Home
News

Jio యూజ‌ర్ల‌కు భారీ ఆఫ‌ర్‌.. రూ.4,500 బెనిఫిట్స్ వారి సొంతం!

రిలయన్స్ Jio త‌మ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఆఫ‌ర్ల‌ను అందిస్తుంది. తాజాగా మ‌రోసారి త‌మ Jio ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్ల కోసం అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. పండుగ సీజన్‌లో భాగంగా ఈ లాభ‌దాయ‌క‌మైన ఆఫ‌ర్ల‌ను వినియోగ‌దారుల ముందుకు తెచ్చిన‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. తాజా ప్రకటన ప్రకారం, దేశంలోని JioFiber వినియోగదారులు వారి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా రూ.4,500 విలువైన ప్ర‌యోజ‌నాల‌ను పొందుతార‌ని హామీ ఇచ్చింది.

Jio

ఈ ఆఫర్ రెండు JioFiber రీఛార్జ్ ప్లాన్‌లపై మాత్రమే వర్తిస్తుందని కంపెనీ వెల్ల‌డించింది. అయితే, ఈ Reliance JioFiber ఫెస్టివల్ బొనాంజా పరిమిత కాల వ్యవధిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఇది అక్టోబర్ 9 వరకు ఉంటుంది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న పండుగ సీజన్ కారణంగా అక్టోబర్ 1 నుంచి లైవ్‌లోకి వ‌చ్చింది. ఇంకో విష‌యం ఏంటంటే.. ఈ ఆఫ‌ర్ బ్రాడ్‌బ్యాండ్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా ప్రకటించారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దాం.

రిలయన్స్ Jioఫైబర్ ఫెస్టివల్ బొనాంజా
రిలయన్స్ జియోఫైబర్ ఫెస్టివ‌ల్ బోనాంజా ఆఫర్ లో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ రీఛార్జ్‌పై కంపెనీ రూ.4,500 విలువైన ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ఆఫ‌ర్ కాల వ్య‌వ‌ధిలో రూ.599 లేదా రూ.899 ప్లాన్ల‌తో రీఛార్జ్ చేసుకునే బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఆఫ‌ర్ ప్ర‌యోజ‌నాల‌ను పొందుతారు. అజియో, మైంత్రా మరియు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో ఒక్కొక్క దాంట్లో రూ.1,000 చొప్పున ప్ర‌యోజ‌నాలు పొందుతారు. అంతేకాకుండా, ఇక్సిగోలో త‌ర‌పున రూ.1,500 తగ్గింపును కూడా పొందవచ్చు.

Jio

JioFiber రూ.599 రీఛార్జ్ ప్లాన్ ఆరు నెల‌ల పాటు 30Mbps వేగంతో నెలకు 3.3TB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు SonyLIV, Disney+ Hotstar, Voot Select మరియు ఇతర వాటితో సహా 14 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్, రూ.200 విలువైన 550కి పైగా ఆన్-డిమాండ్ టీవీ ఛానెల్‌లు మరియు ఉచిత Jio సెట్-టాప్ బాక్స్ వంటి ప్ర‌యోజ‌నాల‌ను పొందుతారు.

మరోవైపు, రూ.899 JioFiber రీఛార్జ్ ప్లాన్ ఎంపిక చేసుకునే చందాదారులకు కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. మైంత్రా మరియు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఒక్కొక్కటి రూ.500 చొప్పున ప్ర‌యోజ‌నాలు అందుతాయి. అంతేకాకుండా, Ajioలో ఉప‌యోగించ‌గ‌ల రూ.1,000 తక్షణ తగ్గింపు కూపన్ మరియు మరో ఇక్సిగోలో ఉపయోగించగ‌ల రూ.1,500 విలువైన డిస్కౌంట్ కూప‌న్ పొంద‌వ‌చ్చు. JioFiber రూ.899 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 100Mbps వేగాన్ని అందిస్తుంది మరియు ఇది మూడు నెలల తక్కువ చెల్లుబాటును కలిగి ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు Jio.com మరియు MyJio యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

Jio

అదేవిధంగా, రిల‌య‌న్స్ Jio ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్, రూ.999 ప్లాన్ గురించి తెలుసుకుందాం:
భార‌త దేశంలోనే అతిపెద్ద టెల్కో రిల‌య‌న్స్ Jio కంపెనీ రూ.399 ధ‌ర‌లో ఎంట్రీ లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ (ట్యాక్స్‌లు అద‌నం) అందిస్తోంది. ఈ ప్లాన్‌తో కంపెనీ 30ఎంబీపీఎస్ ఇంట‌ర్నెట్ వేగంతో 3.3టీబీ డేటాను అందిస్తోంది. ఇది నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా, వినియోగదారులు కంపెనీ నుండి ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ని పొందవచ్చు.

Jio బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ.999:
Airtel Xstream యొక్క రూ. 999 రేటుతో పోల్చినప్పుడు, Jio యొక్క రూ.999 ఇంటర్నెట్ ప్లాన్ అనేక రకాల OTT సబ్‌స్క్రిప్షన్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. నెలవారీ ప్యాకేజీ 150 Mbps వేగంతో ఉచిత వాయిస్ సంభాషణలతో పాటు అపరిమిత డేటాను అందిస్తుంది. Amazon Prime, Disney+ Hotstar, Voot Select, SonyLiv, Zee5, Voot Kids, Sun NXT, Hoichoi, Universal+, Lionsgate Play, Discovery+, JioCinema, ShemarooMe, Eros Now, ALT బాలాజీ మరియు JioSaavn సబ్‌స్క్రిప్షన్‌లు అందుబాటులో ఉన్న సేవలలో ఉన్నాయి. అలాగే, GST అదనంగా చేర్చబడుతుందని గ‌మ‌నించాలి. వినియోగదారులు 3.3TB డేటాను కూడా పొందుతారు.

Best Mobiles in India

English summary
Reliance JioFiber Festival Offer for broadband users Benefits Worth Rs.4,500
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X