ప్రతి నెలా 100 జిబి ఉచిత డేటాతో జియో ఫైబర్ బ్రాండ్ !

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన జియో ఇప్పుడు బ్రాడ్ బాండ్ రంగంలో సత్తా చాటేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

By Hazarath
|

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన జియో ఇప్పుడు బ్రాడ్ బాండ్ రంగంలో సత్తా చాటేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. బయటకొస్తున్న రిపోర్టుల ప్రకారం జియో ఫైబర్ నెట్ అతి త్వరలోనే దూసుకువస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం జియో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌కు చెందిన ఆస్తులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ డీల్ పూర్తి కాగానే జియో ఫైబర్ లాంచ్ తేదీలను ప్రకటిస్తుందని అనధికార రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

మోటో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, సొంతం చేసుకునేందుకు సదవకాశంమోటో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, సొంతం చేసుకునేందుకు సదవకాశం

జియోకు, ఆర్‌కామ్‌..

జియోకు, ఆర్‌కామ్‌..

జియోకు, ఆర్‌కామ్‌కు మధ్య జరుగుతున్న ఈ డీల్‌లో ఆర్‌కామ్‌కు చెందిన 850, 900, 1800, 2100 మెగాహెడ్జ్‌ బ్యాండ్స్‌లో 122.4 యూనిట్ల 4జీ ఎయిర్‌వేవ్స్‌ను జియో కొనుగోలు చేస్తోంది.తమ్ముడు నష్టాల్లో కూరుకుపోవడంతో రిలయన్స్ కమ్యూనికేషన్ ను జియో కొనుగోలు చేసిన సంగతి విదితమే.

ఒప్పందంలో భాగంగా

ఒప్పందంలో భాగంగా

ఈ ఒప్పందంలో భాగంగా 1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 43వేల టవర్లు జియో పరం కానున్నాయి. ఇప్పటికే వైర్‌లెస్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న జియో, 1,78,000 కిలీమీటర్లకు పైగా ఫైబర్‌ నెట్‌వర్క్‌తో భవిష్యత్తులో టెలికాం దిగ్గజాలకు భారీ షాక్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి.

 3,00,000 కిలోమీటర్ల..

3,00,000 కిలోమీటర్ల..

జియోకి ఇప్పటి వరకు 3,00,000 కిలోమీటర్ల ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఉందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. గ్రామ గ్రామాలకు జియోని విస్తరించాలంటే మరింత పైబర్ నెట్ వర్క్ అవసరం ఎంతైనా ఉంది.

ఆర్‌కామ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను..

ఆర్‌కామ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను..

ఇప్పుడు ఆర్‌కామ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను దక్కించుకున్న అనంతరం ఎక్కువ ప్రాంతాల్లో, చాలా వేగవంతంగా దీన్ని లాంచ్‌ చేయడానికి వీలవుతుందని టెక్‌ వర్గాలు తెలిపాయి.

 మూడు నెలల ట్రయల్‌ నేపథ్యంలో..

మూడు నెలల ట్రయల్‌ నేపథ్యంలో..

ఉచితంగా మూడు నెలల ట్రయల్‌ నేపథ్యంలో జియో ఎంపికచేసిన ప్రాంతాల్లో జియోఫైబర్‌ను అందుబాటులో ఉంచింది. జియోఫైబర్ ద్వారా కనీసం 100 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.

డేటా లిమిట్ దాటితే..

డేటా లిమిట్ దాటితే..

రిపోర్టుల ప్రకారం జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మొదటి 3 నెలలు ఉచితంగా అందుబాటులోకి రానుంది. నెలకు 100జీబీ చొప్పున యూజర్లకు డేటా ఉచితంగా లభిస్తుంది. 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వాడుకోవచ్చు.డేటా లిమిట్ దాటితే స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఇక ఇందుకోసం రూ.4500 వరకు సెక్యూరిటీ డిపాజిట్‌ను జియో వసూలు చేయవచ్చని తెలిసింది.

Best Mobiles in India

English summary
Reliance JioFiber Launch is Around the Corner, Expected to Offer Free Broadband Services With 100 Mbps Speed Initially more news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X