6G టెక్నాలజీ అభివృద్ధి పై పనిచేస్తున్న Jio ! లాంచ్ ఎప్పుడంటే? వివరాలు
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తన స్వంత 6G కోర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. జియో ఇప్పటికే తన 5G కోర్ టెక్నాలజీ ని ఇతర నెట్‌వర్క్ పరికరాలతో పాటు ఇతర టెల్కోలు కూడా 4G మరియు 5G కోసం అమలు చేయగలిగింది.
6G టెక్నాలజీ అభివృద్ధి: అయితే, ఇప్పుడు వైర్‌లెస్ కనెక్టివిటీ లో ప్రపంచంలో 6G టెక్నాలజీ ని అభివృద్ధి చేస్తోంది. మరియు Jio ఇప్పటికే ఆ పనిని ప్రారంభించింది. నివేదిక ప్రకారం, జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (SVP) ఆయుష్ భట్నాగర్ మాట్లాడుతూ, 6G కమ్యూనికేషన్‌ల కోసం కొన్ని కీలకమైన టెక్నాలజీ తో పాటుగా జియో తన స్వంత 6G కోర్‌ను రూపొందించడానికి ఇప్పటికే కృషి చేస్తోందని తెలిపారు.

భట్నాగర్ ఇచ్చిన ప్రకటనలలోని ముఖ్యాంశాల ను గమనిస్తే, వీటిలో ముఖ్యమైనది గా 6G టెక్నాలజీ ని భావించవచ్చు. ఈ 6G టెక్నాలజీ యొక్క ఉపయోగాలను చూస్తే, ఇవి అపరిమితంగా ఉంటాయి. ఇంకా ఈ నివేదిక ప్రకారం, 3GPP (3వ తరం భాగస్వామ్య ప్రాజెక్ట్) నుండి 17 వ విడుదల మరియు 18 వ విడుదల 5G అధునాతన మరియు 6G వాస్తవికతకు మార్గం సుగమం చేస్తుంది.
భట్నాగర్ తన ప్రకటన లో 5Gని విడుదల చేయడానికి జియో అమలుపరిచిన స్వదేశీ టెక్నాలజీ గురించి కూడా మాట్లాడారు. దేశీయ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా జియో సాధించిన స్థాయి వినియోగదారులకు సరైన నాణ్యమైన సేవలను అందించగలదనడానికి నిదర్శనమని ఆయన అన్నారు. దీని అర్థం ఇతర దేశాల టెల్కోలు మరియు ప్రభుత్వాలు కూడా 5G SA (స్వతంత్రంగా) విడుదల చేయడానికి Jio తో కలిసి పని చేయవచ్చు.
6G టెక్నాలజీ వాణిజ్య పరంగా 2029 లో లాంచ్ జరుగుతుందని భావిస్తున్నారు. 2029 రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అనేక ప్రభుత్వాలు, మరియు సంస్థలు ఈ టెక్నాలజీ అభివృద్ధిపై ఇప్పటికే పనిచేస్తున్నాయి. మరియు పరిశ్రమ సంస్థలు 6Gని వాస్తవంగా మార్చే దిశగా పని చేయడం ప్రారంభించాయి.
రిలయన్స్ జియో యొక్క 6G కోర్ కంపెనీ 5Gతో చేసిన సంచలనం సృష్టించగలదు. ఈ నెట్‌వర్క్ కోర్ టెక్నాలజీ విషయానికి వస్తే టెల్కో మరింత సొంతంగా మారుతుంది మరియు ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెల్కోలకు అందించడానికి 5G డొమైన్‌లో మరిన్ని అత్యుత్తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
ఇంకా, క్వాల్కమ్, రిలయన్స్ జియోతో కలిసి భారతీయ మార్కెట్ కోసం కొత్త 5G-స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి కృషి చేస్తున్నట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి. రిలయన్స్ జియో తన 5G విస్తరణతో చాలా దూకుడుగా ఉంది. దేశంలో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడాన్ని కంపెనీ దాదాపుగా పూర్తి చేసింది.
అయితే, 5G నెట్‌వర్క్‌కి మారాలని చూస్తున్న 2G వినియోగదారుల జనాభా దేశంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఇక్కడే క్వాల్కమ్, జియో తో కలిసి పనిచేయాలని యోచిస్తోంది. యుఎస్ ఆధారిత చిప్‌మేకర్ మన దేశంలో ఎంట్రీ-లెవల్ 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి కొత్త చిప్‌సెట్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications








