JioMart app: అధిక డౌన్‌లోడ్ లతో జియోమార్ట్ అద్భుతమైన రికార్డు...

|

ఇండియాలోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన రిలయన్స్ తన యూజర్ల కోసం కొత్తగా జియోమార్ట్ అనే యాప్ ను విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ లలో అడుగుపెట్టిన రిలయన్స్ జియోమార్ట్ ప్లాట్‌ఫాం యాప్ డౌన్‌లోడ్ల పరంగా ప్రభంజనాన్ని సృష్టిస్తున్నది. ఆపిల్ మరియు గూగుల్ యొక్క యాప్ స్టోర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ లలో ఇది మూడవ స్థానాన్ని దక్కించుకున్నది. అలాగే యాప్‌బ్రేన్ యొక్క డేటా ప్రకారం ఈ యాప్ ఇప్పటికే 10 లక్షలకు పైగా డౌన్‌లోడ్ లను నమోదు చేసుకున్నది.

 

జియోమార్ట్ షాపింగ్ ఆర్డర్స్

జియోమార్ట్ షాపింగ్ ఆర్డర్స్

జియోమార్ట్ ప్లాట్‌ఫాం యాప్ ఆధారంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ లక్షకు పైగా షాపింగ్ ఆర్డర్‌లను తీసుకుంటున్నదని సంస్థ వెళ్ళడించింది. మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి మరియు పేమెంట్ ఎంపికను మరింత సులభతరం చేయడానికి సోడెక్సో మీల్ కూపన్లను దాని ప్రస్తుత పేమెంట్ ఎంపికలకు జోడించింది.

 

Also Read: Redmi Note 9 Sale: గొప్ప ఆఫర్లతో నేడే మొదటి సేల్ ప్రారంభం..Also Read: Redmi Note 9 Sale: గొప్ప ఆఫర్లతో నేడే మొదటి సేల్ ప్రారంభం..

జియోమార్ట్ యాప్ బీటా మోడ్

జియోమార్ట్ యాప్ బీటా మోడ్

రిలయన్స్ RIL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ జియోమార్ట్ యాప్ యొక్క లభ్యతను బీటా మోడ్‌ ప్లాట్‌ఫామ్ లో దేశంలోని 200 నగరాల్లో ప్రకటించిన కొద్దిసేపటికే జియోమార్ట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. పైలట్ ప్రోగ్రాం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ జియోమార్ట్ మొత్తంగా 2,50,000 లావాదేవీలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

జియోమార్ట్ సేవల సౌలభ్యం
 

జియోమార్ట్ సేవల సౌలభ్యం

జియోమార్ట్ యొక్క సేవలు మరియు డెలివరీ సామర్థ్యాలను దేశం మొత్తం మీద ప్రారంభించడం మీద దృష్టి పెట్టింది. జియోమార్ట్ వినియోగదారులకు సులభమైన మరియు ఉన్నతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడంలో నిమగ్నమై ఉంది. కిరాణా సమానులతో పాటు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫార్మాస్యూటికల్ మరియు హెల్త్‌కేర్లను కూడా కవర్ చేయడానికి జియోమార్ట్‌ను విస్తరిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం అంతటా అన్ని నగరాలను కవర్ చేయనున్నట్లు కంపెనీ 43 వ AGM లో అంబానీ తన ప్రసంగంలో తెలిపారు.

జియోమార్ట్ ప్రాముఖ్యత

జియోమార్ట్ ప్రాముఖ్యత

జియోమార్ట్ అనేది ప్రస్తుతం ఇ-కామర్స్ రంగంలో రిలయన్స్ యొక్క తాజా ప్రయత్నం. వినియోగదారుల కోసం వారి ప్రాంతాలలోని స్థానిక కిరణా దుకాణాలతో అనుసంధానించడం ఈ ప్లాట్‌ఫాం యొక్క లక్ష్యం. ఇది కస్టమర్ మరియు విక్రేతల మధ్య సులభంగా కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్‌ను ప్రభావితం చేస్తుంది.

Best Mobiles in India

English summary
Reliance JioMart app Cross 1 Million Downloads

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X