోంది.

4జీ డేటా వాడకం లాగానే..

4జీ డేటా వాడకం లాగానే వాయిస్‌ కాల్స్‌పైనా పరిమితి తేవాలని యోచిస్తున్నట్టు రిపోర్టు వెల్లడించింది. 2016 సెప్టెంబర్‌లో జియో సేవలు లాంచ్‌ అయినప్పుడు అపరిమిత 4జీ డేటాను ఆఫర్‌ చేసింది. అయితే డేటా వాడకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించిన జియో, తరువాత డేటా వాడకంపై పరిమితి పెట్టింది.

రోజుకు 1జీబీ డేటానే..

ప్రస్తుతం రోజుకు 1జీబీ డేటానే ఆఫర్‌ చేస్తోంది. అపరిమిత డేటా వాడకం ఉన్నప్పటికీ, 1జీబీ డేటా వాడకం అయిపోయిన తర్వాత డేటా స్పీడు 100 కేబీపీఎస్‌ కంటే తక్కువకే పడిపోయింది.

అధికారికంగా ప్రకటన చేయలేదు

అయితే కాల్స్‌పై గరిష్ట పరిమితి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రస్తుతానికి దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు జియో. త్వరలోనే విధివిధానాలు వెల్లడించే అవకాశాలు లేకపోలేదని సమాచారం.

4జీ అప్‌లోడ్ స్పీడ్‌లో..

ఇదిలా ఉంటే 4జీ అప్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా అగ్రస్థానంలో నిలిచింది. టెలికం నియంత్రణ సంస్థకు చెందిన మైస్పీడ్ యాప్ డేటా ప్రకారం సెప్టెంబరు నెలలో అప్‌లోడ్ వేగంలో ఐడియా అగ్రస్థానంలో నిలిచింది.

ఐడియా తర్వాతి స్థానంలో వొడాఫోన్, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్..

సెప్టెంబరు నెలలో సగటు 4జీ అప్‌లోడ్ వేగంలో ఐడియా సెల్యూలార్ 6.307 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది. సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 8.74 ఎంబీపీఎస్‌గా నమోదైంది. ఐడియా తర్వాతి స్థానంలో వొడాఫోన్, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ నిలిచాయి. 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో ఐడియా మూడో స్థానంలో నిలవగా జియో, వొడాఫోన్ ఒకటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio will 'discontinue' unlimited voice calling for these customers Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot